Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రచారంలో కారు జోరు

-నియోజకవర్గాల్లో పర్యటనలు, ఆశీర్వాద సభలతో బిజీగా మారిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు
-గులాబీ పార్టీని ఆదరించాలని వేడుకోలు.. అండగా ఉంటామంటున్న ప్రజలు
-ప్రతిపక్షాలను పాతరేయాలి: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
-దేశంలోనే నంబర్‌వన్ సీఎం కేసీఆర్: డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ
-ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టులు పూర్తిచేస్తాం: మంత్రి హరీశ్‌రావు
-తెలంగాణ వ్యతిరేక పార్టీలతో పొత్తులా?: మంత్రి జోగు రామన్న
-సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం: మంత్రులు జూపల్లి, లకా్ష్మరెడ్డి, మహేందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి అ భ్యర్థులు ప్రచారంలో వాడీవేడి పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సీ ఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉండి, తమను ఆదరించి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఆదివారం జరిగిన ప్రచారాలు, ఆశీర్వాద సభల్లో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాట్లాడుతూ అభివృద్ధి పథకా లు ఇలాగే కొనసాగాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఇవన్నీ సాధ్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని మంత్రి జోగు రా మన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదిలాబాద్‌లోని గాంధీనగర్, తిర్పెల్లి, ఖానాపూర్, ఖిల్లా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్రాంతాలకు వచ్చిన మంత్రికి స్థానికులు బ్యాండుమేళాలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసా న్ని ఎప్పుడో కోల్పోయాయని, ఎన్ని పొత్తులు పెట్టుకు న్నా టీఆర్‌ఎస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


అభివృద్ధిని చూసి ఆదరించాలి..

అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని ప్రభుత్వ సలహాదారు వివేక్ సూచించారు. మంచిర్యా ల జిల్లా లక్షెట్టిపేటలో మంచిర్యాల అభ్యర్థి నడిపెల్లి ది వాకర్‌రావుతో కలిసి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ని త్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు తీర్చే దివాకర్‌ను తిరిగి గెలిపించాలని కోరారు. మందమర్రి మండ లం శంకర్‌పల్లి, చిర్రకుంట, మామిడిగట్టు గ్రామాల్లో చెన్నూరు అభ్యర్థి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విస్తృ త ప్రచారం చేశారు. మహాకూటమికి ఓటేస్తే అభివృద్ధికి ఆటంకమేనని, తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. జన్నారం మండలం ఇందన్‌పల్లి, చింతగూడ, తపాలపల్లి గ్రామాల్లో ఖానాపూర్ అభ్యర్థి రేఖానాయక్ ప్రచారం చేశారు. కరీంనగర్ జిల్లాలో టీ ఆర్‌ఎస్ అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. జమ్మికుంటలో జరిగిన ఆశీర్వాద సభలో హుజూరాబా ద్ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కొ త్తపల్లి గ్రామంలో ముస్లింలతో మంత్రి సమావేశమయ్యారు. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. పలుచోట్ల గంగుల కు మద్దతుగా ప్రజలు ఆశీర్వాద సభలు నిర్వహించారు. సైదాపూర్ మండలం దుద్దెనపల్లి, పెరికపల్లి గ్రామాల్లో హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్‌కుమార్ ప్రచారం నిర్వహించారు. మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు మద్దతుగా ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు రేణికుంటలో ఇంటింటా ప్రచారం చేశారు.


చొప్పదండిలో భారీ ర్యాలీ..

చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గో పాల్‌రావుపేటలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెం కటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథని అభ్యర్థి పుట్ట మధు కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పె ద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి సుల్తానాబాద్ మం డలం నీరుకుళ్ల, గట్టేపల్లి, కదంబాపూర్, తోగర్రాయి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఎన్టీపీసీ మూడో డివిజన్‌లోని అన్నపూర్ణకాలనీలో పర్యటించి ప్రచారం చేశారు. శ్రీనివాసగార్డెన్‌లో ఏర్పాటుచేసిన ఆ శీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు కోనరావుపేట మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అజ్మీరతండావాసులు కారు గుర్తుకే ఓటువేస్తామని మ ద్దతు తెలిపారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన గాజర్ల న ర్సవ్వ, సుంక పోశవ్వ తమకు వస్తున్న వెయ్యి రూపాయల పింఛన్ డబ్బులు నామినేషన్ ఖర్చుల కోసం రమేశ్‌బాబుకు అందజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఆటోనగర్‌లో ఉన్న 650 కుటుంబాలు, వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామ మైనార్టీలు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉంటామని సంతకాలు చేసిన పత్రాన్ని మంత్రికి అందజేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్, వాజిత్‌నగర్, గుండెనెమ్లి, బండ రెంజల్, కందర్‌పల్లి గ్రామాల్లో జుక్కల్ అభ్యర్థి హన్మంత్‌షిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా నగరంలోని వినాయక్‌నగర్ ప్రాం తంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలని, కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఆర్మూర్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆర్మూర్, నందిపేట, మాక్లూర్ మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.


