Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతుల నడ్డివిరిచిన నోట్లరద్దు

తెలంగాణలోని గ్రామీణ బ్యాంకులకు ప్రస్తుత సీజన్లో రూ. 21 వేల కోట్లను రిజర్వ్ బ్యాంకు విడుదల చేయాల్సి ఉన్నా ఇప్పటికి కేవలం తొమ్మిది వేల కోట్లను మాత్రమే విడుదల చేసింది. నాలుగైదు రోజుల్లో ఇంకో రూ.1700 కోట్లు విడుదల కానున్నా యి. సీజన్ ప్రారంభానికే అవసరాలకనుగుణంగా నోట్లు సరఫరా అయితే ఫలితం ఉండేది. అక్టోబర్ వరకూ సీజన్ ఉంది కదా అని ఆలస్యం చేస్తే డబ్బు లు పంపినా ప్రయోజనం పెద్దగా ఉండదు.

నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దుచేసిన తర్వాత గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మూడొంతుల దేశ జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నా వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా నోట్లు సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైంది. తగిన కసరత్తు చేయకుండానే నోట్ల ర ద్దు నిర్ణయం తీసుకోవడంతో కొత్త నోట్లన్నీ ఇం డ్లలో దాచుకోవడానికి పరిమితమయ్యాయి. దీంతో రోజువారీ అవసరాలకు నోట్ల కొరత ఏర్పడింది. మీరు నీళ్ళ వెంట పడుతున్నారు.. అందుకే మీకు వర్షాలు బాగా పడుతున్నాయి.. అని ప్రధాని మోదీ గతవారం సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నైరుతి రుతపవనాలతో తెలంగాణలో వానలు సంతృప్తిగా పడుతున్నాయి. రైతులంతా సంతోషంగా ఉన్నారు. పొలం పనులు ప్రారంభమయ్యా యి. ప్రకృతి కరుణించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం దయ చూపడం లేదు. విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి చేతిలో నగదు లేదు. వ్యవసాయ కూలీలకు ఇవ్వడానికి నోట్లు లేవు. ట్రాక్టర్ కిరాయికీ పైసలు లేవు.

ఖాతాలోంచి పదివేలు తీసుకుందామంటే నోట్లు తక్కువగా ఉన్నాయని రెండు వేలతో సరిపెట్టుకోండంటూ బ్యాంకు సిబ్బంది సలహా ఇస్తున్నారు. పదివేలను తీసుకోవడానికి ఐదుసార్లు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది. ఒకవైపు పని దండుగ, మరోవైపు సమయం వృథా. ఇంకో వైపు గ్రామాల నుంచి బ్యాంకుకు వచ్చి వెళ్లడానికి రానుపోను ఖర్చులు అదనం. అందుకే వాస్తవిక స్థితిని కండ్లారా చూసి మన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నోట్ల రద్దుతో రైతులు బిచ్చగాళ్ళయ్యారు. బ్యాంకుల ముందు నిలబడాల్సి వచ్చింది. రిజర్వు బ్యాంకు తగిన నిల్వలను గ్రామీణ బ్యాంకులకు సకాలంలో పంచితే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు.పెద్ద నోట్లను రద్దయ్యి కొత్త నోట్లు బయటకు వచ్చిన తర్వాత వాటిని దాచుకోవడాని కి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వచ్చిన కొత్త నోట్లలో ఎక్కువ భాగం ఇండ్లలో దాచుకోవడానికే వాడుకుంటున్నారు. మళ్లీ అవి బ్యాంకుల్లోకి వెళ్లడం లేదు. దీంతో చలామణిలో నోట్ల కొరత ఏర్పడింది. నోట్లరద్దు మంచిదా? చెడ్డదా? అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కంటే 70 శాతం మంది రైతుల రోజువారీ పనులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడమే ఇప్పుడు ప్రధానం.

