నూతనంగా ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లతో తెలంగాణ భవన్ లో సమావేశమైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్. హాజరైన మంత్రులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ సిహెచ్ మల్లారెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ గంగుల కమలాకర్ మరియు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు.

ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికిపైగా సంఘాల్లో రైతులు టీఆర్‌ఎస్ మద్దతుదారులను గెలిపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం. రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఇది. రైతు సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదు. సహకార సంఘం ఎన్నికల్లో రైతులు అపూర్వ విజయాన్ని అందించారని అన్నారు.
రైతులెవరూ రుణమాఫీపై ఆందోళన చెందవద్దు: మంత్రి కేటీఆర్ టీఆర్‌ఎస్‌కు ప్రజలు తిరుగులేని విజయాలందిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికిపైగా సంఘాల్లో రైతులు టీఆర్‌ఎస్‌ను గెలిపించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో దాని ప్రభావం కొంత తక్కువగా ఉందన్నారు. నూతనంగా ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లతో కేటీఆర్ తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు.


‘టీఆర్‌ఎస్ రైతుపక్షపాత ప్రభుత్వం. రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఇది. రైతు సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదు. సహకార సంఘం ఎన్నికల్లో రైతులు అపూర్వ విజయాన్ని అందించారు. రుణమాఫీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రైతు రుణమాఫీ జరుగుతుంది. రైతులెవరూ రుణమాఫీపై ఆందోళన చెందవద్దు. సహకార సంఘం ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. డీసీసీబీ ఛైర్మన్ల ఎన్నికల్లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చాం. రైతాంగ సమస్యలపైన ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టాలి. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని’ కేటీఆర్ పిలుపునిచ్చారు.