Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రగతిబాటలో తెలంగాణ విద్య

-సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిష్ చదువులు ప్రారంభం
-పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి బోధన
-మైనారిటీల కోసం 206 గురుకులాలు
-13 లక్షల మందికి ఫీజు బకాయిల చెల్లింపులు
-ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెండు లక్షలకు చేరిన ప్రవేశాలు
-100 శాతం పెరిగిన కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు

తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నది. నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాలుగున్నరేండ్లలో ఊహించని విధంగా విద్యాభివృద్ధిలో పురోగతి సాధించింది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామీణులకు, పేదలకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకపక్క ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ.. మరోపక్క సంక్షేమశాఖలవారీగా కొత్తగా గురుకుల పాఠశాలలను నెలకొల్పుతూ సత్ఫలితాలకోసం కృషిస్తున్నారు. రానున్న ఐదేండ్లలో ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు హాస్టల్ సదుపాయాన్ని కల్పించేలా ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటుచేసి, రోల్‌మోడల్‌గా రూ.146.28 కోట్లతో గజ్వేల్ విద్యాహబ్‌ను నిర్మించి ఆకట్టుకుంటున్నది. ప్రభుత్వం చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కలిపి 1.30 లక్షల వరకు కొత్తగా ఎన్‌రోల్‌మెంట్ పెరిగింది. రాష్ట్రంలో 41,337 పాఠశాలల్లో కలిపి 58,66,786 మంది విద్యార్థులు చదువుతున్నారు. బోధన సిబ్బందికి కొరత రాకుండా టీఎస్‌పీఎస్సీ ద్వారా 8,972 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేపట్టింది. 15 వేల మంది విద్యావాలంటీర్లను నియమించారు.

ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్ష
2017-18 విద్యా సంవత్సరంలో 787 గురుకుల పాఠశాలల్లో మొత్తం 2,70,135 మంది విద్యార్థులు, 53 గురుకుల డిగ్రీ కాలేజీల్లో 16,160 మంది ప్రవేశాలు పొందారు. వీరికోసం రాష్ట్రప్రభుత్వం రూ.1,836.95 కోట్లు ఖర్చుచేసింది. అంటే ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున లక్షకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ది. 2018-19 బడ్జెట్‌లో అన్ని గురుకుల వి ద్యాలయాలకు కలిపి మొత్తంగా 2,823 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ వరకు ఉచిత బోధన, భోజనం, వసతి సదుపాయాలు, దుస్తులు, పుస్తకాలు, యూనిఫారాల వంటి సౌకర్యాలను కల్పించింది. చలికాలంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా రూ.15.82 కోట్లు ఖర్చుచేసి 1,88,348 మందికి రగ్గులను పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అన్ని రకాల గురుకుల విద్యాలయాలను బలోపేతం చేయడంకోసం టీఎస్‌పీఎస్సీ ద్వారా 8,434 ఉపాధ్యాయుల పోస్టులను నింపారు. ఒక్కొక్క గురుకులం భవనాన్ని రూ.1.50 కోట్లతో నిర్మించారు.

బాలికల కోసం కేజీబీవీలు ఏర్పాటు
రాష్ట్రంలో బాలికల కోసం 391 కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీలను) ఏర్పాటు చేశారు. 72,824 మంది బాలికలు చదువుతున్న ఆ స్కూళ్ల అభివృద్ధి, పిల్లల సంక్షేమం, వసతుల కోసం ప్రభుత్వం రూ.92.30 కోట్లు ఖర్చు పెడుతున్నది. కేజీబీవీలలోని 2,737 మంది సీఆర్టీ ఉద్యోగుల జీతాన్ని రూ.20వేలకు పెంచింది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్ల అభివృద్ధిపైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యారంగంలో వెనుకబడి ఉన్న ఆ ప్రాంతంలో అందరూ చదువుకోవడానికి వీలుగా పక్కా భవనాలను నిర్మించారు. అదనంగా బాలికల కోసం 150 వరకు హాస్టళ్లను నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా నూతన భవన నిర్మాణాలు, ప్రహరీలు, మరుగుదొడ్లు వంటి నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, ఆర్వో ప్లాంట్లు, బయోమెట్రిక్ మిషన్లు, సీసీ కెమెరాలతో సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పథకాలతో 44,588 పనులను చేపట్టారు. వాటిలో దాదాపు 40 వేలకు పైగా పనులను పూర్తిచేశారు.

సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధన
గ్రామీణ, పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ స్కూళ్లవైపు విద్యార్థుల దృష్టి మళ్లించేలా చర్యలు చేపట్టింది. తల్లిదండ్రులలో నమ్మకం పెంచడమే లక్ష్యంగా విద్యాబోధనలో సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ విద్యాబోధన మొదలుపెట్టారు.

పదివరకు తెలుగుభాష బోధన అనివార్యం
మాతృభాషలను, సంస్కృతులను పరిరక్షించుకోవాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించారు. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు తెలుగు తప్పనిసరి బోధనాంశంగా పెట్టి.. 2018-19 విద్యాసంవత్సరం అమలుచేస్తున్నారు.

13 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్
ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలతోపాటు వికలాంగులతో కలిపి మొత్తం 13 లక్షలమందికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుపరుస్తున్నది. 2014 నుం చి 2018 వరకు రూ.9,280 కోట్లను ఖర్చుచేసింది. 2018-19లో విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కోసం రూ.3,282 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధికి రూ.259 కోట్లు ఖర్చుచేసింది. ఉచితంగా ఇంటర్ విద్యను అందిస్తుండటంథక్ష నాలుగేండ్ల నుంచి.. ఇంటర్‌లో ప్రవేశాల సంఖ్య రెండు లక్షలకు పైగా పెరిగింది. పలురకాల సేవలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకురావడంతో పారదర్శకత నెలకొంటున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి 298 (261+37 జనరల్) గురుకులాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 663 గురుకులాలను ఏర్పాటుచేశారు. కొనసాగింపుగా మరో 53 గురుకుల డిగ్రీకాలేజీలను నెలకొల్పారు. బా లికల విద్యను ప్రోత్సహించేందుకు 30 మహిళా గురుకులాలను ఏర్పాటుచేయగా, ఉన్నతవిద్యలో డ్రాపౌట్ల సంఖ్యతగ్గింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలను ప్రభుత్వం 100 శాతం పెంచింది. కాంట్రాక్ట్ జూ.లెక్చరర్లకు రూ.37,100, పాలిటెక్నిక్ లెక్చరర్లకు రూ.40,270, డిగ్రీలెక్చరర్లకు రూ.40,270 చొప్పున జీతాలు పెంచారు. పార్టుటైం లెక్చరర్లకు, అటెండర్లకు 100 శాత ం జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.

మైనార్టీల కోసం 206 గురుకులాలు
రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కొత్తగా 192 మైనార్టీ గురుకుల విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గతంలో ఉన్న 14తో కలిపి మొత్తం 206 మైనారిటీ గురుకులాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురుకులాల ఏర్పాటుకు ప్రభు త్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.735 కోట్ల ను కేటాయించింది. ఎన్నడూలేనివిధంగా 2017-18 విద్యా సంవత్సరంలో 119 బీసీ గురుకులాలను ఏర్పాటుచేస్తూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. దీంతో పాతవి, కొత్తవి కలుపుకొని 280 బీసీ గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉంటాయి. ఈ గురుకులాల్లో 2019-20 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభంకానున్నాయి. వచ్చే ఐదేండ్లలో బీసీ గురుకులాల్లో 91,520 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 2018-19 విద్యా సంవత్సరంలో బీసీ గురుకులాల అభివృద్ధి కోసం రూ.296 కోట్లు కేటాయించారు. గురుకులాల అభివృద్ధికి నాలుగేండ్లలో కోసం రూ.561 కోట్లు కేటాయించడం విశేషం. రానున్న ఐదేండ్లలో అన్ని సంక్షేమ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలలో కలిపి మొత్తం 1,725 గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తేవడంతోపాటు వాటిలో 8,60,310 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పేద విద్యార్థులందరికీ ప్రభుత్వం పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌తోపాటు డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, వృత్తివిద్య కోర్సులో చదువుతున్న విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ఈ మేరకు ఏటా 14 లక్షల మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు లభిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నది. గురుకుల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. 27 తెలంగాణ గురుకుల విద్యాలయాలను జూనియర్ కాలేజీలుగా హోదా పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్తగా 405 పోస్టులను మంజూరు చేసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.