Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రెట్టింపు ఆసరా

– 39.32 లక్షల పింఛన్‌దారులకు లబ్ధి.. జూన్ నుంచి అమలు జూలైలో చేతికందనున్న పెరిగిన పింఛన్ – ఎన్నికల హామీని నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వం – దివ్యాంగులకు రూ.1500 బదులు రూ.3016 – ఇతరులకు నెలకు రూ.1000 బదులు రూ.2016 – 57 ఏండ్ల నుంచి 64 ఏండ్లలోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే – ఇప్పటివరకు ఇస్తున్నది సుమారు రూ.418 కోట్లు – అదనంగా ఇచ్చేది సుమారు రూ.424 కోట్లు – మొత్తంగా నెలకు పెన్షన్లకు సుమారు రూ.842 కోట్లు

ఆసరా పెన్షన్‌దారులకు రెండింతలు ఆనందం కలిగించే వార్త. నెలకు ఇప్పటివరకు అందుతున్న వెయ్యి రూపాయల బదులు రూ.రెండువేల పదహార్లు, దివ్యాంగులకు రూ.1500 బదులు రూ.మూడువేల పదహార్లు పింఛన్‌కింద లభించనున్నాయి. అభాగ్యులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో ఆసరా పథకం కింద రకరకాల వర్గాలకు నెలవారీగా ఇస్తున్న పింఛన్ సొమ్మును ఎన్నికల హామీ మేరకు పెంచింది. జూన్ నెల నుంచి దీనిని అమలులోకి తెస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అంటే జూలై నుంచి ప్రస్తుతం లభిస్తున్న పింఛన్ మొత్తం కంటే రెట్టింపుపైగా లబ్ధిదారులకు చేతికి అందుతుంది. వాస్తవానికి ప్రభుత్వం మే నుంచే ఇచ్చేందుకు నిర్ణయించినా.. వరుసగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో అది సాధ్యంకాలేదు. జూన్ నుంచి పెరిగిన పింఛన్లను పంపిణీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లుచేసింది. ఇప్పటివరకు ఆసరా పింఛన్లు తీసుకుంటున్న 39.32 లక్షల మందికి రెండింతలకుపైగా మొత్తం అందుతుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, బోదకాలు వ్యాధిగ్రస్థులకు వెయ్యి రూపాయలకు బదులు రూ.2016, దివ్యాంగులకు రూ.1500 బదులు రూ.3016 లభించనున్నాయి.

మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ అమల్లోకి రానున్నది. ప్రతి నెలా ఇచ్చే వెయ్యి రూపాయల పింఛన్ ఇకపై రూ.2016కు, దివ్యాంగులకు ఇచ్చే రూ.1500ను ఇకపై రూ.3016కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఆసరా పింఛన్ల కోసం ప్రతి నెలా దాదాపు రూ.418 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం ఇకపై అదనంగా మరో రూ.424 కోట్లను దీనికి కేటాయించనున్నది. మొత్తంగా ఆసరా పథకానికి దాదాపు రూ.842 కోట్లు వెచ్చించనున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు లక్షల 90వేల 709 మంది దివ్యాంగులకు నెలకు రూ.1500 చొప్పున రూ.73కోట్ల 60లక్షల 63వేల 500 ఇస్తుండగా ఇప్పుడు అదనంగా రూ.74 కోట్ల 39లక్షల తొమ్మిదివేల 940 ఇవ్వాల్సి ఉంటుంది. దివ్యాంగులకు మొత్తంగా నెలకు రూ.3016 చొప్పున రూ.147కోట్ల 99 లక్షల 73వేల 440 అందుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఇతర ఆసరా లబ్ధిదారులు 34 లక్షల 41 వేల 600 మందికి నెలకు రూ.1000 చొప్పున రూ.344కోట్ల 16లక్షలు ఇస్తుండగా ఇప్పుడు అదనంగా రూ.349కోట్ల 66లక్షల 65 వేలు ఇవ్వాల్సి వస్తుంది. వీళ్లకు మొత్తంగా నెలకు రూ.2016 చొప్పున 693కోట్ల 82లక్షల 65వేలు అందుతుంది. మొత్తంగా అందరు ఆసరా పింఛన్‌దారులు.. 39 లక్షల 32వేల 309 మందికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.841 కోట్ల 82 లక్షల 38వేల 440 పంపిణీ చేస్తుంది. ఇక కొత్తగా 57 ఏండ్ల నుంచి 64 ఏండ్లలోపు వారికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వరుసగా ఎన్నికల కోడ్ వస్తుండటంతో కొత్త పింఛన్ల ఎంపిక వాయిదా పడుతున్నది. త్వరలోనే కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టి, పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.

