Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సారు ప్లస్ కారు..ఢిల్లీలో సర్కారు!

-16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే ఢిల్లీ గద్దె ఎవరెక్కాలో మనదే నిర్ణయం
-ఎన్నికల్లో తీర్పు ఏకపక్షంగా ఉండాలి
-ఎంపీ అభ్యర్థి ఎవరైనా.. ఓటు కేసీఆర్‌కే
-కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంటే కీలకం
-కరీంనగర్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం గద్దెనెక్కాలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో నిర్ణయమవుతుందని, ప్రధాని ఎవరు కావాలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్‌ఫ్రంట్ నిర్ణయిస్తుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. అభ్యర్థి ఎవరైనా ఓటు కేసీఆర్‌కు వేస్తున్నట్టు భావించాలని విజ్ఞప్తిచేశారు. సారు.. ప్లస్ కారు.. ఢిల్లీలో సర్కారు అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు పార్టీశ్రేణులు ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలన్నారు. బుధవారం కరీంనగర్‌లోని ఎస్సారార్ కాలేజీ మైదానంలో నిర్వహించిన కరీంనగర్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఐదేండ్ల కేసీఆర్ పాలన ఒకవైపు.. 71 ఏండ్లుగా ప్రజలు అవకాశం ఇచ్చినా ఏమీచేయని కాంగ్రెస్, బీజేపీ పరిపాలన మరోవైపు ఉన్నాయన్న కేటీఆర్.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేముందు ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం గద్దెనెక్కాలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో నిర్ణయమవుతుందని, ప్రధాని ఎవరు కావాలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్‌ఫ్రంట్ నిర్ణయిస్తుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. అభ్యర్థి ఎవరైనా ఓటు కేసీఆర్‌కు వేస్తున్నట్టు భావించాలని విజ్ఞప్తిచేశారు. సారు.. ప్లస్ కారు.. ఢిల్లీలో సర్కా రు అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్ నుంచి పోటీచేసే అభ్యర్థిని ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు పార్టీశ్రేణులు ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలన్నారు. బుధవారం కరీంనగర్‌లోని ఎస్సారార్ కాలేజీ మైదానంలో నిర్వహించిన కరీంనగర్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ప్రతి బూత్‌స్థాయిలో 80% పైగా ఓట్లు పోలయ్యేలా చూడటంతోపాటు అందులో 70-80% ఓట్లు కచ్చితంగా టీఆర్‌ఎస్‌కు రావటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

నిర్ణయాత్మక శక్తి మనమే
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 150-160 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి వంద నుంచి 110 సీట్లు మాత్రమే వస్తాయని వివిధ సర్వేల్లో తెలుస్తున్నదని కేటీఆర్ చెప్పారు. ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఎంపీ కీలకం కాబోతున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపిస్తే.. ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చొనాలో మనమే నిర్ణయిస్తామన్నారు. ఎవరు ప్రధాని కావాలో కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్‌ఫ్రంట్ నిర్ణయించబోతున్నదని చెప్పారు. ఈ ఎన్నికలు రాహుల్‌గాంధీకి, నరేంద్రమోదీకి మధ్య జరుగుతున్నాయని, ఇందులో కేసీఆర్ పాత్ర ఏమిటని కొందరు పిచ్చి ప్రేలాపన చేస్తున్నారన్న కేటీఆర్.. రాహుల్, మోదీ.. దొందూదొందే అనే విష యం ప్రజలకు తెలిసిందన్నారు. ఒకాయన రాఫెల్ కుంభకోణం.. మరొకరు బోఫోర్స్ కుంభకోణం అనుకోవడమే తప్ప దేశంలో సామాన్యుడి పరిస్థితి మారిందా? అని ప్రశ్నించారు. ఐదేండ్ల కేసీఆర్ పాలన ఒకవైపు.. 71 ఏండ్లుగా ఏమీచేయని కాంగ్రెస్, బీజేపీ పాలన మరోవైపు ఉన్నాయన్న కేటీఆర్.. మేధోసంపత్తి గల నేతగా తెలంగాణను సంక్షేమ, సాగునీటిరంగంలో కేసీఆర్ ఎలా నడుపుతున్నారో ఆ తరహా పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉండాలన్నారు.

