Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రతి పల్లెలో సమగ్ర సేవా కేంద్రాలు..

-బాధలు, కన్నీళ్లు లేని రాష్ట్రంగా తెలంగాణ -గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాం -కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally-Krishna-Rao-interview-with-Namasthe-Telangana

తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షలు, బాధలు, కన్నీళ్లను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాధలు, కన్నీళ్లు లేని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ప్రజల అవసరాలు గుర్తించి సంక్షేమ పథకాలను రూపొందించడమే కాకుండా, కేటాయించిన నిధులను పూర్తి పారదర్శకతతో ఖర్చు చేస్తున్నామని అన్నారు. ప్రతి పల్లెలో సమగ్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తామంటున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ‘జూపల్లి కృష్ణారావు’తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. రెండు ప్రభుత్వాలను బేరీజు వేసుకుంటే పరిపాలన ఎలా ఉంది? చాలా తేడా ఉంది. గతంలో ప్రభుత్వాలు ఎన్నికల ద్వారా వచ్చాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమంనుంచి వచ్చింది. ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, బాధలు, కన్నీరు అవగతం చేసుకుంది. ఆ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు, బంగారు తెలంగాణ నిర్మాణానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రజోప్రయోగకరమైన కార్యక్రమాలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్నారు.

తొలుత పరిశ్రమలు, జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీ బాధ్యతల నిర్వహణపై సంతృప్తికరంగా ఉన్నారా? చాలా సంతృప్తికరంగా, ఆనందంగా ఉంది. పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు సంతృప్తినిచ్చాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలనుంచి పుట్టిన టీఎస్‌ఐపాస్ నేడు దేశానికి మార్గదర్శకమైంది. ప్రపంచదేశాల ప్రశంసలు పొందింది. ఎన్నో పరిశ్రమలు, ఆశించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. వేల మందికి ఉపాధి కల్పించాం. వరంగల్ టెక్స్‌టైల్ పార్కుతోపాటు చేనేతరంగానికి జవసత్వాలు కల్పించాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా.

ఉపాధిహామీ పథకంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లున్నారు! ఈ పథకంలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు? ఉపాధి పథకం కింద ఎక్కువ నిధులు ఖర్చుచేస్తాం. ప్రజలందరికీ పనులు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులే కాకుండా, ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా గ్రామాలలో పెద్ద ఎత్తున ఇంకుడుగుంతల నిర్మాణం, మొక్కల పెంపకం, తోటల పెంపకం, పాడిపరిశ్రమ కార్యక్రమాలను చేపడతాం. జాబ్ కార్డులున్న వారిలో కనీసం 50% కూలీలకు 100 రోజుల పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. వేతనాలను రూ.194కు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అందుకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. సిక్కింలో ఉపాధిహామీ పథకం కింద ఆర్గానిక్ ఫార్మింగ్ పంటల ఉత్పత్తులు జరుగుతున్నాయి. వాటిని అధ్యయనం చేసి, తెలంగాణలో అమలుకు ప్రయత్నిస్తాం.

పంచాయతీల బలోపేతానికి ఏ చర్యలు చేపడుతున్నారు? నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంద్వారా పంచాయతీలను బలోపేతం చేస్తాం. గ్రామాల స్వయం సమృద్ధికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తాం. పంచాయతీల సేవలు, ఆదాయ, వ్యయాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాం. ప్రతి పంచాయతీలో ఆడిట్‌ను తప్పనిసరి చేస్తాం.

గ్రామజ్యోతి కార్యక్రమం ఎలా పనిచేస్తున్నది? బాగా పనిచేస్తున్నది. ఆరు అంశాలలో కమిటీలు వేశాం. గ్రామ అవసరాలకు అనుగుణంగా గ్రామసభలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి, వాటికి నిధులు కేటాయిస్తాం. పౌరులకు గ్రామస్థాయిలో పౌరసేవలు అందించేందుకు పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ప్రయోగాత్మకంగా పారంభించాం. వీటిని త్వరలో అన్ని జిల్లాలకు విస్తరిస్తాం.

గ్రామాలలో పారిశుధ్య నిర్మూలనకు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లున్నారు! స్వచ్ఛ తెలంగాణ కింద గ్రామాలలో ఇంటింటికి చెత్తను సేకరిస్తున్నాం. గ్రామాల్లో డంప్‌యార్డులు ఏర్పాటుచేసి, వీధుల్లో చెత్త కన్పించకుండా చేస్తాం. వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి ప్రతి ఇంటిలో ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసేలా ప్రజలను చైతన్యం చేస్తున్నాం.

పంచాయతీరాజ్ శాఖలో ఇతర శాఖల నుంచి వచ్చి పనిచేస్తున్న 412మంది కార్యదర్శుల సర్వీస్‌రూల్స్ సమస్యను ఎలా పరిష్కరించనున్నారు? సమస్యకు మూల కారణం ఏమిటో పంచాయతీ కార్యదర్శుల సంఘంతో త్వరలో సమావేశమై చర్చించి తెలుసుకుంటా. మా ప్రభుత్వం మొదటినుంచి ఉద్యోగుల ఫ్రెండ్లీగా కొనసాగుతున్నది. అదే స్ఫూర్తితో వారి సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తాం.

సెర్ప్, ఉపాధిహామీ ఉద్యోగుల వేతనాల పెంపు అంశంపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది? ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. కాంట్రాక్ట్ , అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంశంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కమిటీ వేశారు. కమిటీ నివేదిక అందిన తర్వాత దాని ఆధారంగా నిర్ణయం ఉంటుంది. సెర్ప్, ఉపాధిహామీ ఉద్యోగుల వేతనాల పెంపు అంశం సీఎం పరిశీలనలో ఉంది. త్వరలోనే సానుకూలంగా నిర్ణయం వస్తుంది.

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు లభిస్తాయని యువత ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే టీఎస్‌పీఎస్సీద్వారా ఉద్యోగాల ప్రకటనలు వెలువడుతున్నాయి. కొత్త పరిశ్రమలు, టీహబ్‌ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణలోని గ్రామీణ యువతకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) ద్వారా వివిధ రంగాలలో శిక్షణ ఇస్తున్నాం. స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా ఉపాధి అవకాశాలు లభించేలా వారికి శిక్షణ కల్పించనున్నాం.

ఆసరా పింఛన్ల పంపిణీ ఎలా జరుగుతున్నది? వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు ఒకరికి భారంగా భావించకుండా ఆత్మగౌరవంతో బతికేలా దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.1000, రూ.1500 చొప్పున పింఛన్లను పంపిణీ చేస్తున్నాం. సుమారు 36లక్షల మందికి ప్రతి నెల క్రమం తప్పకుండా దళారులు, అవినీతికి అస్కారం లేకుండా పింఛన్లను ఇస్తున్నాం. రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.