Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రెండేండ్లకు సరిపడా వర్షాలు

– ఆలోగానే మల్లన్నసాగర్‌తో గోదావరి జలాలు – నేను చెప్పినట్లుగానే వరదలతో కూడిన వర్షాలు పడ్డాయి – ఎల్‌నినోతో 20 ఏండ్లుగా దేశం కరువును ఎదుర్కొన్నది – ఇక 6 నుంచి 12 ఏండ్ల వరకు లానినో ప్రభావంతో వర్షాలు – ఎర్రవల్లి, నర్సన్నపేటలో పూర్తికావచ్చిన డబుల్‌బెడ్‌రూం ఇండ్లు – ఎర్రవల్లి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు – ఐక్యంగా ఉండాలి.. ఇతర గ్రామాలకు ఆదర్శం కావాలని పిలుపు

cm-kcr-addressed-the-residents-of-erravalli-and-narsannapet-villages-28-0916

ప్రవహించి.. పంటపొలాలకు నీళ్లు ఇచ్చేందుకు అనువుగా ఉన్న పరిస్థితిని సమగ్రావలోకనం చేసుకుని చెప్పిన మాట! హైదరాబాద్‌లో ఉన్నా.. ఢిల్లీలో ఉన్నా.. ప్రతి బొట్టు నీటినీ వృథా చేయకుండా.. పొలాలకు పారించడమెలాగన్న ముఖ్యమంత్రి నిరంతర ఆలోచనలకు, అందుకు అనుగుణంగా చేపట్టిన కార్యశీలతకు వచ్చిన ఫలితం! వీలైనన్ని నీళ్లను నిల్వ చేసుకోవడమే లక్ష్యం! ఆ లక్ష్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా చేరుకున్నది!

రెండు నెలల ముందటి పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే.. వర్షాకాలంలోనూ కరువు ఛాయలు ముసురుకున్న వేళ.. అప్పటికే మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువులను గంగాళాలుగా తయారు చేసి ఉన్న తరుణం! కానీ.. వర్షాలు లేవు! రైతులకు ఇచ్చిన వాగ్దానం మేరకు తొలి దశలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుతల వారీగా కాలువల్లోకి నీటిని వదిలి.. పంటలు కాపాడింది రాష్ట్ర ప్రభుత్వం. అదే సమయంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెరువులను నింపుకొంటూ పోయింది. కొద్దికాలానికే పరిస్థితి మారిపోయింది. గడిచిన 15 రోజులుగా వద్దంటే వాన అన్నట్టు.. సమృద్ధిగా వర్షాలు కురిశాయి. రిజర్వాయర్లకు వరద పోటెత్తింది! ఆ వెంటనే ప్రభుత్వం తన కార్యాచరణను పూర్తిస్థాయిలో అమల్లో పెట్టింది. ఎస్సారెస్పీలోకి వచ్చి చేరిన వర్షపు నీటిని.. వరద పోటును.. ఒడిసిపట్టింది. కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువ, శ్రీరాంసాగర్ వరద కాలువల్లోకి మళ్లించి ఇటు లోయర్ మానేరు, అటు మిడ్ మానేరుల్లోకి ఎనిమిది టీఎంసీలకుపైగా నీళ్లు తరలించింది. లోయర్, మిడ్ మానేరుల్లో నీటిని నిల్వ చేసుకొని వాటి నుంచి చెరువుల్లోకి నీళ్లు నింపే ప్రక్రియను కూడా ప్రభుత్వం తక్షణమే ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారమే రంగంలోకి దిగారు. ముగ్గురు చీఫ్ ఇంజినీర్లకు చెరువులు నింపే బాధ్యత అప్పగించారు. ఎక్కడెక్కడ.. ఏయే చెరువులు నింపేందుకు అవకాశం ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇంజినీర్లు.. వాటిలో నీళ్లు నింపే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రాథమికంగా 600 చెరువుల్లో నీళ్లు నింపే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రికి ఇంజినీర్లు నివేదిక అందజేశారు.

