రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదికోసం రాజధాని హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, రాష్ట్రపతికి సాదరంగా స్వాగతం పలికారు. -సాదర స్వాగతం పలికిన సీఎం కేసీఆర్ తదితరులు -బొల్లారంలో 31వరకు రాష్ట్రపతి బస

శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరితోపాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రాష్ట్రపతి ఈనెల 31వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేస్తారు. హైదరాబాద్‌లో ఉన్న కాలంలో రాష్ట్రపతి ప్రణబ్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్ర్టాలలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. 27న హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా ఎర్రవల్లిలో నిర్వహిస్తున్న అయుత చండీమహాయాగం పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ హాజరుకానున్నారని అధికారులు తెలిపారు.