Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ట్రానికి రక్షణకవచం టీఆర్‌ఎస్

నా ఒక్కడి వల్ల దేశం మారిపోతుందా అనుకొనే ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదన్న ఫిడెల్ క్యాస్ట్రో మాటలను ఆదర్శంగా తీసుకొని అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపిన మహానేత కేసీఆర్ తన దీక్షతో రాష్ట్రాన్ని సాధించారు. కొట్లాడి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే లక్ష్యంతో ముందుకువెళ్తున్న మహానేత కూడా కేసీఆరే. ఉద్యమం ఎంతో మహోధృతంగా సాగినా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయశక్తి అవసరమని భావించిన కేసీఆర్ ఉద్యమ ప్రారంభంలోనే టీఆర్‌ఎస్‌కు ఊపిరిపోశారు. ఇక ఆనాటి నుంచి కేసీఆర్ దార్శనికతకు, వ్యూహాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ ఉద్యమిస్తూనే ఉన్నది. కేసీఆర్‌కు రాష్ట్ర సాధన ఉద్యమం ఎట్లా ఉండాలె, బంగారు తెలంగాణను ఎట్లా నిర్మించుకోవాలనే విషయాల్లో ఎంత స్పష్టత ఉన్నదో రాజకీయపక్షంగా టీఆర్‌ఎస్ ఏయే దశల్లో ఏయే స్వభావంతో, నిర్మాణంతో ఉండాలనే విషయంలో కూడా అంతటి స్పష్టత ఉన్నది. రాష్ట్రం సిద్ధించడానికి ముం దు కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను ఒక ఉద్యమపార్టీగా నడిపించారు. రాష్ట్ర సాధన తర్వాత టీఆర్‌ఎస్ పక్కా రాజకీయపక్షమని స్పష్టంచేశారు. అయితే ఒక రాజకీయపక్ష నిర్మాణం హడావుడిగా ఒక్కరోజులోనో, ఒక ఏడాదిలోనో నిర్మించేది కాదు. పార్టీ స్వభావం కూడా అంత తొందరగా మారదు. రూపాంతరం చెందడానికి కొంత వ్యవధి అవసరం. ఇందుకోసం పూర్తి స్థాయి దృష్టి పెట్టవలసి వచ్చింది. ఎప్పుడు ఏ అంశాన్ని ప్రాధాన్యంగా చేపట్టాలనేది కేసీఆర్‌కు తెలుసు.

ఒక ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఒక్కడి దీక్ష దేశ ప్రజలను ఆలోచింపజేసింది. ఓ నాయకుడి ఉపన్యాసాలు ప్రజల రక్తాన్ని ఉరకలు పెట్టించినయి. ఒక వ్యక్తి కష్టం తెలంగాణకు స్ఫూర్తినిచ్చింది. ఆరు దశాబ్దాలు దోపిడికి గురైన ప్రజానీకానికి ఒక్క రూపం కనబడింది. ఆత్మహత్యలు, బలిదానాల సాక్షిగా కొనసాగిన ఉద్యమం చావో బతుకో తేల్చుకునేందుకు బరిగీసి నిలిచింది. అందరూ ఒకటై ఆయన అడుగులో అడుగువేశారు. ఒకరి దీక్ష నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ దృష్టిలో ప్రజలంతా సమానమే. మొత్తం సమాజాభివృద్ధిపై ఆయన దృష్టిసారించారు. బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా గల కేసీఆర్‌కు తెలంగాణ అంతా నా వాళ్లే అనే భావన ఉం టుంది. అందువల్ల పరిపాలనా సంస్కరణలపై, సామాజిక-ఆర్థిక అభి వృద్ధిపై తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించారు. అరువై ఏండ్ల పరాయి అణి చివేతలో అతలాకుతలమైన తెలంగాణ సమాజం కుదుటపడటం ప్రధా నంగా భావించారు. మొదటి ఐదేండ్లలో సమాజాన్ని కుదుటపర్చగలి గారు. ఇది కేసీఆర్ సాధించిన గొప్ప విజయం. కేసీఆర్ సాగించిన అసా ధారణ కృషే టీఆర్‌ఎస్‌ను మళ్ళా అధికారంలోకి తెచ్చింది. ప్రజల దృష్టి లో కేసీఆర్ వేరు, టీఆర్‌ఎస్ వేరు కాదు. ప్రజలకు కేసీఆరే అన్నీ. కేసీఆర్ ను చూసే ఓటేస్తారు. అందువల్ల టీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని పటి ష్టం చేయడానికి కేసీఆర్‌కు కొంత వెసులుబాటు లభించింది. రాజనీతి చతురుడైన కేసీఆర్‌కు రాజకీయపక్షం స్వభావం, పాత్ర, నిర్మాణంపై పూర్తి స్పష్టత ఉన్నది. ఉద్యమకాలం నుంచి తమ వెంట ఉన్న కార్యకర్తల గురించి తెలుసు. వారి శక్తియుక్తులను సమాజం కోసం ఎట్లా ఉపయోగించాలనే అవగాహన కేసీఆర్‌కు ఉన్నది. కార్యకర్తల మనోభావాలు, వారి బాగోగులపై కేసీఆర్‌కు స్పష్టత ఉన్నది. అందుకే ఒకవైపు పరిపాలన సాగిస్తూనే మరోవైపు పార్టీ పటిష్టత వైపు ఆయన దృష్టి సారించారు. టీఆర్‌ఎస్‌ను ఒక ఉద్యమ పార్టీ నుంచి పటిష్టమైన రాజకీయపక్షంగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు.

