Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజలు గెలువాలి

-అదే నిజమైన ప్రజాస్వామ్యం
-దాచుకొని.. దాచుకొని దయ్యాలకు అప్పగిద్దామా?!
-అటు 58 ఏండ్ల దుర్మార్గపాలన.. ఇటు నాలుగేండ్ల సుపరిపాలన
-అభివృద్ధి, సంక్షేమం మీ కండ్ల ముందే ఉన్నాయి
-టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ ఉచిత కరంటు
-రాజ్యమేలనున్న 3500 మంది గిరిజన మిత్రులు
-గిరిజన, ముస్లిం రిజర్వేషన్లు సాధించి తీరుత
-ఫెడరల్ ఫ్రంట్‌తోనే మన సమస్యలకు పరిష్కారం
-ప్రజాఆశీర్వాద సభల్లో సీఎం కే చంద్రశేఖరరావు
-రిటైర్డ్ ఉద్యోగులకు ప్రత్యేకంగా డైరెక్టరేట్
-బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం సింగరేణికి
-ఇనుగుర్తిని మండల కేంద్రం చేస్తం
-కేసముద్రం టౌన్‌ను మున్సిపాలిటీ చేస్తం
-డోర్నకల్‌కు జూనియర్ కాలేజీ
-6 నెలల్లో పోడుభూములకు పరిష్కారం
-తుంగతుర్తిలో 100 పడకల దవాఖాన
-జనగామలో మెడికల్ కాలేజీ
-సూర్యాపేటలో డ్రైపోర్టు

ప్రజలు గెలిచినదే నిజమైన ప్రజాస్వామ్యమవుతుందని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రజలకు ఏది మంచిది అయితదో ఆవైపు బలపరిస్తేనే మంచి జరుగుతుందన్నారు. ఎలక్షన్లు వచ్చాయని ఆగమాగం కావద్దన్న సీఎం.. నాయకులు, పార్టీలు కా దు.. ఎన్నికల్లో ప్రజలు గెలిచినప్పుడే ప్రజాస్వామ్యంలో బ్రహ్మాండంగా పనులు జరుగుతాయని చెప్పారు. 58 ఏండ్లు దుర్మార్గంగా పాలించిన కాంగ్రెస్, టీడీపీ కూటమి ఒకవైపు, దశాబ్దంన్నరపాటు పోరాటంచేసి తెలంగాణ సాధించుకుని నాలుగున్నరేండ్లు పరిపాలించిన టీఆర్‌ఎస్ ఒకవైపు ఉన్నాయని, ఎవరి పాలనలో ఏం జరిగిందో, ఎవరు ఎలా పాలించారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని నాలుగున్నరేండ్లుగా అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇప్పుడు దాచుకొని.. దాచుకొని.. దయ్యాలకు అప్పగిద్దా మా? అని ప్రశ్నించారు.

రాష్ట్రమంతా గులాబీ ప్రభంజనం కనిపిస్తున్నదని చెప్పారు. సభలకు వస్తున్న ప్రజలను చూస్తే టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమైందన్నారు. శుక్రవారం నర్సంపేట, మహబూబాబాద్, మరిపెడ, సూర్యాపేట, తిరుమలగిరి, జనగామలో నిర్వహించిన టీఆర్‌ఎస్ సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు ఆనాడు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇయ్యనంటే రాజీనామా చేయలేదని విమర్శించారు. పదవులకోసం ఆంధ్ర సీఎంల సంచులుమోసి బతికారని మండిపడ్డారు. పౌరుషం, రోషంలేని ఈ కాంగ్రెస్ నాయకులు.. చిల్లర రాజకీయంకోసం ఏపీ సీఎం చంద్రబాబును భుజాల మీద తెచ్చి మళ్ల తెలంగాణ మీద వలస పెత్తనం రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అది చాలా పెద్ద ప్రమాదమని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ఉద్యమకారుడిగా, మీ బిడ్డగా మీకు ఈ విష యం మనవి చేస్తున్నానన్నారు. తాను చెప్పిన మాటల్ని గ్రామాల్లో చర్చించి.. ఏది నిజమో? ఏది అబద్ధమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. వివిధ సభల్లో సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..

