టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్ నగరం అనతికాలంలోనే అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందుతుంది.. తెలంగాణ రాష్ట్రం ప్రజలది, టీఆర్ఎస్ ప్రజలపార్టీ అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ మజీద్‌బండలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ,కాంగ్రెస్‌లకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ మాట్లాడుతూ సమైక్యపాలనలో కోట్లాది రూపాయల విలువైన రాజధాని భూములను అన్యాకాంత్రం చేశారే తప్ప, అభివృద్ధి చేయలేదన్నారు. -ఎక్కడాలేని సంక్షేమ పథకాలు ఇక్కడే: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ -జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురడం ఖాయం: మంత్రి తుమ్మల -సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్కు వలసలు: మంత్రి జగదీశ్‌రెడ్డి -హైదరాబాద్, సూర్యాపేటలో గులాబీ గూటికి చేరిన వేలాది మంది

కోటి జనాభాకు చేరిన మహానగరంలో కనీస వసతులు లేని దుర్భర స్థితి కల్పించారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి అందరం అండగా నిలువాలన్నారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే అదర్శగా తీర్చిదిద్దడానికి తోడ్పడాని కోరారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వరంగల్ ఉపఎన్నిక తర్వాత ఎక్కడ చూసినా టీఆర్ఎస్ హవా కనిపిస్తున్నదన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు హమీద్‌పటేల్, రామస్వామియాదవ్, గోవర్ధన్‌తో పాటు వేలాది మంది టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో కొమరగౌని శంకర్‌గౌడ్, మొవ్వా సత్యనారాయణ, రాగం సుజాత నాగేందర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఏడాదిన్నరలోనే అభివృద్ధి చేశాం: మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట,చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 600 మంది సూర్యా పేటలో సోమవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 60 ఏండ్లుగా జరగని అభివృద్ధిని ఏడాదిన్నరలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. సూర్యాపేట ఏడో వార్డు కౌన్సిలర్ గునగంటి వంశీ, ఆత్మకూర్.ఎస్ మండలం కోటపహాడ్ టీడీపీ గ్రామాధ్యక్షుడు బీ దామోదర్‌రెడ్డి, మంజుల, దొంతరబోయిన సైదులు, బీ లింగారెడ్డి, చివ్వెంల మండలం కుడకుడకు చెందిన గొట్టేటి లింగమ్మ టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళికప్రకాశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.