Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సర్వేజనాః సుఖినోభవంతు!

-సంక్షేమపథకాల అమలులో రాష్ట్రం ముందంజ -పేదల ఆర్థికాభివృద్ధికి వినూత్న పథకాలు -చరిత్రను తిరుగరాస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ -ఏటా బడ్జెట్ కేటాయింపుల పెంపు -పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు -సంక్షేమ పథకాలు 400 -లబ్ధిదారుల సంఖ్య కోటి పైనే! -సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజ -పేదల ఆర్థికాభివృద్ధికి వినూత్న పథకాలు -సుమారు 400కుపైగా పథకాలతో సంక్షేమంలో స్వర్ణయుగం -కోటిమందికి లబ్ధి.. బడ్జెట్ కేటాయింపుల్లో ఏటా పెంపు -చరిత్రను తిరుగరాస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రజారంజక పాలనలో గుప్తులకాలం నాటి స్వర్ణయుగం గతం! తెలంగాణ ప్రభుత్వ పాలనలో సంక్షేమంలో స్వర్ణయుగం వర్తమానం! ఉద్యమకాలంలో కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరిగి ప్రజల గోసను కండ్లారా చూసిన నాటి ఉద్యమ నేత కేసీఆర్ మదిలో మెదిలిన పరిష్కారాలే నేటి సంక్షేమ పథకాలు! తల్లి కడుపులో పసిగుడ్డు ఉన్నప్పటి నుంచే సంక్షేమం మొదలై వృద్ధాప్యం వరకు కొనసాగుతున్నది! ఆరోగ్యలక్ష్మి నుంచి పడిన సంక్షేమ అడుగులు కేసీఆర్ కిట్, కేజీ టు పీజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్ బియ్యం, ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్, కల్యాణలక్ష్మి, స్వయం ఉపాధికి రుణాలు, భూ పంపిణీ, రైతుబంధు.. చివరికి ఆసరా పింఛన్‌తో ముగుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారనడంలో అతిశయోక్తి లేదు! 400కు పైగా సంక్షేమ పథకాల్లో దాదాపు 1.04కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.

ఉద్యమకాలంలో పలెపల్లెలో తిరుగుతూ కష్టాలను దగ్గరి నుంచి చూసిన సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం వచ్చాక పేదరికంపై యుద్ధం ప్రకటించారు. 90 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలోని అర్హులైన నిరుపేదలకు అండగా నిలువడమే లక్ష్యంగా అనేక పథకాలకు రూపకల్పన చేశారు. ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వారికి లబ్ధిచేకూరేందకు వార్షికాదాయ పరిమితిని సైతం పెంచారు. దీంతో రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ వర్గాల ప్రజలందరికి సంక్షేమఫలాలు అందుతున్నాయి. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని పొందగలుగుతున్నారు. భవిష్యత్‌తరాల ప్రగతిని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన సంక్షేమపథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం ముందంజలో నిలుస్తున్నది. ప్రభుత్వం అమలుచేస్తున్న సుమారు 400లకుపైగా పథకాలతో దాదాపు కోటి మందికి లబ్ధి చేకూరుతున్నది. ఇక్కడ అమలవుతున్న పథకాలను చూసి మిగతారాష్ర్టాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ బీసీ కమిటీ పంజాబ్‌లో పర్యటించినపుడు, పేద యువతల పెండ్లిళ్లకు రూ.15 వేలు ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర అసెంబ్లీ బీసీ కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణలో రూ.1,00,116 ఇస్తున్న విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

పెద్దన్నగా నిలిచిన కల్యాణలక్ష్మి ఆడపిల్లల పెండ్లి పేదింటి కుటుంబాలకు భారంగా మారిన నేపథ్యంలోఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ కులాల్లోని యువతులకు కల్యాణలక్ష్మి, మైనార్టీలకు షాదీముబారక్ పథకం కింద రూ.1,00,116 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. దీంతో పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం కింద రూ.51 వేలు ఆర్థిక సహాయంగా అందించగా.. 2017లో రూ.75,116కు పెంచారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది రూ..1,00,116కు పెంచారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 3,13,573 మందికి ఆర్థికసాయం అందించారు.

వృద్ధాప్యానికి ఆసరా ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేద వృద్ధులకు నెలకు పింఛను రూ.200 వచ్చేది. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సర్కారు ఆ మొత్తాన్ని రూ.1000కు పెంచింది. దివ్యాంగులకు రూ.1500 పింఛను ఇస్తున్నారు. ఆసరా పింఛను పథకం కింద రాష్ట్రంలో 41,78,291 మందికి లబ్ధి చేకూరుతున్నది. ప్రభుత్వసాయంతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద వృద్ధులు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవిస్తున్నారు. ఆసరా పథకం కింద వృద్ధులతోపాటు చేనేత, బీడీ, గీత కార్మికులు, బోధకాలు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛను అందుతున్నది. ఆసరా పథకం ద్వారా రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి 2017-18 ఆర్థిక సవంత్సరం ముగిసేనాటికి ప్రభుత్వం రూ.16,631.37 కోట్లు ఖర్చుచేసింది.