నృత్యాలు, బతుకమ్మలతో..

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మంత్రి లకా్ష్మరెడ్డి అభిప్రాయపడ్డారు. మ హబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరు పరిధిలోని యాసాయకుంట తండాలో మంత్రి ఎన్నికల ప్ర చారంలో పాల్గొన్నారు. నృత్యాలు చేస్తూ లంబాడీలు, బతుకమ్మలతో చిన్నారులు మంత్రికి ఘన స్వాగతం ప లికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు బాగుపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రెం డేండ్లలో జడ్చర్ల ప్రాంతానికి సాగునీరు రావడం ఖా యమన్నారు. నారాయణపేట నియోజకవర్గం ధన్వాడలో జరిగిన సమావేశంలో మంత్రి లకా్ష్మరెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ సమావేశమయ్యారు. నాగర్‌కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి తాడూరు మండలం తుమ్మలసూర్, పర్వతాయిపల్లి, ఇంద్రకల్ గ్రామాల్లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాల ని కోరారు. వంగూరు మండలంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములుతో కలిసి అచ్చంపేట అభ్య ర్థి గువ్వల బాలరాజు ప్రచారం నిర్వహించారు. వనప ర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గోపాల్‌పేట మండలంలో ప్రచారం చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని రాజ్‌పల్లిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. దేవరకద్ర అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రచారాన్ని విస్తృతంగా ని ర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎర్రుపాలెం మండలంలో ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. వైరా అభ్య ర్థి బానోత్ మదన్‌లాల్ ఏన్కూరు మండలంలో ప్రచా రం నిర్వహించారు. ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ రఘునాథపాలెం మండలం శివాయిగూడెం లో ప్రచారం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అభ్యర్థి జలగం వెంకట్రావ్ చుంచుపల్లి మం డలం బాదావత్ తండాలో ప్రచారం చేశారు. ఇల్లెందు అభ్యర్థి కనకయ్య టేకులపల్లి మండలం విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. బిల్లుడుతండాలో మహిళలతో కలిసి బతుకమ్మలు ఆడారు.


కొడంగల్‌లో..

వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో జరిగిన బంజార బహిరంగసభకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాంనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ని ప్రభుత్వాలు మారినా, సీఎంలు మారినా బంజారాల బతుకుల్లో మార్పులేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ బంజారాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. కొత్తగా గిరిజన గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రేవంత్‌రెడ్డి ఏనాడూ గిరిజనుల అభివృద్ధి కోసం పాడుపడలేదన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ శ్రీనగర్ కాలనీ డివిజన్‌లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మీర్ పేట నుంచి మహేశ్వరం వరకు జరిగిన ర్యాలీలో మంత్రి తలసాని, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహేశ్వరం అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


కోటి ఎకరాల మాగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం

ఆశీర్వాద సభల్లో మంత్రి హరీశ్‌రావు

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి వచ్చేఏడు గోదావరి జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేయాలని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలని సీఎం కేసీఆర్ ధృడ సంకల్పంతో ఉన్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 24వ వార్డు ఎన్జీవోస్ కాలనీ, సంతోశ్‌నగర్, అరుంధతి కల్యాణ మండపం, కొండా భూదేవి గార్డెన్, రెడ్డి సంక్షేమ భవన్, ఎస్‌ఎస్‌ఎస్ ఫంక్షన్‌హాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా జరిగిన ఆశీర్వాద సభలకు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిర్మాణాలు పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ పార్టీ అద్భుతమైన మ్యానిఫెస్టో తీసుకువస్తుందని వెల్లడించారు. అంతకుముందు పట్టణంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో కార్మికుల ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు యూనిఫాం ధరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో శాసనమండలి సభ్యుడు ఫారూఖ్‌హుస్సేన్, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.