Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

‘రైతు బంధు’వు కేసీఆర్

నకిలీ విత్తనాలను నమ్మి మోసపోవడం.. చేతికి పంట రాక.. పెట్టుబడికి చేసిన అప్పు కట్టలేక.. కుటుంబ పాలన సమస్య గా మారిన రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మహత్యే శరణ్యమైంది. కొద్దో గొప్పో చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడిన రైతు కండ్లల్లో ఇప్పుడు మార్పు చూస్తున్నాం. ఓ వైపు సాగు నీళ్లు, మరో వైపు నిరంతర విద్యుత్. ఒకప్పుడు జీవితంపై ఆశ వదులుకున్న రైతు, నేడు గుండె నిండా ధైర్యంతో వ్యవసాయం చేసుకుంటున్నడు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు, రైతు కష్టాలు తెలిసిన నాయకుడు. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా కొత్త తరహా రైతు పథకాలు ప్రవేశ పెట్టి రైతుల ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్న రు. ఈ గుణాత్మక మార్పులతో రైతులకు భరోసా ఇస్తు న్నది తెలంగాణ రాష్ట్రం. నేను పది నెలల కిందట రాజాపేటలో ఓ ఉరికి వెళ్తున్నాను. బొందుగుల గ్రామం వద్ద ఓ రైతును చూసి కారు ఆపాను. అతని దగ్గరికి వెళ్లి నేనెవరో తెలుసా అని అడిగాను. మీరు గొంగిడి సునితమ్మ కదా అన్నాడు. ఇలా మా ఇద్దరి మధ్య పది నిమిషాల సంభాషణ జరిగింది. ఆ రైతు పేరు యాదగిరి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం ఎలా అందించాలో రైతుల అభిప్రాయం సేకరిస్తున్నాను. మీ అభిప్రాయం చెప్పండి అని యాదగిరిని అడిగాను. యాదగిరి ఇచ్చిన సమాధానం నన్ను ఆకట్టుకున్నది. ఆరెకరాల భూమి ఉన్న నేనే 8 ఏండ్ల కిందట వ్యవసాయం మానేసి హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో కూలీ పనులకు వెళ్తున్నాను. నా భార్య ఇండ్లల్లో పాచి పనిచేస్తున్నది. ఊర్ల చేసిన అప్పులన్నీ మెల్లమెల్లగా తీరుస్తున్నా. తెలంగాణ వచ్చినంక, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినం క నీళ్లు వస్తున్నయని, 24 గంటల కరెంటు వస్తున్నదని, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం ఇస్తున్నరని తెలిసి ఇప్పుడు ఊరి బాట పట్టిన. 8 ఏండ్ల కింద ఇడిసిపెట్టిన ఎవుసం మళ్లీ షురూ జేస్తున్నా… యాదగిరి మాటల్లో ధైర్యం, గర్వం కనిపించింది, ఇక వ్యవసాయం పండుగ అయితదని సీఎం కేసీఆర్ చెప్పిన మాట యాదికివచ్చింది.