స్వయం ఉపాధికి భరోసా నిరుపేద యువకులు ఏర్పాటుచేసుకొనే స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తున్నది. ఉమ్మడిరాష్ట్రంలో లక్ష రూపాయల రుణానికి రూ.30 వేల సబ్సిడీ ఉండగా, తెలంగాణ ప్రభుత్వం రూ.80 వేలకు పెంచింది. రెండు లక్షల రుణానికి రూ.1.20 లక్షలు, ఐదు లక్షల రుణానికి రూ.2.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నది. ఈ పథకం కింద రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2014-15లో 67,442 మందికి, 2015-16లో19,821 మందికి , 2016-17లో 49,200 మందికి, 2017 -18లో 66,185 మంది యువకులకు స్వయం ఉపాధి పథకం కింద సబ్సీడి రుణాలు ఇచ్చారు.

ఉచితంగా కేజీ టు పీజీ విద్య విద్యతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ఏనాడో గుర్తించిన సీఎం కేసీఆర్, ఉద్యమకాలంలోనే కేజీ టు పీజీ విద్యావిధానానికి రూపకల్పన చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేజీ టు పీజీ ఉచిత విద్యపై దృష్టి సారించారు. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, జనరల్ గురుకుల విద్యాలయాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. గురుకుల విద్యాలయాల్లో పౌష్ఠికాహారం, వసతుల కల్పనకు ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.లక్షకు పైగా ఖర్చుపెడుతున్నది. ఉమ్మడిరాష్ట్రంలో అన్ని క్యాటగిరీలకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలలు 298 ఉండగా, తెలంగాణ వచ్చాక నాణ్యతా ప్రమాణాలు పెంచడంతోపాటు వాటిని 815కు పెంచింది. మరో మూడేండ్లలో ఈ సంఖ్యను 1,200 వరకు పెంచేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసింది.

ఫీజురీయింబర్స్‌మెంట్‌తో భరోసా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నది. నాలుగేండ్లలో 41,55,000 మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం రూ.6,954 కోట్ల చెల్లింపులు జరిపింది. విద్యార్థుల ఖాతాల్లోకి జమయిన ఫీజు పక్కదారి పట్టకుండా ప్రత్యేకట్రాకింగ్ విధానా న్ని అమలుచేస్తున్నారు. 2016-17 విద్యాసంవత్సరంవరకు పైసా బకాయిలేకుండా ఫీజులు చెల్లించారు.

బీసీ సమాఖ్యల బలోపేతం రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ, ఎంబీసీల ఆర్థిక, సామాజిక ప్రగతిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలవారిని ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఎంబీసీ అభివృద్ధి కార్ప్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా బీసీ సమాఖ్యల బలోపేతం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే ఆయా వృత్తులు చేపట్టే వృత్తులవారీగా ఏర్పాటుచేసిన సమాఖ్యల ద్వారా సబ్సిడీ రుణం అందిస్తున్నది.

సంక్షేమానికి ప్రాధాన్యం సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఆర్థికంగా, సామాజికంగా ఏండ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమాభివృద్ధికి 2018-19 బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. భోజనం ప్రవేశపెట్టాక వసతిగృహాల్లో, పాఠశాలల్లో బడిమానేసే(డ్రాపౌట్) విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతున్నది. లేని దళితులకు మూడెకరాల భూమిని ప్రభుత్వం పంపిణీచేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నది. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు 4,984 మంది దళితులకు 12,853.05 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. దీని కోసం ప్రభుత్వం రూ.551.59 కోట్లు వెచ్చించింది. జర్నలిస్టులు, డ్రైవర్లు, హోంగార్డులకు రూ. 5 లక్షల ప్రమాదబీమా పథకాన్ని అమలుచేస్తున్నది. 14,48,611 మంది జర్నలిస్టులు, డ్రైవర్లు, హోంగార్డులకు బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పోషకాహారం అందించడానికి భారీగా ఖర్చుచేస్తున్నది. దాదాపు 9,46,115 మందికి పోషకాహారం పథకాన్ని అమలుచేస్తున్నది. స్వయంశక్తితో ఎదిగేందుకు 3,93,542 గ్రూపులకు వడ్డీ లేనిరుణాలు అందిస్తున్నది. 4.73 లక్షల మందికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.