-ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి -83 శాతంతో ముందున్న కేసీఆర్.. -బీహార్ సీఎం నితీష్‌కూ అదే ఆదరణ -అంశాల వారీగా దిగజారిపోయిన మోడీ పాలన, -పుంజుకున్న రాహుల్

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వరాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా నిలిచారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే, కార్వీ ఇన్‌సైట్స్ సంస్థతో కలిసి చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వివిధ రాష్ర్టాల్లో ఆయా ముఖ్యమంత్రులకున్న ప్రజాదరణ మీద ప్రజాభిప్రాయాన్ని ఇందులో సేకరించారు. 83 శాతం ప్రజల మద్దతులో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందున్నారు. బీహార్ సీఎం నితీష్‌కుమార్ కూడా అదే స్థాయిలో 83శాతం ప్రజాదరణ సాధించారు. ప్రతి రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రుల పాలనలోని వివిధ అంశాల మీద ప్రజల అభిప్రాయం మీద జరిపిన సర్వే ఆధారంగా ఆయా సీఎంల గ్రాఫ్‌ను లెక్కగట్టారు. రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో సీఎం కేసీఆర్ పాలనకు 83శాతం ప్రజలు జేజేలు పలికారు. కాగా ఈ సర్వేలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ 80శాతం, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ 79శాతం, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ 35శాతం ప్రజల మద్దతు పొందారు.