అప్పు లు కట్టలేక ఉరితాడు వేలాడిన రైతు ఇప్పుడు ధైర్యం హలం పట్టి ముందుకు కదులుతున్నడు. రైతులకు దగ్గర కావాలన్న తపనతో ప్రభు త్వం రైతుల్లో నూతన ఒరవడిని కలిపించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత దేశంలోని కొన్ని ఇతర రాష్ర్టాలు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా రైతు రుణమా ఫీపై చర్చ మొదలైంది. దీంతో పాటు వ్యవసాయ సంక్షోభాన్ని గట్టెక్కించ డమెట్లా అనే చర్చ కూడా జరుగుతున్నది. రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం జరుగదని వాదిస్తున్నవారు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతుబంధు వంటి పథకాలను ప్రశంసించడం గమనార్హం. పైగా వారు రుణమాఫీని వద్దంటూనే, వ్యవసాయ సంక్షోభ నివారణకు ఏ సూచనలు చేస్తున్నారో, వాటిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తుండ టం కూడా గమనించవలసిన విషయం. రైతు రుణమాఫీని విడిగా చూడకుండా, సమగ్ర వ్యవసాయ వ్యూహం లో భాగంగా చూసినవారికి దాని ప్రాధాన్యం అర్థమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన రుణమాఫీలు, ఇప్పుడు కొన్నిఇతర రాష్ర్టాలు ప్రకటించిన రుణమాఫీలతో పోలిస్తే, తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రుణమా ఫీ స్వభావరీత్యా భిన్నమైంది. మిగితా నాయకుల మాదిరిగా ఓట్ల కోసం అనుసరించే ఉపశమనంగా కాకుండా వ్యవసాయ సంక్షోభ నివారణలో భాగంగా సీఎం కేసీఆర్ రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈ పథ కం రైతులకు ఉపయోగకరంగా మారుతున్నది. జాతీయస్థాయి రాజకీ యాల్లో కొత్త ఒరవడి ప్రవేశపెట్టాలని భావిస్తున్న కేసీఆర్‌కు వ్యవసాయ రంగంలో తాను సూచించే పరిష్కారాలకు తెలంగాణ నమూనా ఉపయు క్తంగా ఉంటుంది. ఆర్థికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిధిలోనే ఆలోచిస్తారు. కానీ పరిపాలకులు మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కా రా లు అన్వేషిస్తారు. కేసీఆర్ వ్యవసాయరంగ వ్యూహం ఈ విధంగా రూపొందినదే. పంటకు పెట్టుబడి లేక, నీటి వసతి లేక, కరెంటు లేక, గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

యాంత్రీకరణ జరుగడం లేదు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వ్యవసాయరంగ సం స్కరణలు అమలు జరుగడం లేదు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందడం లేదు. వీటన్నిటి పరిష్కారం కోసం మన కేసీఆర్ సార్ తెలంగాణను నమూనాగా నిలబట్టేందుకు ముందుకుపోతుండు. రైతులకు అవసరమైన నీటి వసతి, విద్యుత్, పెట్టుబడి, యంత్రాలు, గిడ్డంగులు, మార్కెట్ సౌకర్యం, పంటకు మద్దతు ధర మొదలైనవి అం దించడంతోపాటు, రైతు సమన్వయ సమితిల ఏర్పాటు ద్వారా పంట వేయడం మొదలుకొని మార్కెటింగ్ వరకు పకడ్బందీ వ్యవస్థ నిర్మాణం సాగుతున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రైతులకు 17వేల కోట్లతో రుణమాఫీ చేశారు. నీలం, పైలాస్ తుఫాన్లతో వచ్చిన నష్టం వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు 480 కోట్లతో ఇన్‌పుట్ సబ్సిడీని అంద జేశారు. వ్యవసాయ క్షేత్రంలో మంచి చెడులను చర్చించుకొని, అధికారు ల సలహాలతో ముందుకు కదిలేందుకు రైతు వేదికలను ఏర్పాటుచేసి ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తర ణాధికారిని నియమించా రు. ప్రతి 5 వేల ఎకరాలకు రైతు వేదిక ఏర్పాటు చేశారు. ఒక్కో వేదిక కోసం 12 లక్షలతో భవనాన్ని నిర్మించడమే కాకుండా నూతన టెక్నాలజీ ని రైతులకు ఎప్పటికప్పుడు అందిచడానికి కంప్యూట ర్లు, ఆన్‌లైన్ సిస్టమ్ లు ఏర్పాటుచేశారు. మట్టి నమూనాలను పరీక్షించేం దుకు ఆధునిక సాం కేతిక పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. మట్టి లో సారాన్ని పరీక్షించి రైతుకు అవగాహన కల్పించడమే కాకుండా అందులో డీఏపీ, యూరి యా, ఎంతవరకు వాడాలి, నీరు ఎంత పెట్టాలి, ఆ మట్టి లో ఏ పంట వేయాలని రైతులకు సూచనలు ఇచ్చే కేంద్రంగా మలుస్తు న్నారు. ఏ వస్తువు కొనాలన్నా ఉత్పత్తిదారుడికే వస్తువు ధర నిర్ణయించే హక్కు, అధికారం ఉన్నా, రైతుకు మాత్రం తాను పండించిన పంటకు ధరను నిర్ణయించి అమ్ముకునే పరిస్థితి లేదు.