ఇంకోవైపు బడాబాబులు మాత్రం కొత్త నోట్లను కట్టల కొద్దీ దాచుకుంటున్నారు. లెక్క కు మించిన కట్టలు కార్లలో తరలిపోతున్నాయి. ఆదాయపు పన్ను శాఖాధికారులు ఇటీవల టన్నుల కొద్దీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కంట పడకుండా తరలిపోతున్నవాటికి లెక్కేలేదు. నోట్ల రద్దు జరిగి ఎనిమిది నెలలు పూర్తయినా కష్టాలు తీరలేదు. కేంద్రం తగిన దిద్దుబాటు చర్యలూ తీసుకోలేకపోయింది. పార్లమెంటు కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. నోట్లరద్దు ఎం దుకు జరిగిందో చెప్పలేదు. పాత నోట్లు ఎన్ని వచ్చాయో చెప్పలేదు. కొత్తనోట్లు ఎన్ని విడుదల చేశారో చెప్పలేదు. నోట్ల కొరత సమస్య ఎప్పటికి తీరుతుందో చెప్పలేకపోయారు. ఏ సమాధానమూ సంతృప్తికరంగా ఇవ్వలేకపోయారు. నగదురహిత లావాదేవీలను అలవాటు చేసుకోవాలనడం తప్పేమీ కాదు. కానీ దానికి తగిన చైతన్యం, అవగాహన, శిక్షణ, మౌలిక సదుపాయా లు, ఏర్పాట్లు .. ఇలా సర్వం సిద్ధంగా ఉంటేనే ఫలితాలుంటాయి.

దేశంలో 75 శాతం మంది వ్యవసాయంపైనా, వ్యవసాయాధారిత రంగాలపైన ఆధారపడి బతుకుతున్నవారే. వీరందరికీ బ్యాంకు ఖాతా లుండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ యోజన పథకాన్ని తీసుకురావడం, జీరో బ్యాలెన్స్ తో ఖాతాలను తెరిపించడం మంచి పరిణామమే. ఇప్పటివరకు 36 కోట్ల ఖాతాలను తెరిచినట్లు కేం ద్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నది. కానీ ఇందు లో ప్రతి బ్యాంకుకు టార్గెట్ ఇచ్చి చేయించినవే ఎక్కువ. బ్యాంకు సిబ్బందిపై కేంద్రం ఒత్తిళ్ళు కూడా తీవ్రంగానే ఉన్నాయి. టార్గెట్‌ను పూర్తిచేయడం కోసం ఇప్పటికే ఖాతాలు ఉన్నవారి పేరుతో మళ్లీ జన్‌ధన్ యోజన కింద ఖాతాలు కొత్తగా తెరిపించినవి ఈ 36 కోట్లలో కనీసంగా పది కోట్లు ఉండవచ్చని అంచనా. పైగా కొత్తగా తెరిచిన ఈ జన్‌ధన్ యోజన ఖాతాల్లో చాలావరకు ఎలాంటి లావాదేవీ లు జరుగకుండా అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. అయితే వీటికి ఆధార్ కార్డు వివరాలను జోడించడంతో ఇంకా ఎక్కడెక్కడ ఏ ఖాతాలున్నా యో కూడా బ్యాంకులకు తెలిసిపోతున్నది.

గ్రామాల్లో నగదురహిత లావాదేవీలు జరుగడానికి అవసరమైన మౌలిక సౌకర్యాల్లేవు. ఏటీఎంలు తక్కువే. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) పరికరా లూ అంతంత మాత్రమే. మొబైల్ బ్యాంకింగ్‌ను వాడుకునే పరిజ్ఞానం గ్రామీణులకు లేకపోగా ఇంటర్నెట్ సౌకర్యం చాలా గ్రామాల్లో లేదు. నగదు రూపంలో ఖర్చు చేయడానికి, కూలీలకు, కిరాయి లు చెల్లించడానికే రైతులు ఎక్కువగా ఇష్టపడుతారు. ఎందుకంటే పప్పులు, బియ్యం, ఇతర అవసరాలు తీర్చుకోవాలంటే నగదు తప్ప మరో మార్గం గ్రామా ల్లో లేదు. పట్టణాల్లో ఉన్నట్లుగా పేటీఎం, భీమ్ యాప్, నెట్ బ్యాంకింగ్ లాంటివి గ్రామాల్లో అందుబాటులో లేవు. ఇంకా గ్రామీణ వ్యవస్థ నగదురహిత లావాదేవీలకు తగినవిధంగా సిద్ధం కాలేదు. నగదురహిత లావాదేవీలపై రైతులకు, గ్రామీణ ప్రజలకు బ్యాంకులు తగిన అవగాహన కల్పించి అందుకు దీటుగా సాంకేతిక (ఇంటర్నెట్) సౌకర్యాలను కల్పిస్తే బాగుండేది.

