Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాజధానికి రాచబాట

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్రప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. రూ.18,500 కోట్లతో చేపడుతున్న ఈ బృహత్‌కార్యక్రమంలో సాధ్యమైనంత తొందరగా తొలిదశ పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. అందులోభాగంగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల వ్యయంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ఎనిమిది రోడ్లు, ఎనిమిది జంక్షన్లను 70 కిలోమీటర్ల మేర సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

KCR review on Hyderabad Development

-తొలిదశలో 8 రోడ్లు, 8 జంక్షన్ల అభివృద్ధికి నిర్ణయం -ఐదువేల కోట్లతో మొదటిదశ పనులు -సర్వే కోసం బల్దియాకు వారం గడువు -నేటినుంచే సర్వే పనులు మొదలు -ఇండ్లకు నష్టం జరుగకుండా చూడాలని సర్కార్ ఆదేశం ఈ పనులను చేపట్టేందుకు వీలుగా వారంలో సర్వే పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పనుల్లో భాగంగా ఎక్కడా ఇండ్లకు నష్టం వాటిల్లకుండా చూడాలని స్పష్టంగా చెప్పింది. రోడ్డు వెడల్పు, ట్రాఫిక్ సమస్యనుబట్టి అక్కడ ఏమి నిర్మిస్తే బాగుంటుందో నిర్ణయించి దానికి సంబంధించిన డిజైన్లు రూపొందించే బాధ్యతను లీ అసోసియేట్స్ కన్సల్టెంటుకు అప్పగించారు.

జీహెచ్‌ఎంసీ అధికారులు అందజేసిన సర్వే నివేదిక ఆధారంగా రోడ్లు, జంక్షన్లను ఎలా అభివృద్ధి చేయాలి? ఎక్కెడెక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలి? ఎక్స్‌ప్రెస్‌వేలు ఎక్కడ నిర్మించాలి? వాటి వెడల్పు ఎంతమేరకు నిర్ణయించాలి? అనే వివరాలతో లీ అసోసియేట్స్ సమగ్ర నివేదిక రూపొందించనున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సోమవారం నుంచే రోడ్ల సర్వే నిర్వహించేందుకు బల్దియా అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. వారం గడువు ఇవ్వడంతో ఈలోగానే సర్వే పూర్తిచేసి నివేదిక సమర్పించాలని కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ముందు ట్రాఫిక్ సమస్యను లేకుండా చేయాలని భావిస్తున్నది. అందులోభాగంగానే వంద కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వేలు, 300 కిలోమీటర్ల మేర అంతర్జాతీయస్థాయిలో రోడ్ల అభివృద్ధి, 50 ఫ్లైఓవర్లు, 56 జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అధికారులు రూపొందించిన అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

అయితే ఈ ఫ్లైఓవర్లు, రోడ్ల అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం ఉన్న రోడ్లను యథాతథంగానే అభివృద్ధి చేయాలని, ఎక్కడా రోడ్ల విస్తరణ పేరుతో ఇండ్లు, ప్రజల ఆస్తులకు నష్టం జరుగకుండా చూడాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు, సాధ్యమైనంత తొందరలోనే ప్రాధాన్యతలకు అనుగుణంగా దశలవారీగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మొదటి రెండు నెలల్లోనే కొన్ని పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రతిపాదిత రోడ్లు, కారిడార్ల వివరాలు -ఉప్పల్ జంక్షన్-సంగీత్ జంక్షన్ -బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి-జేఎన్‌టీయూ జంక్షన్, కూకట్‌పల్లి -అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్- అఫ్జల్‌గంజ్ -అబిడ్స్ జంక్షన్- చాదర్‌ఘాట్ జంక్షన్ వయా కోఠి -హబ్సిగూడ- ఐడీఏ మల్లాపూర్ వయా నాచారం -హయత్‌నగర్- నల్గొండ క్రాస్‌రోడ్స్ -చాదర్‌ఘాట్- పుత్లీబౌలీ- జాంబాగ్- మోజంజాహీ మార్కెట్-ఏక్‌మినార్ జంక్షన్, నాంపల్లి -పురానాపూల్- ఆరాంఘర్ జంక్షన్ వయా జూపార్కు

ప్రతిపాదిత జంక్షన్ల వివరాలు కోఠి జంక్షన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ జంక్షన్, సికిందరాబాద్ జంక్షన్, ఉప్పల్ జంక్షన్, ఎల్బీనగర్ జంక్షన్, చాదర్‌ఘాట్ జంక్షన్, పుత్లీబౌలీ జంక్షన్, బహదూర్‌పుర జంక్షన్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.