Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రతి పేదింటా.. సీఎం కేసీఆర్ పెద్ద కొడుకు

-రూపాయి ఖర్చు లేకుండా అర్హులకు డబుల్ ఇండ్లు -రాత్రింబవళ్లు కాళేశ్వరం పనులు -15 నుంచి రైతు బీమా -రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు -దుబ్బాక నియోజకవర్గం చిట్టాపూర్ గ్రామంలో డబుల్‌బెడ్‌రూం గృహప్రవేశాలు

తెలంగాణ రాష్ట్రం రాకపోయినా.. కేసీఆర్ సీఎం కాకపోయినా.. ఈ ప్రాంతానికి ఇంకా వందేైండ్లెనా గోదావరి జలాలు వచ్చేవి కావు.. ప్రాజెక్టులు నిర్మాణమయ్యేవి కావు.. ఇవాళ రాష్ట్రం ఏర్పాటు కావడం.. కే చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రాత్రింబవళ్లు వాయువేగంగా జరుగుతున్నాయి. దసరా నాటికి దుబ్బాక ప్రాంతాన్ని గోదావరి జలాలు ముద్దాడనున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇండ్లు కట్టిస్తున్నది. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమంకోసం.. ప్రతి పేదవాడి ఇంటిలో సీఎం కేసీఆర్ పెద్దకొడుకులా పనిచేస్తున్నారు అని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చిట్టాపూర్ గ్రామంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డిలతో కలిసి 30 డబుల్ బెడ్‌రూం ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు మంత్రి హరీశ్‌రావు చేయించారు. అంతకుముందు దుబ్బాకలో రామసముద్రం చెరువుపై మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకల సందర్భంగా పావురాలను ఎగురవేశారు. చిట్టాపూర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాలో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు తయారు చేయించిన భారీ కేక్‌ను మంత్రితో కట్ చేయించి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతు సంక్షేమంకోసం ఇంతలా ఆలోచించలేదన్నారు.

దేశంలోనే రైతు సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. ప్రభుత్వం రైతులకు ఉచిత జీవిత బీమాను ఆగస్టు 15 నుంచి చేయిస్తున్నదని తెలిపారు. పట్టాదార్ పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకు బీమా చేయిస్తున్నామని వెల్లడించారు. ఆయా గ్రామాల్లోని ఏఈవోలు, ఏవోలు రైతుల వివరాలను నోట్ చేసుకుంటున్నారన్నారు. జీవిత బీమా కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు పథకం కింద కంటి పరీక్షలు చేయించి కోటి అద్దాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. పేద ప్రజల సంక్షేమంకోసం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని వివరించారు. ఇవాళ మన పథకాలను పక్క రాష్ర్టాల వాళ్లు కాపీ కొట్టి వారి వారి రాష్ట్రాల్లో అమలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ర్టాల్లో మన పథకాలు కాపీ కొట్టి వారి మ్యానిఫెస్టోలో పెట్టుకొని అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు.

డబుల్ ఇండ్ల నిర్మాణంలో దుబ్బాక నంబర్ వన్ రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది దుబ్బాక నియోజకవర్గంలోనేనని మంత్రి హరీశ్ అన్నారు. స్థానిక శాసనసభ్యుడు రామలింగారెడ్డి రాత్రింబవళ్లు కష్టపడి సుమారు మూడువేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నారని.. కులమతాలకు అతీతంగా, పార్టీరహితంగా అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. లబ్ధిదారులకు రూపాయి ఖర్చులేకుండా అప్పులభారం లేకుండా పూర్తిగా ప్రభుత్వమే భరించి ఇండ్లు కట్టిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఇండ్ల నిర్మాణానికి రూ.70 వేలు ఇచ్చేవారని వీటిలో రూ.12 వేలు గ్రాంట్ కింద ఇవ్వగా, మిగతా రూ.58 వేలు అప్పుగా లబ్ధిదారుల నెత్తిమీద రుద్దేవారన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతుకాలని సకల సౌకర్యాలతో డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇదిగో చెల్లెమ్మా.. అంటూ తాళంచెవిని అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్లలో సంబురం దుబ్బాక నియోజకవర్గంలోని చిట్టాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు అప్పజెప్పడంతో లబ్ధిదారుల్లో సంబురం వెల్లివిరిసింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో గృహప్రవేశాలను చేసుకొన్నారు. ప్రతి ఇంటా సత్యనారాయణ వ్రతాలనుచేశారు. మామిడి తోరణాల అలంకరణతో చిట్టాపూర్‌లో పండుగ వాతావరణం నెలకొన్నది. స్థానిక శాసన సభ్యుడు రామలింగారెడ్డి విజ్ఞప్తిమేరకు మంత్రి హరీశ్‌రావు ఆ గ్రామానికి మరో 20 ఇండ్లు మంజూరుచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.