Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ ప్రాజెక్టు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్‌రాయ్‌చౌదరి, సదరన్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ వెంకటేశ్వరన్‌లు సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని సీఎంకు తెలియజేశారు.

KCR with NTPC Chairmen

-రామగుండంలోనే నూతన ప్రాజెక్టు -సీఎం కేసీఆర్‌తో ఎన్టీపీసీ సీఎండీ భేటీ రామగుండంలోని ఇప్పుడున్న ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టులోనే ఇందుకు ఏర్పాట్లు చేస్తామని ఆరుణ్‌రాయ్ సీఎంకు తెలిపారు. ఈ ప్రాజెక్టును నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని రాష్ట్రం కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే అదనపు బొగ్గు సరఫరాకు సంబంధించి ప్రధానితో మాట్లాడుతానని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, తెలంగాణ జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, ఇందనశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌లు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.