గ్రామీణ తాగునీరు, పారిశుద్ద్యశాఖను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటిశాఖల మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. సకాలంలో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పూర్తి కోసం అధికారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారుల(ఆర్‌డబ్ల్యూఎస్) కు ఇన్నోవా వాహనాలను అందజేశారు.

-ఇంజినీర్లకు కొత్త వాహనాల పంపిణీ -నిర్దేశిత కాలంలో వాటర్‌గ్రిడ్ పూర్తిచేయాలి -అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం ఎర్రమంజిల్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ – ఇన్ – చీఫ్ కార్యాలయంలో బుధవారం ఆయన జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్లకు నూతన వాహనాలు అందజేశారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనుల అమలులో ఒకవైపు ఇంటేక్ వెల్స్, సర్వే, మరోవైపు గ్రామాల మధ్య అంతర్గత నెట్‌వర్క్ నిర్మాణ పనులు బహుముఖంగా జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు.
43శాతం ఫిట్‌మెంట్‌తో ఉద్యోగులకు పదో పీఆర్సీ, హెల్త్‌కార్డుల జారీ, పోలీసుశాఖలో భారీ మార్పులతో తమ ప్రభుత్వం ఉద్యోగమిత్ర సర్కార్‌గా పేరు తెచ్చుకున్నదన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌ని నిబద్దతతో చేపట్టిందని తెలిపారు. ఉద్యోగులు అదివారం సైతం పనిచేస్తున్నారని చెప్పారు. ఇదే పట్టుదలతో పనిచేస్తూ నిర్దేశిత సమయంలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులను మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఉమాకాంత్ రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్ రెడ్డి, సత్యపాల్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు బాబురావు, చక్రపాణి, రవీందర్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లకు 65 లక్షలు మంజూరు జాతీయ గ్రామీణ తాగునీటి ప్రాజెక్టు పర్యవేక్షణకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం రూ.65 లక్షలు మంజూరుచేసింది. ఈ నిధులతో ఆర్‌డబ్ల్యూఎస్ ప్రధాన కార్యాలయంతో డివిజన్, సబ్ డివిజనల్ కార్యాలయాల అనుసంధానానికి వెబ్ బేస్డ్ వీడియో కాన్ఫరెన్స్ టెక్నాలజీగల పరికరాలను కొనుగోలుచేస్తారు. ఇందుకోసం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 41 కేంద్రాల్లో ఎల్‌ఈడీ స్కీన్, స్పీకర్లు, హెచ్‌డీ కెమెరాలు, ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ ఛార్జీల కోసం రూపొందించిన అంచనాల మేరకు కేంద్రం ఐదుశాతం నిధుల వ్యయానికి నవంబర్‌లోనే అనుమతినిచ్చింది.