వందల నుంచి.. వేలల్లోకి.. సమైక్యరాష్ట్రంలో ముందుగా వృద్ధాప్య పింఛన్ రూ.75 ఇవ్వగా.. 2004 తర్వాత రూ.200కు పెంచారు. అది జీవనావసరాలకు ఏమాత్రం సరిపోయేదికాదు. వీటిని కూడా నాలుగైదునెలలకోసారి ఇచ్చి.. వృద్ధులను ఎంతో ఉద్ధరించినట్లు నాటి ప్రభుత్వాలు ప్రచారం చేసుకున్నాయి. కానీ తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అసహాయులందరినీ ఆదుకునేలా వృద్ధులు, వితంతువులకు నేనున్నాననేలా.. పింఛన్ మొత్తాన్ని ఒకేసారి రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచారు. ఒకరిపై ఆధారపడి బతికే దివ్యాంగుల పింఛన్ రూ.1500కు పెంచారు. తాజాగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని రెండింతలు చేస్తున్నారు. అంతేకాకుండా అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు కుదించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 39 లక్షల మందికి వివిధ రకాల ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వయస్సు తగ్గించడంతో దాదాపు మరో పది లక్షల మంది వరకు అదనంగా చేరుతారని ప్రాథమికంగా అంచనా వేశారు.

39 లక్షలు దాటిన పింఛన్‌దారులు రాష్ట్రంలో ఆసరా పింఛన్లు అందుకుంటున్నవారి సంఖ్య 39 లక్షలు దాటింది. తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని అమలుపరుస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, బోదకాలు బాధితులతోపాటు ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నారు. మొత్తం 39,32,309 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో 4,90,709 మంది దివ్యాంగులున్నారు. దేశంలో ఒంటరి మహిళలకు పింఛన్లు ఇచ్చేది కేవలం మన రాష్ట్రమే. రాష్ట్రంలో 1,32,300 మంది ఒంటరి మహిళలకు నెలనెలా పింఛన్లు ఇస్తున్నారు. బోదకాలు బాధితులైన 14,140 మందికి పింఛన్లు మంజూరుచేశారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు మొత్తం 34,41,600 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.344.16 కోట్ల పింఛన్ ఇస్తున్నారు. వీరికి వచ్చే నెల నుంచి రూ.2016 చొప్పున పంపిణీ చేస్తే అదనంగా మరో రూ.349.66 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని లెక్కతేల్చారు. ఈ లెక్కన ప్రతి నెలా పంపిణీ చేయాల్సిన పింఛన్ల సొమ్ము రూ.693.82 కోట్లు.

రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రస్తుతం రూ.1500 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. తెలంగాణ సర్కారు రెండోసారి అధికారంలోకి రాగానే వీరికి రూ.3016 చొప్పున ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి అమల్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్నవారి సంఖ్య 4,90,709. ఇప్పటివరకు రూ.1500 చొప్పున రూ.73.60 కోట్లను చెల్లిస్తున్నారు. రెండింతలుగా పెంచనుండటంతో మరో రూ. 74.39 కోట్లు అదనంగా ఇవ్వనున్నారు. ఈ లెక్కన ప్రతి నెలా దివ్యాంగులకు రూ. 147.99 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 57 ఏండ్ల నుంచి 64 ఏండ్ల మద్య వయసున్నవారికి కూడా పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానిప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేశారు. వరుసగా ఎమ్మెల్యే, పంచాయతీ, ఎమ్మెల్సీ, లోక్‌సభ, పరిషత్ ఎన్నికలు రావడం, కోడ్ అమల్లో ఉండటంతో ఎంపిక ప్రక్రియ ఆలస్యమవుతున్నది.

బడ్జెట్‌లో రూ.12,067 కోట్లు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, బోదకాలు బాధితులకు ఇచ్చే నెలసరి పింఛన్ మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2016కు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.1500 నుంచి రూ.3016కు పెంచుతున్నారు. వృద్ధాప్య పింఛన్‌కు కనీస అర్హత వయసును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛన్ అందిస్తామని ప్రకటించారు. ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్లో రూ.12,067 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం పెంచిన పింఛన్లతో ప్రతి నెలా రూ.841.82 కోట్లు పంపిణీ చేయాల్సి వస్తుంది. కొత్తగా వచ్చేవారి సంఖ్య అదనం.

ప్రస్తుతం ఆసరా పింఛన్ల కింద -(దివ్యాంగులు మినహాయించి) 34,41,600 మందికి నెలకు రూ.1000 చొప్పున ఇస్తున్నది రూ.344.16కోట్లు.

-పెంచిన ప్రకారం వీరికి అదనంగా నెలకు ఇవ్వాల్సింది రూ.349,66,65,000 -జూలై నుంచి ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున పెన్షన్‌దారులకు ఇచ్చే మొత్తం రూ.693,82,65,000.

-దివ్యాంగులు మొత్తం 4,90,709 మందికి ప్రస్తుతం నెలకు రూ.1500 చొప్పున ఇస్తున్న మొత్తం రూ.73,60,63,500 -పెంచిన ప్రకారం నెలకు అదనంగా ఇవ్వాల్సింది రూ.74,39,09,940

-జూలై నుంచి దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.3016 చొప్పున లభించే పెన్షన్ మొత్తం రూ.147,99,73,440.

-మొత్తంగా జూలై నుంచి ప్రతీ నెలా ఆసరా పింఛన్ల కింద అందరికీ పంపిణీ చేయాల్సిన మొత్తం రూ.841,82,38,440

-మొత్తంగా జూలై నుంచి ప్రతీ నెలా ఆసరా పింఛన్ల కింద అందరికీ పంపిణీ చేయాల్సిన మొత్తం రూ.841,82,38,440

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.