Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సంక్షేమ రాజ్యం

-ప్రజాప్రయోజనాలే ఆలంబనగా కేసీఆర్ పాలన
-వివిధ పథకాలతో రాష్ట్రంలో కోటిమందికి లబ్ధి
-పేదల ఆర్థికాభివృద్ధికి వినూత్న పథకాలు
-సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజ

ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమరంగానికి పెట్టిన బడ్జెట్ నాలుగువేల కోట్ల రూపాయలు! మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది? ఒకటీరెండూ కాదు.. ఏకంగా ఏడింతలు అదనం! అక్షరాల్లో చెప్పాలంటే ఇరవై ఎనిమిదివేల నాలుగు వందల పన్నెండు కోట్లు!! ఇదీ ఇటీవలి ఓటాన్ అకౌంట్‌లో కేటాయించిన మొత్తం! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వారి జనాభాకు అనుగుణంగా సంక్షేమరంగానికి బడ్జెట్ కేటాయిస్తూ, అన్నివర్గాలకు వాటి ఫలాలు అందిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. రాష్ట్రంలో అమల్లో ఉన్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారులు కోటిమందికిపైగా ఉన్నారంటేనే ప్రజాసంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతున్నది! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల పిల్లల కోసం నాలుగున్నరేండ్లలో 517 కొత్త గురుకుల విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఉపాధి కోసం వినూత్న విధానాలతో సబ్సిడీ రుణాలు అందిస్తున్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమంతో వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నారు. గర్భిణులకు అమలుచేస్తున్న కేసీఆర్ కిట్స్ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,20,000 మంది లబ్ధిపొందారు. ఈ పథకం ప్రారంభించిన దగ్గరనుంచి చూస్తే.. 4,25,000 మందికి ప్రయోజనం కలిగింది. ఇక పింఛన్లతో వృద్ధులకు పెద్దకొడుకుగా, వితంతువులకు అన్నగా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడపిల్లకు మేనమామగా ఆప్యాయకర పిలుపుల నందుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్!

ఉద్యమస్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిపాలిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధిలో వెనుకబడిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేదల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ సర్కారు వినూత్న పథకాలు అమలుచేసింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో అన్నివర్గాల ఆర్థిక, సామాజిక, విద్యాప్రగతిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పలు కార్యక్రమాలను అమలుచేస్తున్నది. భవిష్యత్‌తరాల ప్రగతిని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలుస్తున్నది. ప్రభు త్వం అమలుచేస్తున్న వివిధ పథకాలద్వారా దాదాపు కోటి మందికి లబ్ధి చేకూరుతున్నది. ఫలితంగా ఆయావర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు గౌరవప్రద జీవితాన్ని పొందగలుగుతున్నారు.

స్వయం ఉపాధి పథకాలకు భారీ సబ్సిడీ
పేద యువకులు ఏర్పాటుచేసుకునే స్వయం ఉపాధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయల రుణానికి రూ.30 వేల సబ్సిడీ ఉండగా తెలంగాణ ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో రూ.50వేలు, లక్ష రూపాయల రుణానికి 80%, రూ.2 లక్షలకు 70% సబ్సిడీ ఇస్తున్నది. రూ.3లక్షలు ఆపై మొత్తంలో రుణాలకు 60 శాతంగా ఉన్న సబ్సిడీ రూ.80 వేలకు పెంచింది. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఈ పథకం కింద 2014-15లో 67,442 మంది యువతకు, 2015-16లో 19,821 మందికి, 2016-17లో 49,200 మందికి, 2017-18లో 66,185 మందికి స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలు ఇచ్చారు.

కేజీ టు పీజీ ఉచిత విద్య
మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా విద్యతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్న నినాదంతో కేసీఆర్ ప్రభుత్వం విద్యకు ప్రాము ఖ్యం ఇస్తున్నది. ఇందుకుగాను రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల విద్యాలయాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నది. గురుకుల విద్యాలయాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం, తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా లక్ష రూపాయలకుపైగా ఖర్చు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని క్యాటగిరీలకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలలు 298 ఉండగా.. తెలంగాణ వచ్చాక ఉన్నవాటిలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతోపాటు వాటిని 815కు పెంచారు. మరో మూడేండ్లలో ఈ సం ఖ్యను 1200 వరకు పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది.

పకడ్బందీగా ఫీజు రీయింబర్స్‌మెంట్
ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించక, ప్రైవేటు విద్యాసంస్థలు పెడుతున్న అవస్థలు తట్టుకోలేక మధ్యలో చదువులు మానేసిన ఉదంతాలు ఎన్నో. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం సకాలంలో ఫీజుల చెల్లిస్తుండటం విశేషం. తెలంగాణ ఏర్పడ్డాక నాలుగేండ్లలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.10202.19 కోట్లు చెల్లించింది. దీనిద్వారా 6.50 లక్షలమంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది.

5759 కుటుంబాలకు 14618.91 ఎకరాల భూపంపిణీ
టీఆర్‌ఎస్ నాలుగున్నరేండ్ల పాలనలో గ్రామీణప్రాంతాల్లోని వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.7లక్షల వరకు వెచ్చించి మూడెకరాల వ్యవసాయ భూపంపిణీ పథకాన్ని అమలుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 633.96కోట్లు వెచ్చించి 14618.91 ఎకరాల భూమిని సేకరించి, 5759 కుటుంబాలకు పంపిణీచేసింది. ఏండ్ల తరబడి కూలీలుగా మగ్గిపోతున్న ఎస్సీ కుటుంబాలకు వందశాతం సబ్సిడీతో మూడెకరాల వ్యవసాయ భూమిని అందజేస్తున్న కేసీఆర్ సర్కారు.. పంటల సాగుకోసం కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నది.

సంక్షేమ వసతి గృహాల్లో సన్నబియ్యం
గతంలో హాస్టళ్లలో పరిస్థితులు దయనీయంగా ఉండేవి. కనీసం తిండికూడా లేక పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాస్టళ్లు వదిలి ఇండ్లకు వెళ్లిపోయేవారు. ఈ దుస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం.. హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు పిల్లలకు పోషకాహారం అందాలన్న ఉద్దేశంతో సన్నబియ్యంతో అన్నం పెడుతున్నది. ఫలితంగా హాస్టళ్లలో డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది.

నిరుద్యోగ సంక్షేమం
ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే సర్కారు కొలువులు పెరుగుతాయని నిరుద్యోగులు ఆశించిన ప్రకారమే రాష్ట్ర సర్కారు నిరుద్యోలకు వరాలు అందిస్తున్నది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో అధిక సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలపై దృష్టిసారించింది. 11,234 పోస్టుల భర్తీకి ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో కొన్ని పోస్టులకు ఇదివరకే నోటిఫికేషన్ జారీచేయగా, మిగతావాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియ టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపడుతున్నారు.

బడ్జెట్లో సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం
పేదల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నది. ఆర్థికంగా, సామాజికంగా ఏండ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2019-120 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.28,412 కోట్లు కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ బడ్జెట్ కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏడింతలు అధిక మొత్తం లో బడ్జెట్ కేటాయించడం విశేషం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.