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మండ్‌సోర్‌లో రైతులు చేసిన ఆందోళనల్లో కనీస గిట్టుబాటు ధర కల్పించాలనడంతో పాటు దాన్ని నగదు రూపంలో చెల్లించాలన్నది కూడా ప్రధాన డిమాండ్. నగదురహిత పద్ధతిలో రైతు తన పంటను అమ్ముకున్న తర్వాత నెలల తరబడి ఆ డబ్బు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది. ఆ రాష్ట్ర మంత్రి ఒకరు ఇటీవల ఒక రైతు మరణిస్తే వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ను పరామర్శించి ప్రభుత్వం నుంచి అందే పదివేల రూపాయల తక్షణ సాయాన్ని నగదు రూపంలోనే అందించాలని అధికారులను ఆదేశించారు. అంటే గ్రామాల్లో నగదు అవసరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలోని గ్రామీణ బ్యాంకులకు ప్రస్తుత సీజన్లో రూ. 21 వేల కోట్లను రిజర్వ్ బ్యాంకు విడుదల చేయాల్సి ఉన్నా ఇప్పటికి కేవలం తొమ్మిది వేల కోట్లను మాత్రమే విడుదల చేసింది. నాలుగైదు రోజుల్లో ఇంకో రూ.1700 కోట్లు విడుదల కానున్నా యి. సీజన్ ప్రారంభానికే అవసరాలకనుగుణంగా నోట్లు సరఫరా అయితే ఫలితం ఉండేది. అక్టోబర్ వరకూ సీజన్ ఉంది కదా అని ఆలస్యం చేస్తే డబ్బు లు పంపినా ప్రయోజనం పెద్దగా ఉండదు.వాస్తవిక పరిస్థితులు ఇలా ఉండగా కేంద్ర ప్రభు త్వం గ్రామీణ బ్యాంకుల అవసరాలకు తగిన విధం గా కొత్త నోట్లను సరఫరా చేయలేకపోవడం ఒక వైఫల్యమే. ఎనిమిది నెలలు గడిచినా పరిస్థితి సంతృప్తికరంగా లేదంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మారిందో తెలిసిపోతుంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే..

1.వంద రూపాయలు, అంతకంటే తక్కువ విలు వ కలిగిన నోట్లను ఎక్కువస్థాయిలో రిజర్వుబ్యాంకు ముద్రించాలి. గ్రామీణ ప్రాంతాల్లో చలామణి కోసం వీటిని పంపాలి. ఈ పని ఎంత తొందరగా జరిగితే రైతుల నోట్ల కష్టాలు అంత తొందరగా తీరుతాయి. 2.కిసాన్ క్రెడిట్ కార్డు స్థానంలో క్యాష్ క్రెడిట్ విధానాన్ని ప్రవేశపెట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే రుణ అవసరాలను నిర్ణయించాలి. రైతు ఆ సంవత్స రం వేసే పంటను బట్టి నీటి లభ్యతను బట్టి సాగు విస్తీర్ణాన్ని నిర్ణయించాలి. ఇందుకోసం వ్యవసాయ అధికారి మొదలు తహసీల్దారు వరకు గ్రామాల వారీగా రైతుల జాబితాను, వారి భూముల వివరాలను, పంట తీరును, బ్యాంకుల్లో నోట్ల లభ్యతను, వాటిని రైతులకు రుణం రూపంలో చెల్లించే వెసులుబాటు.. వీటన్నింటినీ సీజన్ ప్రారంభం కావడానికి కొన్నిరోజుల ముందే, అంటే జూన్-జూలై కల్లా, పూర్తయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ఒక కమిటీని వేసి అందులో కనీసం ఇద్దరు అభ్యుదయ రైతులుండేలా చూడాలి. 3.రైతులకు అందించే రుణాలకు ఇప్పుడు అమలవుతున్న నిబంధనలను సడలించి మూడు లక్షల రూపాయల వరకు మంజూరు చేసేలా చూడాలి. రికవరీ విషయంలోనూ తహసీల్దార్, వ్యవసాయాధికారుల సహకారం ఉండాలి. 4.రైతులకు బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో కనీసం 50 శాతం నగదు రూపం లో ఉండాలి. 5.బ్యాంకు సిబ్బంది ప్రతి గ్రామానికి ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం సమాచారా న్ని గ్రామ ప్రజలకు అందించి గ్రామ సభల్లో డాక్యుమెంట్ పనిని పూర్తిచేయాలి. వ్యవసాయాధికారి, తహసీల్దారు అందజేసిన జాబితాపైనే రుణాలను బ్యాంకులు మంజూరుచేయాలి. రైతులను ఆధారా లు, డాక్యుమెంట్లు, రికార్డులు తీసుకురావాలంటూ బ్యాంకు సిబ్బంది ఒత్తిడి చేయరాదు. (వ్యాసకర్త: కరీంనగర్ పార్లమెంటు సభ్యులు)

బి.వినోద్ కుమార్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.