గులాంలు తెలంగాణకు న్యాయం చేయరు
పొరపాటున కాంగ్రెస్ ఒకట్రెండు సీట్లు గెలిస్తే.. రాహు ల్ సిట్ అంటే కూర్చుంటారు.. స్టాండ్ అంటే నిలబడుతారు. పదవులకు, పార్టీ టిక్కెట్లకు, బీ ఫాంలకు ఢిల్లీకి వెళ్లే గులాంలు. వీళ్లు తెలంగాణకు ఏమైనా న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీకి గులాములైన నా యకులు కావాలా? లేక తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేకుండా పేగులు తెగేవరకు కొట్లాడే సత్తా ఉన్న తెలంగాణ గులాబీలు కావాలా? ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నేతల పాత్రేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఆఖరి రోజుల్లో అనివార్య పరిస్థితుల్లో వచ్చి నిలబడ్డారని, పప్పంతా ఉడికినాక ఉప్పేసిన చందంగా తాము కూడా ఉద్యమించామంటున్నారని ఎద్దేవాచేశారు. చేతికి రక్తం అంటించుకుని మేం కూడా అమరవీరుల్లో ఒకరిమని చెప్పుకొనే వారిలో కాంగ్రెస్ నేతలు ముందున్నారని విమర్శించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో 88 సీట్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించి ప్రభుత్వాన్ని నడపమని కేసీఆర్‌ను ప్రజలు ఆశీర్వదించారు. వ్యవసాయం చేసేటప్పుడు ఎద్దు ఓ వైపు, దున్నపోతు ఓ వైపు ఉంటే నాగలి సాగుతుందా? అందుకే లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే.. జోడెద్దుల మాదిరిగా పాలన ముందుకు సాగుతుంది అని చెప్పారు.

అభివృద్ధికి చిరునామా: మంత్రి ఈటల
కరీంనగర్ అంటే పరపతిగల జిల్లా, ఉద్యమాల ఖిల్లా అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇక్కడినుంచి ప్రారంభించే ప్రతి పని టీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్రంతో పోరాడితే తప్ప రాష్ర్టానికి నిధులు వచ్చే అవకాశం లేదని, అందుకే రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలన్నారు.

సంక్షేమంలో నంబర్‌వన్: మంత్రి కొప్పుల
నాలుగున్నరేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించిన ప్రజలు మళ్లీ బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మనం సాధించుకున్న రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయ ని, వాటి పరిష్కారానికి టీఆర్‌ఎస్ పదికాలాలపాటు అధికారంలో ఉండాల్సిన అవసరముందని చెప్పారు.

యువ నాయకత్వం మా సొంతం: హోం మంత్రి
దేశంలోనే టీఆర్‌ఎస్ నంబర్‌వన్ స్థానంలో ఉందని, ఏ పార్టీకి లేనటువంటి యువ నాయకత్వం ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. అత్యం త ప్రజాదరణ పొందిన యువ నాయకుడుగా కేటీఆర్ ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు.

ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది: కేకే
రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ఉద్యమాన్ని వదిలి పెట్టలేదని, ప్రభుత్వంలో ఏ పని చేసినా ఉద్యమ రూపంలోనే చేస్తున్నామని పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు స్పష్టం చేశారు. అదే ఉద్యమస్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో విజయకేతనం ఎగుర వేయాలని పిలుపునిచ్చారు.

లోక్‌సభ ఎన్నికలు కీలకం: ఎంపీ వినోద్‌కుమార్
వచ్చే పార్లమెంట్ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు ముఖ్యమైనవని కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ చెప్పారు. గత ఎన్నికల్లో గెలిచిన 11 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేశారని అన్నారు. ప్రధా ని మోదీ సభలో అడుగుపెట్టిన మొదటిరోజునే ఆంధ్ర లో విలీనంచేసిన ఏడు మండలాలపై టీఆర్‌ఎస్ ఎంపీ లు గర్జించారన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సవరించుకునేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు.

కేటీఆర్‌కు ఘనస్వాగతం
కరీంనగర్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి హాజరైన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దారిపొడవున టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పలుచోట్ల మహిళలు ఎదురేగి మంగళహారతులిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎస్సారార్ కళాశాల మైదానం వరకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. సభ ప్రాంగణానికి చేరుకున్న కేటీఆర్ తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ ఇంచార్జి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, ఒడితెల సతీశ్‌కుమార్, బాల్క సుమన్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, ప లు కార్పొరేషన్ల చైర్మన్లు ఈద శంకర్‌రెడ్డి, అక్బర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 25వేల మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.

