తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ కే. కేశవరావు, మాజీ స్పీకర్ శ్రీ కె. ఆర్. సురేశ్ రెడ్డి లను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. వీరిద్దరూ శుక్రవారం ఉదయం తమ నామినేషన్లను దాఖలు చేస్తారు. రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేశ్ రెడ్డి లు సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరిని ముఖ్యమంత్రి అభినందించారు.


టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, మాజీ స్పీకర్ శ్రీ కె. ఆర్. సురేష్ రెడ్డిలను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.