గిరిజన సర్పంచులదే రాజ్యం
గిరిజన గూడేలను పంచాయతీలు చేయాలని ఏండ్లతరబడి గిరిజనులు కొట్లాడినా ఏ ప్రభుత్వాలు చేయలే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినంక ఏర్పాటుచేసినం. ఈ ఎలక్షన్లు అయిన నెలరోజులకు పంచాయతీ ఎన్నికలు జరుగుతయి. రాష్ట్రవ్యాప్తంగా 3,500 పైచిలుకు గిరిజన మిత్రులు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లయి రాజ్యమేలే పరిస్థితి వస్తుంది.. గిరిజన మిత్రుల భూములకు రైతుబంధు చెక్కులు, హక్కులు రావాలి. అప్పులు తీసుకునే పరిస్థితి ఉండాలి. ప్రభుత్వం వచ్చిన ఆరునెలల్లో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్త.

గిరిజన, ముస్లిం రిజర్వేషన్లు సాధించి తీరుత
తెలంగాణ ఏర్పడింది. కాబట్టి.. గిరిజనుల జనాభా పెరిగింది. రాజ్యాంగబద్ధంగా హక్కు ఉంది. రిజర్వేషన్లు పెరుగాలి. మీకు తెలుసు.. కేసీఆర్ ఏదైనా పట్టుబడితే సాధిస్తడు. తెలంగాణ సాధించినం. రిజర్వేషన్లు ఒక లెక్కకాదు. అసెంబ్లీలో తీర్మానం చేసినం. క్యాబినెట్‌లో నిర్ణయించినం. అనుమతికోసం కేంద్రానికి పంపినం. కేంద్రంలో ఉన్న మోదీ సర్కారుకు ఒక బీమారీ ఉన్నది. ఆయన హిందువులు, ముస్లింలనే మతపరమైన పిచ్చిలో ఉంటరు. అందుకే ముస్లిం రిజర్వేషన్లతోపాటు గిరిజనులది కూడా ఆపేసిండ్రు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే. అధికారాలను వారి చేతి లో పెట్టుకుని రాష్ట్రాలమీద కర్రపెత్తనం చెలాయించే సంస్కృతి. ఇది పోవాలె. ప్రజలకు అనుగుణంగా దేశం నడువాలంటే కచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. ఫెడరల్ ఫ్రంట్‌తో నాన్ కాంగ్రెస్.. నాన్ బీజేపీ ప్రభుత్వం రావాలి. రాష్ట్రంలో 17కు 17 స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిచి, సీతారాంనాయక్‌కూడా ఐదులక్షల మెజార్టీతో గెలిచి.. బ్రహ్మాండంగా ఢిల్లీలో పోరాటంచేసే పరిస్థితి ఉండాలి. అది మీ చేతుల్లో ఉన్నది. కేంద్రంలో అధికా రం ఇస్తే.. వందకు వందశాతం ఎస్టీ రిజర్వేషన్లు తెచ్చిచ్చే బాధ్యత నాది.

ఆషామాషీగా ఓట్లేయొద్దు..
టీఆర్‌ఎస్‌కన్న మందు 58 ఏండ్లు ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్, టీడీపోళ్లే. టీఆర్‌ఎస్ నాలుగున్నరేండ్లు ఉంది. ఆనాడు తండాల్లో కరంటు ఎలా ఉన్నది. ఇప్పుడెలా ఉన్నది? ఓటువేసే ముందు ఆలోచించాలి. ఎలక్షన్లంటే మస్తుగా వచ్చి మస్తు స్టోరీలు చెప్పుతరు. నేను కూడా చెప్పుతున్నవి అబద్ధమా? నిజమా? తండాలలో చర్చ జరుగాలె. ఎవరు గెలిస్తే మన తలరాతలు మార్చుతరో, మనకు మంచి పనులు ఎవరు చేస్తరో తెలుసుకోవాలె. అటువైపు పోవాలె. నేను ఢిల్లీ, బొంబాయి కథ చెప్పుతలేను. మీ తండాలో.. మీ ఉర్ల సంగతి చెప్పుతున్న. అన్నిరంగాల్లో సంక్షేమాన్ని బాగా పెంచుకున్నం. గురుకులాలు ఏర్పాటుచేసి, ఒక్కొక్క విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చుపెట్టి ఇంగ్లిష్ మీడియం చదువులను చదివిస్తున్నం. మన గిరిజన, మైనార్టీ, బీసీ, దళిత బిడ్డలకు ప్రపంచంతో పోటీపడే పటిష్ఠమైన విద్య అందిస్తున్నం. కంటివెలుగు పథకం కింద ఊరూరికి వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తున్నరు. ఉచితంగా మందులు, కంటి అద్దాలు ఇస్తున్నరు.