కేంద్రానివి ప్రశంసలే.. పైసల్లేవ్!
మన పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తున్నారు తప్ప పైసలు ఇవ్వడం లేదని కేటీఆర్ విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం చిల్లిగవ్వకూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రంలో బడితె ఉన్నవానిదే బర్రె అనేలా పాలన సాగుతున్నదని చెప్తూ కొంద రు కేంద్రమంత్రులు తమ స్వరాష్ర్టాలకు చేసుకున్న పనులను వివరించారు. అదే మన ఎంపీలు 16మంది ఉండి.. ప్రధాని ఎవరు కావాలో నిర్ణయించే శక్తిగా మనం ఉంటే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తన్నుకుంటూ రాదా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నుంచి గెలిచే 16 మంది ఎంపీలకుతోడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన సుమారు వందమంది ఎంపీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకావడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు.

కేసీఆర్‌కు కరీంనగర్ సెంటిమెంట్
కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లాపై అత్యధిక ప్రేమ ఉన్నదని కేటీఆర్ చెప్పారు. 2001 మే 17న తెలంగాణ ప్రజలు సింహాగర్జన చేసిన రోజు దేశం ఉలిక్కిపడి చూసిందంటే అది కరీంనగర్ గొప్పతనమన్నారు. 2004లో యుపీఎ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్.. నాడు తెలంగాణ విషయంలో కాంగ్రె స్ నేతలు అవాకులు చవాకులు పేలితే.. అందుకు నిరసనగా ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు సిద్ధపడ్డారని అన్నారు. ఆసమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చుపెట్టి కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రయత్నించినా.. ప్రజలు రెండు లక్షలపైచిలుకు మెజార్టీతో కేసీఆర్‌ను గెలిపించి.. తెలంగాణవాదాన్ని యావ త్ ప్రపంచానికి చాటారని గుర్తుచేశారు. 2006 ఉప ఎన్నికల సందర్భంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉ ద్యమంలో చేరానని, అనాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నానని తెలిపారు. 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటే అల్గునూర్ చౌరస్తా వద్ద అరెస్టు చేస్తే ఇక్కడి ప్రజలు అండగా నిలిచారని గుర్తుచేశారు. కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా విజయతీరాలకు చేరుతుందన్న గట్టి నమ్మకం కేసీఆర్‌కు ఉందని, ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్థాయి నియోజకవర్గ సమావేశాన్ని కరీంనగర్ నుంచే ప్రారంభించామని పేర్కొన్నారు. ఎంపీ వినోద్‌కుమార్ 18 ఏండ్లుగా కేసీఆర్‌కు కుడిభుజంగా, అత్యంత విశ్వసనీయుడిగా ఉండటమేకాదు.. అన్ని సందర్భాల్లో డిల్లీలో టీఆర్‌ఎస్ గొం తుకై మంచిపేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు.

నిర్ణయాత్మక శక్తి మనమేరాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 150-160 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి వంద నుంచి 110 సీట్లు మాత్రమే వస్తాయని వివిధ సర్వేల్లో తెలుస్తున్నది. ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఎంపీ కీలకం కాబోతున్నారు. -కేటీఆర్

నేడు వరంగల్, భువనగిరిలో..
లోక్‌సభ ఎన్నికలకు టీఆర్‌ఎస్ శ్రేణులను సన్నద్ధులను చేసే క్రమంలో గురువారం వరంగల్ నగరంతోపాటు, భువనగిరిలో సమావేశాలు నిర్వహించనున్నారు. వరంగల్ నగరంలోని ఓ-సిటీ మైదానంలో సభాస్థలిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం సాయంత్రం పరిశీలించి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు ఎంపీ సీట్లను సీఎం కేసీఆర్‌కు బహుమానంగా ఇస్తామని చెప్పారు. సభ ఏర్పాట్లను వరంగల్ (తూర్పు) ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పర్యవేక్షిస్తున్నారు. మాజీడిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్టీ ఉమ్మడి జిల్లా ఇంచార్జి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు సభాస్థలిని పరిశీలించారు.

భువనగిరి సభకు ఏర్పాట్లు పూర్తి
భువనగిరిలోని నీలగిరి థియేటర్ వద్ద మైదానంలో నిర్వహించే లోక్‌సభ సన్నాహకసభకు టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లుచేశారు. సుమారు 20 వేల మంది పార్టీ శ్రేణులనుద్దేశించి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగిస్తారు. మంత్రి జీ జగదీశ్‌రెడ్డి మార్గదర్శనంలో ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గొం గిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, ఎమ్మెల్సీలు కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్‌లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కేసీఆర్ భవన్‌లో కేటీఆర్ బస
కరీంనగర్: సన్నాహక సమావేశానంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ బుధవారం రాత్రి కరీంనగర్‌లోని కేసీఆర్‌భవన్‌లో బస చేశారు. గురువారం ఉదయం వరంగల్ సమావేశానికి హాజరవుతారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.