టీఆర్‌ఎస్‌ను తెలంగాణ సమాజానికి వెన్నెముకగా మార్చవలసిన సందర్భం వచ్చిందని కేసీఆర్ గ్రహించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీనిలో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించారు. అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరి పూర్తి వివరాలు ఉండేలా ఏర్పాట్లుచేశారు.

కనాడు ఉద్యమమే ఊపిరిగా బతికిన టీఆర్‌ఎస్ పార్టీ నేడు సకల జనుల ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతున్నది. యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ తన పాలన కొనసాగిస్తున్నారు. కొత్త రాష్ట్రమైనా ఇతర పెద్ద రాష్ర్టాలకు ఆదర్శంగా నిలువడం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనం. అలాంటి ఇంటి పార్టీని పటిష్టం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతూ సంస్థాగతంపై దృష్టిపెట్టారు. ఈ సందర్భంగా కేసీ ఆర్ టీఆర్‌ఎస్‌ను, కార్యకర్తలను కాపాడుకుంటూ నడిపిన తీరును కూడా గుర్తించడం అవసరం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ 2001 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. నాటి నుంచి 2014 వరకు రాష్ట్ర సాధనోద్యమాన్ని నిర్వహించారు. మొదటినుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులు ఉద్యమ ఆవేశంతో ఉన్నారు. అయినా కేసీఆర్ వారిని రెచ్చగొట్టకుండా, నష్టపరుచకుండా ఉద్యమాన్ని చాకచక్యంగా నడిపారు. పరాయి పాలకులు టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడా నికి అనేక కుట్రలు పన్నినా వాటిని తిప్పికొట్టి పార్టీని కాపాడుకున్నారు. ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా రాష్ర్టాన్ని సాధించిన నేతగా కేసీఆర్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఈ 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను, అవాంతరాలను, కళ్లు కుతంత్రాలను ఛేదించారు. ఉద్యమకాలంలో తెలంగాణలోని అన్నివర్గాల ప్రజలను ఐక్యం చేసి ఉద్యమా న్ని నిర్వహించడం జరిగింది. కార్మికులను, ఉద్యోగులను, విద్యావంతులను, రచయితలను, కళాకారులను, తెలంగాణవాదులను ఇతర అన్ని వర్గాల ప్రజలతో జేఏసీలు ఏర్పాటు చేసి తెలంగాణ భావజాల వ్యాప్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పారు.

కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పారాటాలు నిర్వహించారు. పార్లమెంట్‌లో ఒక్కరో ఇద్దరో ఉన్నా, అక్కడా తెలంగాణ గళాన్ని వినిపించగలిగారు. ఆనాడు కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి తీసుకున్నది కూడా అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు తెలిపేలా చేయడానికే తప్పా ఇతర ఏ ప్రయోజనాలు ఆశించలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. జయశంకర్ సార్-లాంటి మేధావులను ముందుంచి ఉద్యమ భావజాలాన్ని వ్యాపిచేశారు. ఒక్క కేసీఆర్‌తో మొదలైన ఉద్యమం లక్షలాది మందితో పెద్ద పెద్ద సభలను నిర్వహించి తెలంగాణ భావజాల వ్యాప్తిని విజయవంతం చేయడం జరిగింది. ఈ క్రమంలో అనేక ఎన్నికలను కూడా భావజాల వ్యాప్తికే ఉపయోగించారు. అవి శాసనసభ, పార్లమెంటు ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా చివరికి టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఉప ఎన్నికకు సవాలు విసిరినా ఉద్య మం కోసం చేశారే తప్ప ఇతరత్రా ప్రయోజనాలను ఆశించి కాదు. 2001 నుంచి 2014 వరకు కూడా తెలంగాణ భావజాల వ్యాప్తి, రాష్ట్ర ఆవిర్భావ ఆవశ్యకత, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పనిచేసింది. విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, ఉద్యోగు ల నుంచి మొదలుకొని చివరికి చెత్త ఏరుకునే వారు కూడా జేఏసీలు ఏర్పాటుచేశారు. అయితే వీటన్నిటికీ కేంద్రంగా టీఆర్‌ఎస్ పనిచేసింది. కేసీఆర్ పార్టీ ప్రాధాన్యం తెలిసి క్రియాశీలంగా ఉపయోగించారనే కానీ ఉద్యమాన్ని పార్టీ పరిధికి కుదించలేదు. తెలంగాణ రాష్ట్ర కోసం సంఘటిత, అసంఘటిత రంగాలన్నింటికి ఆజ్యం పోసి, రూపం ఇచ్చిన నాయకుడు కేసీఆర్.

