రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్, చౌడారంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలో జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, సతీశ్‌కుమార్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జీవో 59 ద్వారా 160మందికి పట్టాలు పంపిణీ చేశారు.మంత్రి హరీశ్ మాట్లాడుతూ ఇక్కడి పథకాలపై ఇతర రాష్ర్టాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.