Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజారోగ్య రికార్డుల్లో తెలంగాణ భేష్

-ఆయుర్వేదం, యునానీపైనా శ్రద్ధ పెరుగాలి
-క్లస్టర్ ఇన్నోవేషన్లలో హైదరాబాద్ కీలకపాత్ర పోషించాలి
-బయోఏషియా సదస్సు కాఫీటేబుల్
-గోష్ఠిలో కేంద్ర ముఖ్య ఆర్థికసలహాదారు సుబ్రమణియన్
-వైద్య, ఆరోగ్యరంగాల్లో కేంద్రం జోక్యం ఎందుకు?
-ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైనది
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

ఆరోగ్యరంగాన్ని డిజిటలైజ్ చేస్తున్న ప్రక్రియలో తెలంగాణ విధానాలను కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ ప్రశంసించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కంటివెలుగు, త్వరలో ప్రారంభం కానున్న చెవి, ముక్కు, గొంతు పరీక్షలు ఇందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న బయోఏషియా సదస్సు రెండో రోజైన మంగళవారం షేపింగ్ ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ హెల్త్‌కేర్- ఏ పొలిటికల్ అండ్ ఎకనమిక్ పర్‌స్పెక్టివ్ అంశంపై కృష్ణమూర్తి సుబ్రమణియన్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మధ్య కాఫీటేబుల్ చర్చాగోష్ఠిని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి ప్రారంభోపన్యాసం చేయడంతోపాటు కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న ఇతరదేశాలతో పోలిస్తే వైద్యారోగ్యరంగంపై భారతదేశం చేస్తున్న ఖర్చు అధికంగానే ఉందన్నారు. అయితే, ఇప్పటికీ అందరికీ వైద్యం అందుబాటులోకి రాలేదని చెప్పారు. కొన్ని దేశాలతో పోలిస్తే వైద్యరంగంలో మనం వెనుకబడి ఉన్నాం.

ఇతరదేశాలతో పోలిస్తే మనదేశంలో ప్రజలు ఆరోగ్య సంరక్షణపై ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రంగం పై ప్రభుత్వాలు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. అల్లోపతితోపాటు ప్రత్యామ్నాయ విధానాలైన ఆయుర్వేదం, యునానీని ప్రోత్సహించాలి అని చెప్పారు. జెనరిక్ మెడిసిన్‌ను ఆహ్వానించిన తర్వాత ఔషధాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ఆరోగ్యరంగం లో సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిశోధనలు ఫలిస్తే, రాబోయే కాలంలో క్యాన్సర్ భయంకరమైన వ్యాధి కాకపోవచ్చునని పేర్కొన్నారు. క్లస్టర్ ఇన్నోవేషన్ జరుగాలని, హైదరాబాద్ వంటి క్లస్టర్లు ఇందులో కీలకపాత్ర పోషించాలని సుబ్రమణియన్ ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయాల్లో బేసిక్ రీసెర్చ్‌లు జరుగడం లేదని, ఈ విషయంలో మార్పు రావాలని చెప్పారు. దీంతోపాటు పరిశోధనల్లో ప్రభుత్వ భాగస్వామ్యం పెరుగాలని, మౌలిక సదుపాయాల పెంపు ద్వారా నూతన ఫలితాలు రాబట్టాలని ఆకాంక్షించారు.

తెలంగాణ విధానాలతో వైద్య సేవలు సులభం
తెలంగాణలో నిర్వహిస్తున్న కంటివెలుగు, తదుపరి దశలో చేపట్టే చెవి-ముక్కు-గొంతు పరీక్షలద్వారా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య స్థితిగతులను డిజిటలైజ్ చేయడం సంతోషకరమని సుబ్రమణియన్ చెప్పారు. ఇలాంటి విధానాలద్వారా వైద్యసేవలు అందించడం సులభం అవుతుందని ప్రశంసించారు. వైద్యారోగ్యరంగానికి సంబంధించి ప్రభుత్వ నియంత్రణ అవసరమే అయినా.. అది పరిమితస్థాయిలో ఉండాలనే కేటీఆర్ భావనతో ఆయన ఏకీభవించారు. కంపెనీలు తమ లాభాలు చూసుకుంటూనే ప్రజల ప్రయోజనాలు రక్షించాలన్నారు. వ్యాధులను ఎదుర్కొనేందుకు పరిశోధనలు మరింత పెరుగాలన్నారు. రాష్ర్టాలు- కేంద్రం సమన్వయంతో వైద్యసేవలు అందించాలని చెప్పారు.

వైద్య, ఆరోగ్యరంగాల్లో కేంద్రం జోక్యం ఎందుకు?: కేటీఆర్
వైద్యారోగ్య పరిశ్రమపై ప్రభుత్వ జోక్యం పెరిగిపోతున్నదనే వాదనను కేంద్రం పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ఔషధాలపై ఖర్చులు, కంపెనీల ప్రయోజనాలు అనే అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. మేకిన్ ఇండియా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడానికి కారణాలు, పరిష్కార మార్గాలను కేంద్రం అన్వేషించాలన్నారు. దేశీయ ఉత్పత్తి సహా ప్రపం చ పోటీని ఎదుర్కొనే సామర్థ్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. వైద్యారోగ్యానికి సం బంధించిన అన్ని అంశాల్లోనూ కేంద్రం ఎం దుకు జోక్యం చేసుకోవాలి? రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతంలోని చర్యలను సైతం ఢిల్లీ నిర్ణయించడం ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. వైద్యం, విద్యవంటి అంశాల్లో రాష్ర్టాలకు నిధులు, అధికారాలు కేటాయిం చి, కేంద్రం కీలకమైన విదేశీ, రక్షణ, అభివృద్ధి విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. ఆయుష్మా న్ భారత్ కంటే ఉత్తమమైన ఆరోగ్యశ్రీ తెలంగాణలో అమల్లో ఉందన్న కేటీఆర్.. తమ విధానంలో భాగం పంచుకోవాలని కేంద్రం కోరడం ఎందుకన్నారు. కంటివెలుగు ద్వారా దేశంలోనే తొలిసారిగా ప్రజలందరికీ కంటిపరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈఎన్టీ పరీక్షలు సైతం చేస్తామని చెప్పారు. ఇలా పూర్తి హెల్త్ ప్రొఫైల్ రూపొందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని తెలిపారు. సాంకేతిక వెసులుబాటు ఆధారంగా ప్రజల ప్రమాణాలు పెం చుతున్నామని, ఇదే రీతిలో వివిధ రాష్ర్టాల మధ్య అనుసంధానానికి కేంద్రం ఉత్తమ విధానాలు తీసుకోవాలని సూచించారు.

మా అన్న ఆరోగ్య సమస్య హైదరాబాద్‌లో నయమైంది
హైదరాబాద్‌తో తనకు, తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కృష్ణమూర్తి సుబ్రమణియన్ పంచుకున్నారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో నేను ప్రొఫెసర్‌గా పనిచేసిన తర్వాత మళ్లీ నగరానికి రావడం సంతోషంగా ఉన్నది. నా అన్నకు ఆస్తమా సమస్య ఉంటే ఎన్నో చికిత్స విధానాలను ఆశ్రయించినా ఫలితం లేదు. మిత్రుల ద్వారా హైదరాబాద్ చేప ప్రసా దం గురించి తెలుసుకున్నాం. చేప ప్రసాదం తీసుకున్న అనంతరం ఆయనకు ఆస్తమా పూర్తిగా నయమైంది అని వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.