శ్రీరాంసాగర్ నుంచి ఖమ్మానికి కూడా నీళ్లు.. ముందుచూపుతో వ్యవహరిస్తే ఎంతటి అద్భుత ఫలితాలు వస్తాయో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎస్సారెస్పీ నుంచి విడుదలవుతున్న నీళ్లే నిదర్శనం. సమైక్యపాలనలో ఏనాడూ కాకతీయ కాలువ చివరి ఆయకట్టుకు నీళ్లు వచ్చింది లేదు! కానీ, స్వరాష్ట్రంలో కాకతీయ కాలువ టెయిల్‌ఎండ్ రైతులకు కూడా నీళ్లు రానున్నాయి. ఎస్సారెస్పీ నుంచి మానేరులోకి నీళ్లు నింపిన ప్రభుత్వం ఇప్పుడు డీబీఎం-60 ద్వారా ఖమ్మం జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వబోతున్నది. ఇక నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని కొంత ప్రాంతం, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని చెరువులను నింపనున్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో, కాకతీయ కాలువ ద్వారా ఎల్‌ఎండీకి ఎగువన ఉండే పెద్దపల్లి, మంథని తదితర ప్రాంతాల్లో, ఎల్‌ఎండీకి కింద కాకతీయ కాలువ ద్వారా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని చెరువులను నింపుతున్నారు. వీటితోపాటు మహబూబ్‌నగర్‌లో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల నుంచి కూడా ఆ జిల్లాలోని చెరువులను నింపుతున్నారు. దీనికి ప్రత్యేకంగా చీఫ్ ఇంజినీర్ సురేశ్‌బాబును ప్రభుత్వం నియమించింది. ఎస్సారెస్పీ వరద కాలువ, ఎల్‌ఎండీ ఎగువ ప్రాంతాల్లోని చెరువులను నింపేందుకు కాడా సీఈ శ్యాంసుందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఎల్‌ఎండీ కింద వరంగల్, సూర్యాపేట, ఖమ్మం వరకు చెరువుల్లోకి నీళ్లు నింపే బాధ్యతను చీఫ్ ఇంజినీరు నాగేందర్‌కు కేటాయించారు. బాధ్యతలు తీసుకున్న అధికారులు.. గడిచిన రెండు రోజులుగా చెరువుల నింపే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మరోవైపు దేవాదుల ఎత్తిపోతల పథకంద్వారా మరో 250 చెరువుల్లో నీళ్లు నింపే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

భూగర్భ జలాలు పెంచడం.. రబీకి పుష్కలంగా నీళ్లు మిషన్ కాకతీయద్వారా పునరుద్ధరించిన చెరువుల్లోకి ఇటీవలి భారీ వర్షాలతో పెద్ద మొత్తంలో నీళ్లు చేరాయి. వర్షాలకు పూర్తిగా నిండని చెరువులను ఇప్పుడు నింపుతున్నారు. ఇది భూగర్భ జలాల వృద్ధికి గణనీయంగా దోహదం చేస్తున్నది. రాబోయే వేసవిలో కూడా తాగు, సాగునీటికి ఇబ్బందిరాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రబీ పంటకు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. దశాబ్దాలుగా తెలంగాణలో చెరువులకింద రెండో పంట పండలేదు. ఈసారి దీన్ని అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీఎం ముందు చూపు.. నీటిపారుదల మంత్రి కార్యాచరణ తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయాలపై సమగ్ర అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరించి మొత్తం యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంతో నీటిని సద్వినియోగం చేసుకోవడం సాధ్యమైంది. అనుక్షణం తాను అప్రమత్తంగా ఉంటూ మొత్తం యంత్రాంగాన్ని నడిపించారు. స్వయంగా మానేరు డ్యాం వద్దకు వెళ్లారు. హెలికాప్టర్‌ద్వారా ప్రాజెక్టులను, రిజర్వాయర్లను చూశారు. ఎప్పుడు, ఎక్కడికి నీళ్లు వదలాలో సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, ఆలోచనలకు అనుగుణంగా కార్యాచరణను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అమల్లో పెట్టారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.