Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజాసంతకానికి కృతజ్ఞతలు

-ప్రగతి నివేదనకు ప్రజల ఆమోదం గర్వకారణం -అభివృద్ధిలోనూ ఉద్యమస్ఫూర్తి సాధ్యమని సుస్పష్టం -మంత్రి కే తారకరామారావు

ప్రగతి నివేదన సభకు తరలివచ్చి మహాజాతరను తలపించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మెరుపువేగంతో సభకు సర్వం సిద్ధంచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను పేరుపేరునా అభినందించారు. ఉద్యమస్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్, బంగారు తెలంగాణగా నిర్మిస్తారనే విశ్వాసం సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలో నిండుగా కనిపించిందని పేర్కొన్నారు. ప్రతీపశక్తుల కుట్రలను ఛేదిస్తూ తెలంగాణను అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ దార్శనికతకు, రాజనీతిజ్ఞతకు దేశమే ఆశ్చర్యపోతున్నదన్నారు. సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రక మహాసభ నిర్వహణ, విజయంలో భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా వందనాలు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి నాయకత్వంలో నడుస్తున్న స్వయంపాలనలో, గత నాలుగేండ్ల అభివృద్ధిని సమీక్షించుకుంటూ జరిపిన ప్రగతి నివేదన సభకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా హాజరైన తెలంగాణ అన్నలు, అక్కలు, తమ్ములు, చెల్లెండ్లు, పెద్దలు.. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

ఆదివారం కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చరిత్రలోనే కాదు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందని చెప్పడానికి నేను గర్వంగా ఫీలవుతున్నాను. పార్టీ అధినేత, మన అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదన సభ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని అనతికాలంలోనే అమల్లోకి తెచ్చి సక్సెస్ చేయడంలో తోడ్పాటునందించిన, ఇందుకు సహకరించిన పార్టీ అభిమానులు, పార్టీ పెద్దలు మిత్రులు సహచర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు అన్నిస్థాయిల ప్రజాప్రతినిధు లు ముఖ్యంగా కార్యకర్తలకు పేరు పేరునా అభినందనలు. ఆగస్టు 13న గౌరవ సీఎం గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 23 నుంచి సన్నాహక ఏర్పాట్లకు సిద్ధమైన మనం, 25వ తేదీన అం దుకు సంబంధించిన 9 కమిటీలను వేసుకున్నం. నాతో సహా స్థానిక మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యే లు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శి మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిపి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి అనుబంధంగా 9 కమిటీలను ఏర్పాటు చేసుకున్నం. ప్రధాన వేది క నిర్మాణం, పార్కింగు స్థలాల గుర్తింపు ఏర్పాట్లు, సభాస్థలిని చదును చేయడం, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం, బారికేడ్లను ఎక్కడికక్కడ పకడ్బందీగా నిర్మించడం, ఫొటో గ్యాలరీ ఏర్పాటు, మీడియా సమన్వ యం, వైద్యసదుపాయాలు సహా తాగునీటి భోజన వసతులను ఏర్పాటు చేయడం, శానిటేషన్ వ్యవస్థను ఏర్పాటుచేయడం దగ్గరి నుంచి సభ ముగిసిన మరునాడే సభా ప్రాంగణంలోని చెత్తాచెదారాన్ని తొలిగించే ఏర్పాట్లదాకా పర్యవేక్షించిన కమిటీ బాధ్యులకు అందుకు సహకరించిన వాలంటీర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇవాళ మన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక మన రాష్ర్టాన్నే కాదు దేశాన్ని ప్రపంచాన్నీ ఆకర్షిస్తున్నది. ఈ సందర్భంలోంచి మన ప్రగతి నివేదన సభ దిగ్విజయంగా జరుపుకొన్నం. ప్రజల ఆశీస్సులను, ఆమోదాన్ని పొందినం. ఈ సభ విజయం సాధించిన తీరు మనందరికీ గర్వకారణంగా నిలిచింది.