ధరను నిర్ణయించే హక్కు ను రైతులకు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం. అవసరమైన చోట శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యవసాయ పనిముట్లు కూడా అందించి పం ట కాలనీలను ఏర్పాటుచేయడం జరుగుతున్నది. రైతన్న ఏ పంట వేసు కున్నా ఆ పంటకు డిమాండ్ తగ్గకుండా చేయాలని కేసీఆర్ సంక ల్పించా రు. భవిష్యత్‌లో గిట్టుబాటు ధర గోస రైతులకు ఉండకూడదనే వినూ త్నమైన పద్ధతిలో పంట కాలనీలు ఏర్పాటుచేసి గ్రామాల వారీగా వ్యవ సాయ క్షేత్రాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ధరలను నియం త్రించడం కోసం పంట కాలనీలు ప్రవేశ పెట్టాలన్నదే కేసీఆర్ ఆలోచన. కేసీఆర్ గారితో చర్చిస్తున్నప్పుడు వింటుంటే గర్వంగా అనిపిస్తది. అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవడానికి ఎవరు ఉహించని పథకం తీసుకొ చ్చారు. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టి నకిలీ విత్తనాలు, ఎరువులు ఎవరైన వ్యాపారస్తులు విక్రయిస్తే 6 నెలల జైలుశిక్ష వేసి కఠినంగా శిక్షిం చాలని ఆయన అన్నారు. రైతుబంధు పథకం వల్ల రైతు తనకు కావల సిన పెట్టుపడి కోసం బ్యాంకులు లేదా వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధార పడాల్సిన అవసరం ఉండదు. వడ్డీల భారం ఉండదు. ముఖ్యంగా రైతు కు మానసిక ఒత్తిడి దూరమయ్యే అవకాశం ఉన్నది. తద్వారా రైతు తన సాగు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవే ళ ప్రకృతి విపత్తుల వల్ల పంట ఎండిపోయినా లేక మద్దతు ధర రాక పోయినా రైతు మీద భారం పడదు. అలాగే రైతుల ఆత్మహత్యలు ఉం డవు. అన్నం పెట్టే రైతు దేవుడితో సమానం అనేది కేసీఆర్ అభిప్రాయం. ఆరుగాలం కష్ట పడి పంటను పండించి మనకు అన్నం పెట్టి రైతు కాలం చేస్తే వారి కుటుంబం ఆనాథ అయితది.

ఆ కుటుంబాలను ఆదుకుంటే కొంతైన బాధతీర్చగలమని కేసీఆర్ చేసిన ఆలోచనే రైతు బీమా. తెలంగా ణ వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు పేరిట ప్రతి ఏటా రూ.2271 చెల్లిస్తు న్నారు. రైతు దూరమైతే వారం రోజుల్లో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమాను అందేలా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. రైతులను సంపన్నులను చేసి అంతిమంగా అప్పులు లేని దశకు తీసుకపోవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అంతిమ లక్ష్యం. వ్యవసా యం ఒక పండుగ కావాలని ఆయన లక్ష్యం. రైతే రాజు కావాలనేది ఆయన సంకల్పం. ఒక రైతే పాలకుడిగా అధికారం చేపడితే రైతు సంక్షే మం కోసం ఏమైతే చేయగలరో అదంతా సీఎం కేసీఆర్ ఇప్పుడు తెలం గాణలో అమలు చేస్తున్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం గా నిలుస్తుందనటంలో సందేహం లేదు.

(వ్యాసకర్త: గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే, ఆలేరు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.