Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రచార కోలాహలం

-జోరు పెంచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు.. గ్రామాల్లో విస్తృత పర్యటనలు
-గులాబీకి అండగా ప్రజలు.. ఖర్చుల కోసం విరాళాల అందజేత
-మహాకూటమి మాటలు నమ్మవద్దని ప్రజానీకానికి అభ్యర్థుల సూచన

గులాబీ అభ్యర్థులు ప్ర చారంలో జోరు పెంచారు. ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుస్తూ, వారితో మమేకమవుతూ ఓ ట్లు అభ్యర్థిస్తున్నరు…సీఎం కేసీఆర్ నేతృత్వంలో ని టీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో నాలుగేండ్లలో నే ఊహించనంత అభివృద్ధి జరిగిందని వివరిస్తున్నారు. గులాబీ పార్టీకి మద్దతుగా ఉండి, మరింత అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మహాకూటమి మాటలు నమ్మి మోసపోవద్దని, ఇంటిపార్టీ అయిన టీఆర్‌ఎస్‌తోనే అభివృ ద్ధి సాధ్యమని తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు. సోమవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లపాడులో ఎన్నికల ప్రచారం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాలుగేండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారని తెలిపారు.

రైతాం గం కోసం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటిపార్టీ టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని మంత్రి జోగు రామన్న కోరారు. ఆదిలాబాద్, బేల మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల కష్టాలు ఇంటి పా ర్టీకే అర్థమవుతాయని, ఆత్మగౌరవ నినాదంతో తె లంగాణ గడ్డ మీద పుట్టిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్సేనని అన్నారు. రెండ్లు కండ్ల సిద్ధాంతం నచ్చక ఎ మ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గెలిచానని చెప్పారు.

కూటమికి ప్రజలే గుణపాఠం చెబుతారు..
మాయాకూటమితో ప్రతిపక్షాలు జట్టుకట్టి ప్రజల ముందుకు వస్తున్నాయనీ, వాటికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పేర్కొన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పురాణం స తీశ్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 60 ఏండ్లలో ఏ పార్టీ చే యని అభివృద్ధి తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ నా లుగేండ్లలో చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీ ఆర్‌ఎస్ పార్టీ తప్ప మిగతా పార్టీలకు భవిష్యత్ లే దన్నారు. కాంగ్రెస్ నాయకులు, కోదండరాంతో చేతులు కలిపి ప్రజలను మోసం చేయడానికి కూ టమి పేరుతో ముందుకు వస్తున్నారనీ, వారిని ప్ర జలు నమ్మవద్దని సూచించారు. ఈ సందర్భంగా సుమన్‌కు చెన్నూర్ మండలం పొక్కూరు గ్రామస్థులు రూ. 6 వేలు విరాళంగా అందించారు. మం చిర్యాల అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు గెలవాలని ఆకాంక్షిస్తూ సాయిరాంనగర్‌లోని సాయిబాబా గుడిలో 30 మంది టీఆర్‌ఎస్వీ నేతలు 101 పొర్లు దండాలు వేశారు.

అభివృద్ధి చేసినోళ్లకే ఓట్లడిగే అర్హత..
అభివృద్ధి చేసినోళ్లకే ఓట్లు అడిగే అర్హత ఉంటుంద ని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్, రాంపూర్, జూపాక, బొత్తలపల్లి, సింగాపూర్, మాందాడిపల్లి, బోర్నపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఆ యన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో సమావేశమై మాట్లాడారు. కల్యాణలక్ష్మి, రైతుబం ధు, రైతుబీమా తదితర పథకాలు ఎవరూ అడుగకముందే పేద ప్రజల అభివృద్ధి కోసం తీసుకువచ్చామని చెప్పారు. సొంత స్థలాల్లో కూడా డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మించడానికి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని సూచనప్రాయంగా తెలిపారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్సేననీ, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్ కన్నాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. చొప్పదండి పరిధిలోని గంగాధర మండలం చెర్లపల్లి(ఎన్), మల్యాల మండలం మ ద్దుట్లలో టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ ప్రచారం చేశారు.

జగిత్యాల జి ల్లా మేడిపల్లి మండల కేంద్రంలో పీఎన్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్టీ మండలస్థా యి కార్యకర్తల సమావేశంలో ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు పాల్గొని మాట్లాడారు. టెస్కాబ్ చై ర్మన్ కొండూరి రవీందర్‌రావు గంభీరావుపేట మండలానికి చెందిన గంగపుత్రులతో సమావేశమయ్యారు. కథలాపూర్ మండలం చింతకుంట లో మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, సిరికొండ లో టీఆర్‌ఎస్ నేతలు, మహిళలు రమేశ్‌బాబుకు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి కాల్వశ్రీరాంపూర్ మండలం మడిపల్లి, అంకంపల్లి, ఆశన్నపల్లె, భీమారంపల్లి, మడిపల్లికాలనీలో ఇంటిం టా ప్రచారం చేశారు.