ఈ నేపథ్యంలో దేశంలోని 35 పార్టీలను తెలంగాణకు మద్దతు పలికించడంలో ఒప్పించడంతో పాటు పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు మద్దతు తెలిపేలా చేయడంలో కేసీఆర్ సఫలీకృతులయ్యా రు. ఈ క్రమంలో వచ్చిన ఎన్నో అవమానాలను, ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే ఏకైక ఎజెండాగా పార్టీని నడిపించారు. ప్రభుత్వం ముందుకెళ్తుంటే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక ప్రభుత్వా న్ని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. వాటిని ఒకవైపు ఎదుర్కొంటూ మరోవైపు ప్రాజెక్టుల నిర్మాణాలను తొందరగా పూర్తి చేసేందుకు కేసీఆర్ నిత్యం కష్టపడుతున్నారు. సాగునీటి రంగంలో తెలం గాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం కావడం వెనుక కేసీఆర్ కృషి ఎంతో ఉన్నది. మరోవైపు చిన్ననీటి వనరులను అభివృద్ధి చేయడం, నిజాం నాటి కాలంలో ఏర్పాటుచేసిన చెరువులపై, వాటి పునః నిర్మాణాలపై దృష్టిసారించి కోట్ల రూపాయలు వెచ్చించి వేల చెరువులను అభివృద్ధి చేసి రైతులకు, మత్స్యకారుల జీవనశైలి మార్చిన ఏకైక నేత మన కేసీఆర్.. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్నిరకాల చేతివృ త్తుల వారికి ప్రోత్సాహం ఇచ్చి వారి స్థితిగతులు మార్చిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుంది. కేసీఆర్ చిత్తశుద్ధి, పాలనాదక్షత మూలంగా తెలంగాణలో ఇటీవల జరిగిన అన్నీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శాసనస భ ఎన్నికల్లో 3/4 వంతు మెజారిటీని అందించడం గొప్ప విషయం.

సర్పంచ్ ఎన్నికల్లో 82 శాతం సీట్లను ఇవ్వడం సాధారణమైన విషయం కాదు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో 90 శాతం సీట్లతో పాటు రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లా పరిషత్‌లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. అంటే దాదాపుగా 95 శాతం పదవులు టీఆర్‌ఎస్‌కు లభించినవి. టీఆర్‌ఎస్‌ను తెలంగాణ సమాజానికి వెన్నెముకగా మార్చవలసిన సం దర్భం వచ్చిందని కేసీఆర్ గ్రహించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీనిలో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించారు. అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నారు. సభ్య త్వం తీసుకున్న ప్రతి ఒక్కరి పూర్తి వివరాలు ఉండేలా ఏర్పాట్లుచేశారు. గ్రామ, మండల కమిటీలలో 51 పైన సభ్యులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో నింపాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్య త్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు బీమా సౌకర్యం కల్పించారు. అన్ని స్థాయిలలో శిక్షణలు ఇవ్వడం ద్వారా పార్టీని పటిష్టం చేయాలనే లక్ష్యం తో ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రజలు తమ రక్షణ కవచంగా టీఆర్‌ఎస్‌ను భావిస్తున్నారు. కనుక వారి నమ్మకానికి అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకొనిపో తున్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై ఉన్న ప్రేమ తో, అచంచల విశ్వాసంతో అద్భుతమైన విజయాలు అందించారు. వారి ప్రేమకు, నమ్మకానికి, విశ్వాసానికి ప్రతిరూపంగా తెలంగాణ సమాజానికి, ప్రజలకు ఒక అభేద్యమైన రక్షణ కవచంగా టీఆర్‌ఎస్ పార్టీని చేయ డం, సంస్థాగతంగా పటిష్టపరుచుకోవడం ప్రతి నాయకుని, కార్యకర్త విధి, బాధ్యత.

(వ్యాసకర్త: డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ, మండలి విప్)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.