Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సంక్షేమ పథకాలు వద్దంటారా?

-ఇలాంటి వారిని ఏం చేయాలో నిర్ణయించండి
-ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన
-ప్రతి గ్రామంలో సమైక్య భవనాన్ని నిర్మిస్తాం
-పట్టణ స్వశక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాలు
-హుజూరాబాద్‌ అభివృద్ధికి జిమ్మెదారి మాది
-ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హామీ
-మహిళాసంఘాలకు 20 కోట్ల రుణాల పంపిణీ
-సీఎం కేసీఆర్‌ సభాస్థలి ఏర్పాట్ల పరిశీలన
-1.2 లక్షల మందితో సభ: మంత్రి కొప్పుల


కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్లు పరిగె ఏరుకున్నట్టు ఉన్నాయంటాడు. రైతుబంధు వద్దంటాడు.. రైతు బీమా మంచిది కాదంటాడు.. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్టు వంటి పథకాలను వ్యతిరేకించాడు.. ఇలాంటి నాయకుడిని ఏం చేయాలో హుజూరాబాద్‌ ప్రజలే నిర్ణయించుకోవాలి. నోట్లో నరం లేని ఇలాంటి నాయకులు ఎన్నో విధాలుగా మాట్లాడుతారు. వాళ్లకు బరువు.. బాధ్యత ఉండదు. ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన.

–మంత్రి హరీశ్‌రావు

ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వద్దంటున్నవారిని ఏం చేయాలో హుజూరాబాద్‌ ఓటర్లు నిర్ణయించుకోవాలని ఆర్థిక మంత్రి తన్నీరు మంత్రి హరీశ్‌రావు సూచించారు. దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు పిండితే రావని, మంచి చేసేవాళ్లు ఎవరో గుర్తించాలని, పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని, ఎండమావులకు మోసపోవద్దని చెప్పారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని మార్కెట్‌యార్డులో గురువారం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌పై విమర్శలు సంధించారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్లు పరిగె ఏరుకున్నట్టు ఉన్నాయన్న ఈటల వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ‘రైతుబంధు వద్దంటాడు, రైతు బీమా మంచిది కాదంటాడు. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్టు వంటి పథకాలను వ్యతిరేకించాడు.. ఇలాంటి నాయకుడిని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోవాలి’ అని చెప్పారు. నోట్లో నరం లేని నాయకులు ఎన్నో విధాలుగా మాట్లాడుతారని, వాళ్లకు బరువు.. బాధ్యత ఉండదని మండిపడ్డారు. ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన అని మంత్రి హరీశ్‌ పునరుద్ఘాటించారు. ఏడేండ్ల కింద తెలంగాణ రాక ముందు మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో, ఇప్పుడు ఎంత బాగా మారిందో గుర్తించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ 11 రోజులు ముద్ద ముట్టకుండా ఉంటే ఢిల్లీ దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రం రాక ముందు హుజూరాబాద్‌ పొలాలకు నీళ్లు రావడం లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసేవారని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసుకున్న తర్వాత రైతులు బుద్ధితీరా నీళ్లు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. రైతుల నుంచి వసూలు చేసే నీటి తీరువాను రద్దు చేసుకుని రైతుబంధు పేరుతో రైతులకే పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు.

ఈటల రాజేందర్‌ చేసిందేమీ లేదు
‘ఈటల రాజేందర్‌ ఇక్కడ ఎన్నో పనులు చేశాడని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆయన ఏమీ చేయలేదని అర్థమైంది’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పక్కనే ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ ఊరూరికి మహిళా సంఘాల భవనాలు నిర్మించారని, కానీ ఇక్కడ ఈటల ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో పనులన్నీ పూర్తిచేస్తామని, ఇక్కడ అభివృద్ధికి జిమ్మెదరారి తమదని చెప్పారు. హుజూరాబాద్‌లో 20 గుంటల స్థలంలో మహిళా సంఘ భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేసుకున్నామని, రూ.కోటి నిధులు ఇచ్చామని తెలిపారు. హుజూరాబాద్‌ మండలంలోని 16 గ్రామాలకు గ్రామైక్య సంఘాల భవనాలు నిర్మించేందుకు రూ.3.10 కోట్లు ఇచ్చామని మంత్రి వెల్లడించారు.

సంక్షేమ పథకాలు వద్దంటారా?
పట్టణ స్వశక్తి సంఘాలకు వడ్డీలేని రుణాలు
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని కొందరు మహిళలు తన దృష్టికి తెచ్చారని, ఇప్పుడు పట్టణ ప్రాంతంలోని మహిళా సంఘాలకు కూడా ఈ అవకాశాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, ప్రతి గ్రామంలో సీసీ ప్లాట్‌ఫాంలు, మినీ గోడౌన్లు నిర్మిస్తామని చెప్పారు. అభయహస్తం పథకంపై ఇటీవలనే రాష్ట్ర క్యాబినెట్‌ తీర్మానించిందని, ఎల్‌ఐసీ వద్ద ఉన్న ఈ పథకం నిధులను వడ్డీతో సహా సంబంధిత మహిళలకు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ పరిష్కరించే బాధ్యత తమదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ సభ్యులు బక్కారెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌషిక్‌ రెడ్డి, డీఆర్‌డీఓ ఎల్‌ శ్రీలతారెడ్డి, మెప్మాపీడీ రవీందర్‌ పాల్గొన్నారు.

1.20 లక్షల మందితో సీఎం సభ
విప్లవాత్మక దళిత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజూరాబాద్‌ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. సభకు 1.20లక్షల మంది హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌తో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. దేశ చరిత్రలోనే గొప్ప పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు.. సభను దిగ్విజయం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. దళితులు హాజరయ్యేందుకు 825 బస్సులు సిద్ధం చేశామని, అలాగే వారికి మంచినీళ్లు, భోజన వసతి కూడా కల్పిస్తున్నామని వివరించారు. ఈ సభలో రెండు వేల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున చెకులు అందజేస్తామని, ఆ మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలోని అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు అందిస్తామని వివరించారు. ఇందుకు సంబంధించి సీఎం రూ.2వేల కోట్లు ప్రకటించారని, రూ.500కోట్ల విడుదల చేశారని గుర్తు చేశారు. ఉద్యోగులకు తప్ప దాదాపు అన్ని కుటుంబాలకు అందిస్తామని చెప్పారు.

ఎన్ని కుట్రలు చేసినా.. దళితబంధు ఆగదు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌
దళితులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్‌ దళితబంధును తెచ్చారని, ఎవరెన్ని కుట్రలు చేసినా పథకం ఆగే సమస్యే లేదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు దళితుల నోటికాడి బువ్వను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గురువారం ఆయన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలోని దళిత కాలనీలో పర్యటించారు. దళితబంధుపై ప్రజలంతా సంతోషిస్తుంటే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ మాత్రమే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులు, బీసీలు, మైనార్టీలను ఊచకోత కోస్తున్న తీరును వివరించారు. అలాంటి పార్టీలో చేరిన ఈటలకు ఇక్కడ స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.