అన్నివర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్ లక్ష్యం..
హన్మకొండలో జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్‌ఎస్వీ ముఖ్య నాయకుల సమావేశానికి టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నే తృత్వంలోని టీఆర్‌ఎస్ సర్కార్ అన్నివర్గాల సం క్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఓర్వలేని విపక్షాలు మహాకూటమి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో తాజామాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కుడా చైర్మ న్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు. జనగామ అ భ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని నర్మెట మండలంలోని శ్రీ నాయిని వేంకటేశ్వరస్వామి ఆలయంలో దివ్యాంగులు ముడుపులు కట్టారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగ ర మండలం వడ్డెకొత్తపల్లిలో పార్టీ కార్యకర్తల స మావేశంలో పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్‌రావు పాల్గొన్నారు. ఎర్రబెల్లికి భారీ మెజార్టీ రావడం ఖాయమన్నారు.

నల్లగొండలో ఇంటింటా ప్రచారం..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్‌లో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. మిర్యాలగూడ అ భ్యర్థి నల్లమోతు భాస్కర్ జప్తివీరప్పగూడెంలో ప్రచారం చేశారు. దేవరకొండ అభ్యర్థి రవీంద్రకుమార్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి చందంపేట మండలం గువ్వలగుట్టలో ప్రచారం నిర్వహించారు. నాగార్జునసాగర్ అభ్యర్థి నోముల న ర్సింహయ్య అనుముల మండలంలో, తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్ శాలిగౌరారం మండలం ఎన్ జీ కొత్తపల్లిలో ప్రచారం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడేనికి చెందిన టీఆర్‌ఎస్ యూత్ సభ్యులు పాండురంగ భజన మందిరం నుంచి పాల్వంచలోని పెద్దమ్మ గుడి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఇల్లెందు అ భ్యర్థి కోరం కనకయ్య టేకులపల్లి మండలం బొ మ్మనపల్లిలో ఎన్నికల ప్రచారం చేశారు. జూలూరుపాడు మండలం వినోభానగర్లో వైరా టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ మధిరలో ప్రచారం చేశారు. సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవి తల్లాడలో బీసీ సెల్ మండల సమావేశం నిర్వహించారు.

అరటిపండ్లు అమ్ముతూ..
నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా నగరంలోని 41వ డివిజన్ పరిధిలో పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయం గా పలకరించారు. అరటిపండ్లు అమ్ముతూ, వృ ద్ధుల బాగోగులు తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు. ఆర్మూర్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి మళ్లీ తనను ఆశీర్వదించాల ని కోరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి, ఎన్కెపల్లి, గొల్లగూడ, కమ్మెట, ధర్మసాగర్, కుమ్మెర, మల్కాపూర్, ముడిమ్యాల, రావులపల్లి తదితర గ్రామాల్లో చేవెళ్ల అభ్యర్థి కాలె యాదయ్య ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌తో కలిసి ప్ర చారం చేశారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాం గ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్ర భాకర్ గెలుపును కాంక్షిస్తూ కంది మండలానికి చెందిన డీ శ్రీనివాస్ కందినుంచి యాదగిరిగుట్ట వరకు సైకిల్‌యాత్ర చేపట్టాడు. ఈ సైకిల్‌యాత్ర ను చింతా ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించా రు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాశ్‌నగర్ డివిజన్‌లో గుండెగుండెకు గులాబీ జెండా కార్యక్రమం జరిగింది. కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రా జు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

మహాకూటమి కాదు.. కాలకూట విషం
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం

ఎన్నికల సమయాన కాంగ్రెస్, టీడీపీలు ఏర్పాటుచేస్తున్న మహాకూటమి కాలకూట విషమని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీల పొత్తు విడ్డూరంగా ఉన్నదన్నారు. మంత్రి కేటీఆర్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార బాధ్యతలు తనకు అప్పగించారని తెలిపారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, వనపర్తి, గద్వాల, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని వెల్లడించారు. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కార్యకర్తలంతా టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం సమిష్టిగా కృషిచేయాలన్నారు.

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాం డ్ కాంప్లెక్స్ వ్యాపారులు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రచార ఖర్చుల కో సం రూ. 11 వేలు విరాళంగా అందజేశా రు. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రా మానికి చెందిన యువకులు ఎల్లారెడ్డి అభ్య ర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అభ్య ర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి వెంటే ఉంటామని పట్టణంలోని 1,2,3వ వార్డులకు చెందిన వడ్డెరలు, సిక్కులు ప్రకటించారు. ప్రచారానికి వచ్చిన జీవన్‌రెడ్డిని ఘనంగా సత్కరిం చి తల్వార్‌ను బహూకరించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన యాదవ కులస్థులు టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని తెలిపారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్‌లో యా దవ సంఘం, పోతిరెడ్డిపల్లెలో గ్రామస్థులు, సింగారంలో గౌడ సంఘ సభ్యులంతా మూకుమ్మడిగా గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎన్నికల ఖర్చు కోసం కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన మౌనిక రూ. 10,116 లు విరాళంగా అందజేసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.