Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతు ధీమాకోసమే బీమా

-చరిత్రలో నిలిచిపోయేలా రైతుబంధు -58 లక్షల రైతులకు 12 వేల కోట్ల పెట్టుబడి సాయం కుల వృత్తులకు పూర్వవైభవం -రైతన్న, నేతన్న, గీతన్నల సంక్షేమానికి -కట్టుబడ్డాంతెలంగాణ ప్రజల నుదుటి రాత మారుస్తున్న సీఎం -సర్దాపూర్ బహిరంగ సభలో మంత్రి శ్రీ కేటీఆర్ -వ్యవసాయ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు అన్నారు. లక్షల రైతు కుటుంబాలకు ధీమా కల్పించేందుకే రైతు బీమా పథకాన్ని పంద్రాగస్టు నాడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని చెప్పారు. రైతన్న, గీతన్న, నేతలన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. రైతును రాజుగా, నేత కార్మికుడిని యజమానిగా మార్చే అద్భుత పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. రైతుబంధు ద్వారా రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు రూ.12 వేల కోట్ల పెట్టుబడి అందిస్తున్నామని తెలిపారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సంక్షేమ పథకాలు చేపడుతున్న ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా నిలువాలని విజ్ఞప్తిచేశారు.

బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్దాపూర్‌లో వ్యవసాయ కళాశాల భవనానికి వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సమైక్య పాలకుల నిర్లక్ష్యంతోనే వ్యవసాయం, చేనేత పరిశ్రమలు కుంటుపడి పోయాయని, రైతులు, నేత కార్మికుల ఆత్మహ్యత్యల వార్తలే వినాల్సివచ్చేదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ నుదుటి రాత మార్చి, దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బంగారు తెలంగాణవైపు రాష్ర్టాన్ని తీసుకెళ్లడంలో సీఎం కేసీఆర్ సఫలీకృతులవుతున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు బ్యాంకులపై నమ్మకంపోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చెక్కులు ఇచ్చి బ్యాంకుల్లో డబ్బులు ఎలా తీసుకోవాలో రైతుల అనుమానాలు నివృత్తి చేస్తూ, రూ.5,700 కోట్లు డిపాజిట్లు చేసిందని, పంపిణీచేసిన చెక్కుల్లో ఇప్పటివరకు రూ.4వేల కోట్ల నగదును డ్రా చేసుకున్నారని తెలిపారు.

రైతు బీమాకు సర్కారీ ప్రీమియం రైతు కుటుంబాలకు ధీమా కల్పించేందుకే 18 నుంచి 60 ఏండ్ల వయసున్న ప్రతి రైతుకూ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.2,270 చొప్పున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని స్పష్టంచేశారు. ఈ పథకంలో ప్రతిరైతునూ చేర్పించే బాధ్యత తీసుకోవాలని రైతుసమన్వయ సమితులను ఆయన కోరారు.

వేగంగా కాళేశ్వరం పనులు నెహ్రూ హయాంలో మొదలుపెట్టిన ఎస్సారెస్పీ పనులు ఆరు దశాబ్దాలు కొనసాగాయని, వాటిని తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిందని కేటీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కాలం తో పోటీపడి వేగంగా నడుస్తున్నాయని తెలిపారు. 38 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని తెలిపారు. సమైక్య పాలనలో కన్నీళ్లు చూసిన సిరిసిల్లలో నీళ్లు చూడడం సంతోషంగా ఉందన్నారు. పంటలకు బీమా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. సీఎం కృషితోనే రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకూ 24 గంటల కరంటు అందిస్తున్నామన్నారు. ప్రతి కులవృత్తికీ పూర్వవైభవం తేవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ర్టాన్ని అహార ధాన్యాల ఉత్పత్తుల కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, అందుకోసం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ మైసూరును సందర్శించి వచ్చిందని కేటీఆర్ తెలిపారు.

నవంబర్ 18 నుంచి మలివిడుత చెక్కుల పంపిణీ: మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతుబంధు పథకంలో భాగంగా నవంబర్ 18న మలివిడుత చెక్కుల పంపిణీ ప్రారంభిస్తున్నట్టు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. దేశంలోనే ఏడాదికి రూ.12వేల కోట్లు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని చెప్పారు. అహార ఉత్పత్తుల హబ్‌గా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నది కేసీఆర్ సంకల్పమని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాలలో ప్రజలు కరంటు కోతలతో ఇబ్బందులు పడుతుంటే.. తెలంగాణలో 24 గంటలు కరంటు ఇస్తున్నామని చెప్తూ.. ఈ ఘనత కేసీఆర్‌దేనన్నారు. సర్దాపూర్‌లో రూ.30 కోట్లతో 70 ఎకరాల్లో వ్యవసాయ కళాశాల నిర్మిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెంది, అహారోత్పత్తులను పెంపొందించే బృహత్తర కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని, అందులోభాగంగా తాను మైసూరు పర్యటించానని చెప్పారు.

ప్రగతి నివేదికల ఆవిష్కరణ.. సిరిసిల్ల నియోజకవర్గ ప్రగతి నివేదికలను మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ చేపట్టిన అభివృద్ధి పనుల వివరాల ప్రగతి నివేదికతోపాటు పాటల సీడీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రవీణ్‌రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

కాల్వల నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి కేటీఆర్ సిద్దిపేట రూరల్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా రంగనాయకసాగర్ కుడి కాల్వ, మల్లన్నసాగర్ ప్రధాన కాల్వల నిర్మాణ పనులను బుధవారం మంత్రులు కేటీఆర్, పోచారం పరిశీలించారు. సిద్దిపేట జిల్లా మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు పర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో సిద్దిపేట- సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన ఇమామ్‌బాద్, రామంచ వద్ద ఈ కాల్వ పనులను పరిశీలించారు. పనులు వాయువేగంతో జరుగుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

మనసున్న మారాజు.. కేటీఆర్ -కిడ్నీవ్యాధితో బాధపడుతున్న విద్యార్థికి సాయం -డాక్టర్‌తో మాట్లాడి చికిత్సకు ఆదేశం

మంత్రి కేటీఆర్ తనలోని మానవీయ కోణా న్ని మరోమారు ఆవిష్కరించారు. కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన విద్యార్థినికి ఆపన్నహస్తం అం దించారు. దుంపలపల్లి నాగమణి కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నది. దీనికితోడు ఆమె తండ్రి రాములు రెండునెలల క్రితం మరణించడంతో కుటుం బం దిక్కుతోచని స్థితిలో ఉన్నది. సర్దాపూర్ వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌తో బాధిత కుటుంబాన్ని స్థానిక నేతలు మాట్లాడించారు. తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చిన కేటీఆర్.. విషయం నోట్ చేసుకోవాలని పీఏకు సూచించారు. అక్కడినుంచి ముస్తాబాద్‌లో మరో కార్యక్రమానికి వెళుతున్న కేటీఆర్.. అదే సమయంలో తల్లి పార్వతి, తమ్ముడు శివతో కలిసి నడిచి వెళుతున్న నాగమణిని గమనించి, వాహనాన్ని వెనక్కు మళ్లించాలని చెప్పి.. మరోసారి వారితో మాట్లాడారు. చికిత్స అందిస్తున్న డాక్టర్‌తో మాట్లాడటంతోపాటు.. బాధితురాలిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకురావాలని టీఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు పులి రమేశ్‌కు సూచించిచడంతో ఆమె కుటుంబం ధైర్యం కూడదీసుకున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.