Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు చేయకుండా రైతుల కోసం కేసీఆర్ ఎత్తుకున్న లక్ష్యానికి అండగా నిలువాలి. జగతికి వెలుగునిచ్చే సూర్యుడు తూర్పుదిక్కున ఉదయిస్తే రైతుకు వెలుగునిచ్చే సూర్యుడు దక్షిణాదిన ఉదయించబోతున్నాడు.

ఒక విజేత మరో విజయం కోసం పరితపిస్తున్నాడు. కలలో కూడా సాధ్యం కాదనుకున్న తెలంగాణ లక్ష్యాన్ని ముద్దాడిన ఆ యోధుడు ఇప్పుడు దేశంలో రైతును రాజును చేయాలన్న మరో మహత్తర లక్ష్యాన్ని భుజాన వేసుకొని కదనరంగంలో దిగేందుకు సమాయత్తమవుతున్నాడు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని కేసీఆర్ చేసిన సంచలన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇంకో ఏడాది పైగా అధికారం ఉన్నా అసలు కేసీఆర్ ఎందుకు ఇలాంటి సంచలన ప్రకటన చేసి తెలంగాణకే కా దు, యావత్ దేశప్రజల ముందు ఒక నిలువెత్తు ప్రశ్న ఎందుకు ఉంచారో తప్పక మనం విశ్లేషించుకోవాలి.

ఈ సందర్భంగా ఒకసారి కేసీఆర్ ప్రస్థానాన్ని మనం నెమరువేసుకుం టే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతు లు కల్పించడానికి ఆయన ఎంచుకున్న పద్ధతికి మానేరు నుంచి సిద్దిపే టకు నీటిని తరలించి ఇంటింటికీ తాగునీరిచ్చిన పథకమే సజీవ సాక్ష్యం. తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాముల ను చేసి సాధించిన విజయాల నమూనానే ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం 119 నియోజకవర్గాలకు మార్గదర్శకంగా నిలిపా రు. ఫలితంగా తాను సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు తాను అనుకు న్న ఫలితాలు ఐదేండ్లలోపే రావడంతో ఆయనలో విశ్వాసం పెరిగింది. కేసీఆర్ పాలనను దేశంలో అభినందించని వారెవరైనా ఉన్నారా? నీతీ ఆయోగ్ నుంచి మొదలు సీడబ్ల్యూసీ అధికారులు, వ్యవసాయ నిపుణు లు స్వామినాథన్, పలువురు కేంద్రమంత్రులు, పలురాష్ర్టాల ముఖ్యమం త్రులు కేసీఆర్ పాలన బాగుందని ఆయా సందర్భాల్లో అభినందనలు కురిపించిన విషయం మనకు తెలిసిందే. ఇటీవల నాకు ఒక ఫంక్షన్‌లో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక మిత్రుడు కలిసిన సందర్భంగా తాను వృత్తిరీత్యా అనేక రాష్ర్టాలు తిరిగి ముఖ్యమంత్రులను కలుస్తున్న సందర్భంగా నేనేమీ చెప్పకముందే మీ తెలంగాణ ప్రభుత్వం పనితీరు అద్భుతమని, సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడని, ప్రజలు మెచ్చే పాలన అందిస్తున్నారని ఆయన అన్నపుడు నా సంతోషానికి అవధుల్లేవు.

కేసీఆర్ మీడియాకు చెప్పినట్లు అమెరికా, చైనాల వలె అభివృద్ధి జరు గాలని ఇప్పటివరకు ఏలిన పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ ఓట్ల రాజకీయం చేశారు.కాబట్టే భారత్ 70 ఏండ్లు గడుస్తున్నా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది తప్పా అమెరికా, చైనాల సరిజోడిగా నిలు వలేకపోయింది. సకల సంపదలున్నా అల్లుడినోట్లో శని అన్నట్లు ఏలిన వారి పాపాలు దేశ రైతుల పాలిట శాపాలుగా మారాయి. ఏ పథకానికి రూపకల్పన చేసినా దానిచుట్టూ ఓటు అనే స్వార్థపు కవచం పెట్టి ప్రజల కు చేరకుండా చేసేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం గతంలో మాదిరిగా కేవలం అధికారపార్టీ కార్యకర్తలకే పరిమితం చేయకుండా రాజ కీయాలకతీతంగా ప్రతి పౌరుడికి చెందాలన్న లక్ష్యంతో కేసీఆర్ పథకాలకు రూపకల్పనచేస్తూ అమలు చేస్తున్నారు. ఇందుకు రాష్ట్రంలోని కోటి ఎకరా లకు సాగునీరివ్వడం, పార్టీల తో ప్రమేయం లేకుండా రూ.4వేల పెట్టుబ డి పథకాన్ని వర్తింపజేయడం, ఏ పార్టీకి చెందిన వారన్న భావనలేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అందించడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇవ్వడం వంటివి సజీవ సాక్ష్యాలు. ఇలాంటి ప్రయత్నం గత పాలకుల హయాంలో జరిగి ఉంటే నేడు భారత్ ఇంకా అభివృద్ధి చెం దుతున్న దేశంగానే మిగిలి ఉండేదికాదు. ఈ మధ్య కరీంనగర్‌లో జరిగిన రైతు సదస్సులో దేశవ్యా ప్తంగా రైతులు పడుతున్న బాధలను వివరిస్తూ అవసరమైతే దేశ రైతాంగానికి అండగా తెలంగాణ నాయకత్వం వహిస్తుం దనడం ఆ నిమిషానికి కొంతమందికి అర్థం కాలేదు. ఇటు తెలంగాణ అయినా, అటు బీహార్ అయినా, ఇప్పటికే తమకు న్యాయం చేయాలని ఢిల్లీలో నిరసనలు చేస్తు న్న కర్ణాటక, తమిళనాడు అయినా, దేశంలో ఎక్క డైనా రైతు రైతేనని, అం దరూ సుభిక్షంగా ఉండాలన్నది కేసీఆర్ భావన.

