కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధి ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్‌లో ఈ నిధికి కొంతమొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉన్నది. రైతులను ఆదుకోవడానికి ఈ నిధి ఉపయోగపడనున్నది అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు వెల్లడించారు. మొక్కజొన్న, వడ్లను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు 72 గంటల్లో ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు.

మెదక్ జిల్లాలో ఈ ప్రక్రియ సమర్థంగా అమలవుతున్నదని, 72 గంటల్లో డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి వచ్చినట్లు ఎస్‌ఎంఎస్ ద్వారా రైతు సెల్‌ఫోన్‌కు సమాచారం అందించే ఏర్పాట్లు చేశామన్నారు. పాడిరైతును ప్రోత్సహించడానికి పాలధరను ఒకేసారి రూ.4 పెంచామని గుర్తుచేశారు. ఇలా ప్రతి కార్యక్రమం రైతు సంక్షేమమే ధ్యేయంగా చేపడుతున్నామన్నారు. రైతుల కోసం సర్కారు అనేక కార్యక్రమాలు అమలుచేస్తుంటే ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. -బడ్జెట్‌లో సీఎం నిధులు కేటాయించే అవకాశం -కరెంట్ లేక కాదు.. నీళ్లు లేకే ఆత్మహత్యలు -బువ్వపెట్టే ఆన్నదాతను కాపాడుకుందాం -మీకు అండగా ప్రభుత్వం.. ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు -రైతులను ఓదార్చడం ప్రతి ఒక్కరి బాధ్యత -ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి -భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపు బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంజీరా పైప్‌లైన్ ప్రారంభం,కంది ఐఐటీ భూనిర్వాసితులకు ఇండ్ల పట్టాలు, నష్టపరిహారానికి సంబంధించిన చెక్కుల పంపిణీ, జోగిపేటలో సీసీఐ పత్తికొనుగోలు కేంద్రం ప్రారంభం, నారాయణ్‌ఖేడ్‌లో మోడల్ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. రైతే దేశానికి వెన్నెముకని నమ్మే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిక్షణం రైతు సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నదన్నారు. సమైక్యరాష్ట్రంలో ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఇప్పుడు రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పా రు.
అయినా రైతులకు అండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని, అత్మైస్థెర్యం కోల్పోయి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరా రు. వర్షాభావంతో బోరుబావులు ఎండి రైతులు బలవన్మరణాలకు పాల్పడడం కలచివేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆత్మహత్యలకు కరెంట్ సమస్య కారణం కాదని, వర్షాలు లేకపోవడం తో కరువు ఏర్పడిందన్నారు.
బోరుబావుల్లో నీరెండిపోయిందని, కరెంటున్నా నీరందక పంట ఎండే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నదాతల్లో అత్మస్త్యైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదన్నారు. అన్నదాత లేనిదే బువ్వలేదని, అలాంటి కర్షకులను కాపాడుకోవడానికి మానవతావాదులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థి, యువజన, స్వచ్ఛందసంస్థలు నడుంబిగించాలని కోరారు.
రాజకీయాలకతీతంగా బాబు చర్యలను ఖండించాలి భూగర్భజలాల పెంపు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిందని, ఈ ఏడాది రూ.5 వేల కోట్లు వెచ్చిస్తున్న ట్టు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. చెరువుల మరమ్మతు, పూడికతీతతో రైతు లకు పాతరోజులు వస్తాయని భరోసాఇచ్చారు. బిందు, తుంపర సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్, స్లింకర్లు ఉచితంగా, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీపై, ఇతర రైతులందరికీ 80 శాతం సబ్సిడీపై అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా షేడ్‌నెట్ ద్వారా కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
రుణమాఫీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించామని, ప్రతి రైతుకు కొత్తరుణాలు అందుతాయని భరోసా ఇచ్చారు. నాలుగేండ్ల వరకు ఎన్నికలు లేవని, ప్రతిపక్షాలు రాజకీయాలకు పోకుండా అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు ఇప్పటికీ విద్యుత్ విషయంలో అడ్డుపడుతూనే ఉన్నారని, రాజకీయాలకతీతంగా బాబు చర్యలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, బాబూమోహన్, జిల్లా కలెక్టర్ రాహూల్‌బొజ్జా, జేసీ శరత్ పాల్గొన్నారు.