Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రచారం.. వేగవంతం

-గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల విస్తృత పర్యటనలు
-అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: మంత్రి లకా్ష్మరెడ్డి
-పేదలు, రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపాం: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-అభివృద్ధి పథకాల అమలు టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం: మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
-మహాకూటమి మాయలో పడొద్దు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
-టీఆర్‌ఎస్ పథకాలు చూసి మరోసారి ఆశీర్వదించండి: మంత్రి చందూలాల్

తెలంగాణ రాష్ట్ర సమి తి అభ్యర్థుల ప్రచారపర్వం వేగం పుంజుకున్నది. నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రోజంతా ప్రచా రం చేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరిస్తున్నారు. ప్రజలతో మమేకమ వుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సీఎం కేసీఆర్ నా లుగున్నరేండ్ల కాలంలో అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని మంత్రి లకా్ష్మరెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మంత్రి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాష్ర్టాన్ని దోచుకునేందుకు అడ్డదారిలో వస్తున్న మహాకూటమికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఖిల్లాఘణపురం మండలంలో ప్రచారం చేశారు. మహబూబ్‌నగర్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ అప్పన్నపల్లి, ఏనుగొండ, హనుమాన్‌పూరలో ఇంటింటి ప్ర చారం చేశారు. మరికల్ మండల కేంద్రంలో నా రాయణపేట అభ్యర్థి రాజేందర్‌రెడ్డి, ఊట్కూరు మండల కేంద్రంలోని దళితవాడలో మక్తల్ అ భ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెల్కపల్లి మండలం కమ్మరెడ్డిపల్లిలో నాగర్‌కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.

ఒకేసారి లక్ష రుణ మాఫీ..
టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఒకేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కామారెడ్డి జి ల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్, సీతారాంపల్లి గ్రామాల్లో జుక్కల్ అభ్యర్థి హన్మంత్‌షిండేకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద, రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపామని తెలిపారు. బాన్సువాడలోని స్వగృహంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఒక్కో బూత్‌స్థాయి కార్యకర్త 60 మంది ఓటర్ల ను కలిసి వివరాలు సేకరించాలని తెలిపారు. నవంబర్ 14న బాన్సువాడలో నామినేషన్ వే స్తానని చెప్పారు.

కరీంనగర్ జిల్లాలో..
కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచార వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్ రేణికుంటలో ప్రచారం నిర్వహించారు. ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రహమత్‌పుర కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు. పెద్దపల్లి అభ్యర్థి మనోహర్‌రెడ్డి సుల్తానాబాద్‌లో ప్రచారం చేశారు. హు జూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంబీసీ, డీఎన్‌సీ సంక్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షుడు సంగెం సూర్యారావు పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో మీడియా సమావేశంలో మా ట్లాడుతూ వెనుకబడిన తరగతులు, సంచార జా తుల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనే క సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నా రు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధికంగా వచ్చేలా బీసీ, ఎంబీసీ, డీఎన్‌సీ కులాలు ఓట్లువేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి..
ఖమ్మం జిల్లా పాలేరు అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం, భగత్‌వీడు, శీతిలితండా, ఈశ్వరమాదారంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గాన్ని జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలన్నారు. ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమా ర్ నగరంలో, మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజు మధిర పట్టణం, చింతకాని, ముదిగొండ మండలాల్లో ఎంపీ పొంగులేటితో, సత్తుపల్లి అ భ్యర్థి పిడమర్తి రవి పట్టణంలో ప్రచారం చేశారు. సత్తుపల్లిలో జరిగిన నియోజకవర్గస్థాయి జలగం అభిమానుల ఆశీర్వాద సభలో కొత్తగూడెం అ భ్యర్థి జలగం వెంకట్రావ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడమర్తి రవి గెలుపు కోసం శ్రేణు లు కృషి చేయాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బావోజీతండాలో ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య, చర్ల మండలంలో భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట మం డలం మల్లాయిగూడెం, దుబ్బగూడెం, రామన్నగూడెం గ్రామాల్లో అశ్వారావుపేట అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ జిల్లా దేవరకొండ అభ్యర్థి రవీంద్రకుమార్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి చింతపల్లి మండలంలో ప్రచారం చేశారు. మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మర్రిగూడ మండలంలో, నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం రామన్నపేట మండలంలో, నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని 21వ వార్డులో, మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భా స్కర్‌రావు దొండవారిగూడెం, ఆదర్శనగర్‌లో తుంగుతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ నూతనకల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార దాహంతో జతకట్టిన మహాకూటమి మాయలో పడవద్దని మంత్రి అల్లోల ఇం ద్రకరణ్‌రె డ్డి ప్రజలకు సూచించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మరోసారి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పాలన అవసరమని అభిప్రాయపడ్డారు. తన నివాసంలో గురువారం పూజలు చేసిన మంత్రి.. ప్రచార రథంతో పార్టీ ముఖ్య నేతలతో కలిసి ప్రచారం చేశారు. అనేక దోపిడీలకు పాల్పడ్డ టీడీపీ.. కుట్రలు, మో సాలకు నిలయమైన కాంగ్రెస్, కనుమరుగవుతున్న కమ్యూనిస్టు పార్టీ, జనమేలేని జనసమితి కలిసి టీఆర్‌ఎస్‌పై పోటీ చేసేందుకు మహాకూటమిగా మారాయని ఎమ్మెల్సీ, ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా పార్టీ ఇంచార్జి నారదాసు లక్ష్మణ్‌రావు ధ్వజమెత్తారు.

మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహాకూటమి మాయాకూటమిగా మారిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీఆర్‌ఎ స్ అభ్యర్థులు గెలువడం ఖాయమన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం భీంజీతండాలో ఖానాపూర్ అభ్యర్థి రేఖానాయక్ ప్రచా రం నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విస్తృత ప్రచారం చేశారు. మడుత్తపల్లి గ్రామ మహిళలు ఎన్నికల ఖర్చు నిమిత్తం ఒకరోజు కూలీ డబ్బులను విరాళంగా అందించారు.

కూటమి మాటలు నమ్మొద్దు..
ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న మాయకూటమి మాటలను నమ్మొద్దని ములుగు అభ్యర్థి, మంత్రి అజ్మీరా చందూలాల్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో ఆయన ప్రచారం చేపట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి మ రోమారు ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్క ర్ కాజీపేటలో ప్రజా ఆశీర్వాద యాత్రను నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థించారు. జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి గెలుపు కోసం టీఆర్‌ఎస్ యూత్ వి భాగం నాయకులు బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చే శారు. మహబూబాబాద్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ నెల్లికుదురు మండలంలో ప్రచారం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మం డలం మల్లారెడ్డిపల్లి గ్రామస్థులు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. వర్ధన్నపేట అభ్యర్థి అ రూరి రమేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ అభ్యర్థి కేపీ వివేకానంద్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ప్రచారం చేశారు. గండిమైసమ్మ దుండిగల్ పరిధిలోని డీపోచంపల్లి, భౌరంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

వేరే పార్టోళ్లు తులం బంగారం ఇచ్చినా ఓటెయ్య..
టీఆర్‌ఎస్ పార్టీకే ఓటేస్తానని, మాట తప్పను అని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం దాసరిపల్లికి చెందిన వికలాంగ వృద్ధురాలు బోయ లక్ష్మమ్మ ప్రచారానికి వెళ్లిన టీఆర్‌ఎస్ శ్రేణులతో ఉద్విగ్నంగా చెప్పింది. ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి మద్దతుగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు గురువారం ఇంటింటా ప్రచారం చేస్తూ బోయ లక్ష్మమ్మ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతర పార్టీల నాయకులు నూరు మంది వచ్చి నా.. వేల రూపాయలు ఇచ్చినా.. తులం బంగారం పెట్టినా.. వాళ్లకు ఓటేయ్యను. నాలాంటోళ్లకు సాయం చేసిన దేవుడు సీఎం కేసీఆర్ సార్.. అందుకే ఆయనకే ఓటేస్తా.. మాటతప్పితే నాలుక కోసుకుంటానని పేర్కొంది.

టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం..
టీఆర్‌ఎస్ గెలుపును కాంక్షిస్తూ ఓ సాధారణ వ్యక్తి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడేనికి చెందిన గుండా అంజయ్య కాంగ్రెస్‌వాది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ సర్కార్ నాలుగేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితుడై ఇటీవలే పార్టీలో చేరాడు. ఎన్నికలు రావడంతో పార్టీ కండువాను మెడలో వేసుకుని, నెత్తిన టోపీ ధరించి, ప్రభుత్వ పథకాల ప్లకార్డును ప్రదర్శిస్తూ గ్రామంలో విస్తృత ప్రచారం చేస్తున్నాడు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే తమ బతుకులు బాగు పడుతాయని ప్రజలకు వివరిస్తూ ఇంటింటికీ తిరుగుతున్నాడు. అంతేకాదు నకిరేకల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశానికి ఎన్నికల ఖర్చు నిమిత్తం తనవంతు విరాళంగా రూ. 5వేలు అందజేశాడు.

పొత్తు ఖరారు కాకుండానే ఎందుకొచ్చారు?
హుజూరాబాద్‌లో టీపీసీసీ కార్యదర్శి కౌశిక్‌రెడ్డిని నిలదీసిన టీడీపీ నాయకులు హుజూరాబాద్‌టౌన్: పిలవని పేరంటానికి వ చ్చినట్టు మా సమావేశానికి ఎందుకు వచ్చా రు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు, టీపీసీసీ కార్యదర్శి పా డి కౌశిక్‌రెడ్డిని టీడీపీ నేతలు నిలదీశారు. క రీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో గురువారం టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగిం ది. ఈ సమావేశానికి కౌశిక్‌రెడ్డి హాజరుకావడంతో సైదాపూర్ మండలాధ్యక్షుడు పొడిశెట్టి వెంకట్రాజం సభావేదికపైనే నిలదీశారు. పొ త్తు ఖరారు కాకుండానే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి సైతం సీట్లు ఖరారు కాకముందే ఎవరికి వారు ప్రచారం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. అనంతరం కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ తాను కేవలం కార్యకర్తలను పరిచయం చేసుకునేందుకు మాత్రమే వచ్చానని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.