మళ్లీ లక్ష రూపాయల రుణమాఫీ..
ఈ సభలో ఎవరన్నా రెండు లక్షల అప్పులున్నోళ్లు ఉన్నారా? లేరు కదా! అందరం పేదవాళ్లం. రెండు లక్షల రుణం ఉన్నవారు ఆఫ్ పర్సెంటో, రెండు పర్సెంటో ఉం టరు. పోయినసారి రూ. లక్ష లోపు రుణమాఫీ చేసుకు న్నం. మళ్లీ ప్రభు త్వం రాగానే రూ. లక్ష రుణమాఫీ కచ్చితంగా చేసుకుంటం.

గులాబీ జెండా ఉన్నన్ని రోజులు ఉచిత కరంటు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రైతాంగానికి ఉచిత కరంటు వస్తది. అది నా బాధ్యత. కచ్చితంగా కోటి ఎకరాలకు సాగునీరు తెస్తున్నం. కాంగ్రెస్, టీడీపీ హయాం లో ఎస్సారెస్పీ కాల్వల్లో చెట్లు మొలిసినయి. ఇప్పుడు కాల్వలన్నీ బాగుచేయించినం. రాబోయే జూన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు స్విచాన్ అయిన తర్వాత రెండుపంటలకు సరిపోను మహబూబాబాద్ నియోజకవర్గంలో పుష్కలంగ నీళ్లుతెచ్చే బాధ్యత నాది. నీళ్లు వస్తయి.. కరంటు ఉచితంగ వస్తది.. రైతుబంధు, రైతుబీమా స్కీం లు కూడా కొనసాగుతయి. రైతుబీమాను చూసి ప్రపంచమే ఆశ్చర్యపడుతున్నది. ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన పది ఉత్తమ కార్యక్రమాల్లో రైతుబంధు కూడా ఉన్న ది. రైతుకు ఒక్క గుంట భూమి ఉన్నా బీమా వర్తిస్తున్నది.

ఇదే ఊపున సంక్షేమం.. అభివృద్ధి
ఆసరా పింఛన్లు ఇప్పుడు వెయ్యిరూపాయలు ఇస్తున్నం. వచ్చే ప్రభుత్వంలో రూ.2016కు పెంచుతున్నం. దివ్యాంగులకు ఇచ్చేది.. రూ.1500 నుంచి రూ.3016 పెంచు తం. నిరుద్యోగ యువతకు రూ.3016 భృతి ఇస్తం. రైతుబంధు కూడా ఎకరానికి సంవత్సరానికి రూ.8వేల నుంచి రూ.10వేలు ఇచ్చుకుంటం. ఈ పద్ధతిలో సంక్షేమాన్ని కొనసాగించాలి. ఈ పనులన్నీ జరుగాలి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని అడిగినం. వాళ్ల అయ్యముల్లె పోయినట్టు ఢిల్లీ సర్కారు మేనల్లుళ్ల లెక్క మాట్లాడినారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మనం కూడా పెట్టుకోవచ్చు. అవసరమైతే మన సింగరేణి సంస్థకే అప్పగించి రాబోయే టర్మ్‌లో మనం ఆ సమస్యను పరిష్కరించుకుందం. ఈ ప్రాంత యువతకు బ్రహ్మాండంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.