Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సేంద్రియ విప్లవం దిశగా..

-కల్తీలేని ఆహారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
-ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో ఎంపీ కవిత

రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో సేంద్రియ విప్లవం దిశగా అడుగులు వేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కల్తీలేని వ్యవసాయోత్పత్తుల కోసం ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. మహిళారైతులను అభివృద్ధి చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మహిళా, శిశు సంక్షేమశాఖలు సంయుక్తంగా శిల్పారామంలో నిర్వహించిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం హర్షణీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి చర్చించుకుంటున్నారని, విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వినియోగించడంతో ప్రతి వస్తువూ కల్తీమయమై.. ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒబెసిటీ, డయాబెటిస్ బారినపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. జబ్బులను ఆసరాగా చేసుకొని కొత్త కొత్త ఆహార నియంత్రణ పద్ధతులు వచ్చాయన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన సలహాలు ఇస్తున్నారని, ఒకరు ఆకులు తినాలంటే మరొకరు ప్రొటీన్లు తీసుకోవాలని చెప్తున్నారని, వాటన్నింటినీ పాటి స్తూ ప్రజలు మరింత అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సేం ద్రియ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. సేంద్రియసాగుతో వ్యాపార దృక్పథంతో కాకుండా రైతులకు గిట్టుబాటు, వినియోగదారులకు మేలు చేసేలా ఉండాలని చెప్పారు. ఉత్పత్తులకు సేంద్రియ ధ్రువీకరణ ద్వారానే కల్తీలేని ఆహారం పొందవచ్చని అభిప్రాయపడ్డారు. మేళాను ఐదురోజులపాటు విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి, వారి సిబ్బందిని ఎంపీ కవిత అభినందించారు.

అంతకుముందు కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి నందితా మిశ్రా మట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో తొలిసారి నిర్వహించిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆతిథ్యం.. సహకారానికి కేంద్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ మంత్రి మేనకాసంజయ్‌గాంధీ అభినందనలు తెలిపినట్టు చెప్పా రు. రాష్ట్ర మహిళా సాంఘిక సంక్షేమశాఖ బోర్డు చైర్మన్ రాగం సుజాతాయాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా అది ఘనవిజయం సాధిస్తున్నదన్నారు. ఈ మేళాలో 15 రాష్ట్రాల నుంచి మహిళలు తెచ్చిన ఉత్పత్తులు విశేషాదరణ పొందాయని చెప్పా రు. 17 రాష్ర్టాల నుంచి వంద మందికిపైగా మహిళా రైతులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారని తెలిపారు. మేళా సందర్భంగా చిత్రలేఖనం, సాహిత్యం అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం జగదీశ్, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ కామినిసరాఫ్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆర్గనైజర్ సుశీలారెడ్డి, షర్మిలారెడ్డితోపాటు వివిధ జిల్లాల ఆర్గనైజర్లు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.