Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సవ్యసాచి కేటీఆర్

-ఆపద్ధర్మంలోనూ ఆగని అభివృద్ధి
-రాష్ట్రానికి అనేక అంతర్జాతీయ కంపెనీల రాకఈ నెలరోజుల్లో వచ్చిన కంపెనీలే నిదర్శనం
-పార్టీ నాయకులను సమన్వయ పరుస్తూ..అభివృద్ధికి బాటలు వేస్తూ..
-అందరి మన్ననలు పొందుతున్న యువనేత
-పార్టీలోనూ తనదైన ప్రత్యేక ముద్ర
-ఎన్నికల వేళలోనూ రాష్ర్టాభివృద్ధిని విస్మరించని వైనం

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారు. ఆ పద్ధర్మ ప్రభుత్వం ఉన్నా.. తెలంగాణ అభివృద్ధి ఆగకూడదనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలో అనేక అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి రప్పించారు. భారీ పెట్టుబడులకు ఒప్పించారు. యువత ఉపాధికి మార్గాలను సుగమం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులను తెస్తూనే.. మరోవైపు పార్టీ నాయకులను సమన్వయం చేయడంలో కీలక భూమిక పోషిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుతున్నారు.

సహజంగా ఎన్నికల సమయంలో బిజీగా ఉండే అధికార పార్టీ నాయకులు రాజకీయ ఎత్తుగడల్లో నిమగ్నమై ప్రభుత్వానికి సంబంధించిన పనులను పక్కనపెట్టేయడాన్ని చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి హోదాలో ఆపద్ధర్మ బాధ్యతల నిర్వహణ కోసం కేటీఆర్ శ్రమిస్తున్న తీరు అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. గత నెలరోజుల వ్యవధిలో రాష్ర్టానికి పలు కీలక కంపెనీలు రావడం మంత్రి కేటీఆర్ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడుతున్నారు. ఒకవైపు టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలను సమన్వయం చేస్తూనే మరోవైపు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టించి అభివృద్ధి చక్రం ఆగిపోకుండా చూస్తున్నారు. కేవలం ఐటీ పరిశ్రమకు సంబంధించిన పెట్టుబడులే కాకుండా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల కంపెనీల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చేలా కేటీఆర్ కృషిచేస్తున్నారు. రాష్ట్ర శాసనసభ రద్దయిన నాటినుంచి తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడులే ఇందుకు నిదర్శనం.


నెలరోజుల్లో కేటీఆర్ రాష్ర్టానికి తెచ్చిన భారీ పెట్టుబడుల్లో కొన్ని..

రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ క్వాల్కామ్ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో తమ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు రూ.3 వేలకోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. దీనిద్వారా సుమారు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ తెలిపింది. చైనాకు చెందిన సెల్‌ఫోన్ దిగ్గజం ఒప్పో సైతం దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో తమ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించడంతోపాటు ఈ కేంద్రానికి బాధ్యునిగా తస్లీం ఆరిఫ్‌ను నియమిస్తున్నట్టు వెల్లడించింది. అనంతరం ఆయన మొదటి దశలోనే 500 మంది ఇంజినీర్లకు ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు.

స్టెంట్ల తయారీలో పేరుగాంచిన ఎస్‌ఎంటీ (సహజానంద మెడికల్ టెక్నాలజీస్) ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో రూ.250 కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నట్టు గత మంగళవారం ప్రకటించింది. ఈ పెట్టుబడితో ఆసియాలోనే అతిపెద్దదైన లైఫ్ సేవింగ్ మెడికల్ డివైజెస్ తయారీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటుచేయనున్నది. ఈ విషయమై ఎస్‌ఎంటీ ఎండీ భార్గవ్ కటాడియా నేతృత్వంలోని బృందం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లతో సమావేశమైంది.

రాష్ట్రంలో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించిన మైక్రాన్ టెక్నాలజీస్ సంస్థ.. ప్రత్యక్షంగానే వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపింది.

పరిశోధనల ఆధారిత ఉత్పత్తులపై దృష్టిసారించనున్న జీఈ అప్లయన్సెస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని టీవర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది.

జినోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా సంస్థ జంప్ ఫార్మా ముందుకొచ్చింది. తన ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించింది


అన్నీ తానై..

ఇలా కేటీఆర్ ఒకవైపు రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షిస్తూనే మరోవైపు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గులాబీ దళపతి కేసీఆర్ రికార్డు స్థాయిలో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం విధితమే. అప్పటినుంచి టీఆర్‌ఎస్ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడుపడంలో మంత్రి కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లోని అభ్యర్థులతో ముఖాముఖి సమావేశమై వారి అభిప్రాయాలను పార్టీకి తెలియజేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. పార్టీ నిర్ణయాలను విశ్లేషించి అందరికీ వివరిస్తూ భవిష్యత్‌లో వారికి దక్కే అవకాశాల గురించి భరోసా ఇస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ రథసారథి కేసీఆర్ తన పూర్తి సమయాన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు, ఎన్నికల వ్యూహాలను రచించేందుకు వీలవుతున్నదని పార్టీ నాయకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఈ అభివృద్ధి ఉద్యమం మధ్యలో ఆగొద్దు.. దానికి ప్రజా మద్దతు కావాలి. నేను గెలిస్తే ఇక్కడ ఉండనని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. నేను ఇక్కడే ఉంటా.. ఇక్కడే సచ్చిపోతా అంటున్న పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్‌తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.


అభివృద్ధి ఉద్యమం ఆగదు ఎన్నికల్లో ప్రజల మద్దతు ఎలా ఉన్నది?

నేను ప్రచారానికి గ్రామాల్లోకి వెళ్తున్నపుడు అనూహ్య మద్దతు లభిస్తున్నది. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నిజానికి ఇదంతా మా గొప్పతనం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. సబ్బండ వర్గాల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు రూపొందించి ముందుకు సాగుతున్నారు.


మీరు నియోజకవర్గం అభివృద్ధికి ఏయే పనులు చేశారు?

మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపించడానికి నావంతు సాయం చేశా. మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు జాతీయ రహదారి కోసం రూ.1,808 కోట్లు, మందమర్రి వద్ద గాంధారి వనం ఏర్పాటుకు రూ.3.50 కోట్లు వచ్చేలా కృషి చేశా. బెల్లంపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రం, మ్యాంగో మార్కెట్ ఏర్పాటు, సింగరేణి కార్మికులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని పార్లమెంట్‌లో మాట్లాడిన ఏకైక ఎంపీని నేనే.


మహాకూటమిపై మీ అభిప్రాయం?

కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నాలుగు పార్టీలు కలిసి ద్రోహుల కూటమిగా మారి తెలంగాణ ప్రజలను వంచించాలని చూస్తున్నారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో ఈ పార్టీలు ఎలా జత కడుతాయి. తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు పోలవరం కోసం ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారు. లోయర్ సీలేరు విద్యుత్ ప్లాంట్ గుంజుకున్నారు. ఆ ద్రోహుల కూటమికి ఓటుతో సమాధానం చెప్పేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.


స్థానికత విషయంపై వస్తున్న ఆరోపణలపై స్పందన ఏమిటి?

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు చెన్నూరు నుంచి పోటీ చేస్తున్నా. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మిగతా నేతలు అందరూ నాతో కలిసి పనిచేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటాం. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా. ఇక్కడే చనిపోతా.. నా బొక్కలు ప్రాణహిత, గోదావరిలోనే కలుపాలి. నా మీద ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలే పట్టించుకోని వారి గురించి నేను ఏ మాత్రం పట్టించుకోను.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.