సభకు తెలంగాణ వ్యాప్తంగా సబ్బండవర్ణాల ప్రజలు ఒక మహా జాతరకు వచ్చినట్టు తరలిరావడం గమనార్హం. ఇచ్చినమాట ప్రకారం తమ తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చినందుకు గిరిజన సోదరులు పెద్దసంఖ్యలో వచ్చిండ్రు. అట్లాగే వివిధ కులవృత్తులకు చెందిన సోదరు లు, దళిత, మైనార్టీ సోదరులు, మహిళలు భారీ సంఖ్యలో ఈ సభలో పాల్గొన్నరు. ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నారై టీఆర్‌ఎస్ ప్రతినిధులు కూడా ఈ సభకు హాజరయ్యిండ్రు. రెండ్రోజుల ముందే సభకు బారులుదీరిన వేలాది ట్రాక్టర్లలో రైతన్నల చిత్రాలు అనేక జాతీయ మీడియా సంస్థల్లో కూడా ప్రముఖంగా కనిపించినయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రైతు సంక్షేమ పాలనకు సభకు పోటెత్తిన రైతులే తార్కాణం. ఈ విజయోత్సాహం సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించదలిచాను. పద్నాలుగేండ్లు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ రాష్ట్ర సమితికి బహిరంగ సభలు కొత్తేమీ కాదు. మన అధినేత కేసీఆర్ గారి ఆదేశాలు, సూచనల మేరకు అత్యంత భారీస్థాయిలో వరంగల్, కరీంనగర్, హైదరాబాదుల్లో ఉద్యమ సమయంలోనూ తదనంతర కాలంలోనూ అనేక సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం తెలంగాణ నాయకులకు, కార్యకర్తలకు ఉన్నది. కానీ ఇవాల్టి ప్రగతి నివేదన సభ ఒక కొత్త ప్రశ్నను మన ముందుకుతెచ్చింది. అదేమిటంటే.. ఉద్యమ కాలం నాటి స్ఫూర్తిని పాలనాకాలంలో కూడా కొనసాగించడం సాధ్యమా.? అంటే అవునని నిన్నటి సమావేశం నిరూపించిం ది. ఉద్యమాల నేపథ్యం పాలనా నేపథ్యం.. పోరాటాల సందర్భంగా ఉండే భావోద్వేగాలు, ప్రజల భాగస్వామ్యం.. పాలనా సందర్భంగా ప్రజల భావోద్వేగం వేర్వేరుగా ఉంటుంది కదా అని మీరంటరేమో కానీ.. తెలంగాణ ప్రజలు అందుకు భిన్నంగా వ్యవహరించిన్రు. తెలంగాణను సాధించుకోవాలనే నాటి ప్రజల్లోని ఉద్యమస్ఫూర్తి, అభివృద్ధి ప్రస్థానంలోనూ ఏ మాత్రం తగ్గలేదు.

సాధించుకున్న తెలంగాణను అధినేత కేసీఆర్ నిర్వచించిన విధంగా బంగారు తెలంగాణగా మార్చుకోవాలనే పట్టుదల, స్ఫూర్తి హాజరైన ప్రతి కార్యకర్త మొహంలోనూ నాకు కనిపించింది. తెలంగాణను ముందుండి సాధించిపెట్టిన కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ నిర్మా ణమవుతుందనే విశ్వాసమూ వారిలో నిండుగా కనిపించింది. ఒకసారి తెలంగాణ సాధించుకున్న తొలినాళ్ల అంశాలను ప్రగతి నివేదన మూల్యాంకన సందర్భంగా నెమరు వేసుకుందాం. మనం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది పేరుకు నాలుగేండ్లయినా, అందులో మొదటి రెం డేండ్లు మనల్ని మనం సదురుకోవడానికే సరిపోయింది. రాష్ట్ర విభజన అయితే జరిగింది కానీ అందుకు తగ్గట్టుగా ఉద్యోగుల విభజన కానీ, కార్యాలయాల విభజన కానీ రాష్ర్టాన్ని నడిపించడానికి కావాల్సిన హం గుల ఏర్పాట్లు ఏ మాత్రం జరుగలేదు. అరకొర ఏర్పాట్లతోనే తెలంగాణను నడుపుకుంటూ వచ్చిన్రు మన మఖ్యమంత్రి కేసీఆర్ గారు. వేరుబడ్డ సంసారానికి ఎన్ని తీర్ల సహకారం అందితే అది కుదురుకుంటదో మనందరికి తెలిసిందే. కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణకు సహకారం లభించకపోగా అటు కేంద్రం నుంచి ఇటు గత పాలకుల నుంచీ మనకు సహాయనిరాకరణ ఎదురైంది. వాటితో పాటుగా అడుగడుగునా ఇంటిదొంగల అడ్డంకులు మీకు తెలిసినవే. వీటన్నిటినీ తట్టుకుంటూ అందరి కుట్రలను భగ్నంచేస్తూ తెలంగాణను విఫల తెలంగాణగా మార్చే ద్రోహ పు చింతనలను బద్దలు కొడుతూ.. ఇవాళ తెలంగాణను దేశానికే ఒక అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దడం అనేది అనితర సాధ్యమైన విషయం. ఇదే విషయం మీద ఇవాళ దేశం చర్చించుకుంటున్నది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి దార్శనికతకు రాజనీతిజ్ఞతకు దేశం ఆశ్చర్యపోతున్నది.

ఇవాళ మన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక మన రాష్ర్టాన్నే కాదు దేశాన్ని ప్రపంచాన్నీ ఆకర్షిస్తున్నయి. ఈ సందర్భంలోంచి మన ప్రగతి నివేదన సభ దిగ్విజయంగా జరుపుకొన్నం. ప్రజల ఆశీస్సులను, ఆమోదాన్ని పొందినం. ఈ సభ విజయం సాధించిన తీరు మనందరికీ గర్వకారణం గా నిలిచింది. ఈ చరిత్రాత్మక మహాసభ నిర్వహణలో దాని విజయంలో నాకూ భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా వందనా లు తెలుపుకుంటున్నాను. ఈ సభ విజయవంతం కావడానికి సహకరించిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, యాజమాన్యాలకు, సోషల్ మీడియా ద్వారా సహకరించిన మిత్రులకు, బందోబస్తు మొదలుకొని ఇతర ఏర్పాట్లలో సహకరించిన వివిధ డిపార్ట్‌మెంట్ల వారి కి, హాజరైన నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు. (వ్యాసకర్త: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి )

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.