-మహబూబ్‌నగర్‌లో సోలార్ ప్రాజెక్టుకు శ్రీకారం -హెచ్ఎంఏ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగేళ్ల కాలంలో మిగులు విద్యుత్‌ను చూపిస్తామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.

శుక్రవారం హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే విద్యుత్ సమస్య తలెత్తిందన్నారు. మహబూబాబాద్‌నగర్ జిల్లాలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు ఆర్నెళ్లలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు పది కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. అదిలాబాద్ జిల్లా చెన్నూరు, వరంగల్ జిల్లా భూపాలపల్లి ప్రాంతాలలో విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో హైదరాబాద్‌ను మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సోలార్‌ప్లాంట్ ఏర్పాట్లకు చర్యలు చేపడుతున్నామన్నారు.