దేశాభివృద్ధి జరుగాలంటే రైతు లక్ష్యంగా ఆలోచనలు చేయాలి. ఈ విష యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నది. డ్బ్భై ఏండ్ల స్వాతం త్య్ర భారతంలో దేశ పాలకులు రైతన్నలను ఆత్మహత్యల వైపు నడిపి ఇం డియా తలదించుకునేలా చేస్తే నాలుగేండ్ల అతిచిన్న వయసు కలిగిన తెలంగాణ రైతులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. రైతులు ఏం చేస్తే బాగుపడుతారో ఆ చర్యలను సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారు. భూసార పరీక్షలు, 5 వేల ఎకరాలకో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అధికారి, మండలాని కో అగ్రానామిస్ట్ నియామకం, విత్తనాలు, ఎరువులను ఎక్కడికక్కడ అం దుబాటులో పెట్టడంలాంటి ఎన్నో చర్యలు తీసుకున్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రామమందిర నిర్మాణ ఉద్యమం, మండల్ కమిషన్ ఉద్యమం లాంటి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. సామాజిక, ఆర్థిక అసమా నతలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తరించాలంటూ సాగిన నక్సల్బరీ ఉద్య మం కావచ్చు. కానీ రైతులు కేంద్రంగా మాత్రం దేశాన్నే ప్రభావితం చేసే ఉద్యమం జరుగలేదు. చౌదరి చరణ్‌సింగ్, మహేందర్ సింగ్ తికాయిటే లాంటి నేతలు రైతు ఉద్యమాలు చేసినా అవి యూపీకి మాత్రమే పరిమి తమయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో రైతు ఉద్యమా లు జరిగినా అవి ఆయా రాష్ర్టాల స్థానిక అంశా లకే పరిమితమైంది.

ఇలాంటి స్థితిలో దేశ ప్రజలందరిపక్షాన నిలబడి పోరాడాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. అం దుకే దేశ రైతుల కోసం కేసీఆర్ నడుం బిగించడమే అసలుసిసలైన తొలి రైతు ఉద్యమం కానున్నది. దేశంలో అనేక జీవనదులు పారు తూ దాదా పు 70వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్ప టికీ కనీసం 30 వేల టీఎంసీలకు మించి వినియో గించుకోని దరిద్రం గత పాలకుల నిర్వాకం ఫలితమే. కేసీఆర్ పేర్కొన్న గుణాత్మక మార్పు అంటే ఏమిటని ఆలో చిస్తున్నవారూ ఉన్నారు. ఎన్నికల్లో ఒక పార్టీ అధికారంలోకి రావడం, అధికారం కాపాడుకోవడం కోసం మూస పద్ధతి పాలించడం, దానిపై వ్యతిరేకత వచ్చినప్పుడు మరో పార్టీకి అధికారం ఇవ్వడం, ఇలా ఏండ్లుగా సాగుతున్న తతంగం దేశాన్ని ఊబిలోకి నెట్టింది. దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నువిరిశారు. దేశాన్ని పాలిం చిన పార్టీలు కేవలం తమ అధికారాన్ని ఎలా నిలుపుకోవాలి, తమ పదవులు ఎలా కాపాడుకో వాలనే ఎత్తుగడలతో, ఢిల్లీ పరిసరాలు దాటని ఆలోచన లతో కాలం గడిపా రు. దేశంలో ఏ రాష్ట్రం స్థితిగతులు ఎలా ఉన్నాయన్న దాన్ని పట్టించుకోలేదు. జిమ్మిక్కులతో దేశాన్ని ఏలాలని పరితపించారు. ఇలాంటి పాడు పద్ధతులు పోయి నిజంగా ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం రావడం, వ్యవసాయాన్ని పండుగచేసి అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపేలా పాలన సాగడమనేదే గుణాత్మక మార్పు.

ఈ మార్పు కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన లక్ష్యం రైతుల కోసం పోరాటం తప్ప రాజకీయం కాదు. అయితే ఈ లక్ష్యసా ధన జరుగాలంటే రాజకీయ కోణం అంతర్లీనంగా ఉంటుంది. ఉదాహరణకు 2001లో కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని సాధించా లంటే పార్లమెంటరీ వ్యవస్థలో తప్పకుండా రాజకీయ కోణంలోనే సాధ్యమ వుతుంది. అందుకే ఆయన రాజకీయంగానే పోరాడి తెలంగాణ సాధించారు. ఇప్పుడు రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీ య రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు చేయకుండా రైతుల కోసం కేసీఆర్ ఎత్తుకున్న లక్ష్యానికి అండ గా నిలువాలి. జగతికి వెలుగునిచ్చే సూర్యుడు తూర్పుదిక్కున ఉదయిస్తే రైతుకు వెలుగునిచ్చే సూర్యుడు దక్షిణాదిన ఉదయించబోతున్నాడు. వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు కర్నే ప్రభాకర్.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.