Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శాసించేది ప్రాంతీయ పార్టీలే

-కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మోరీలో వేసినట్లే
-గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి దేశానికి రోల్‌మోడల్
-దేశంలోనే అత్యధిక మెజార్టీ మెదక్ పార్లమెంట్‌ది కావాలి
-సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గ రోడ్‌షో, బహిరంగ సభల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు

బీజేపీకి ఓటువేస్తే నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే రాహుల్‌గాంధీ గద్దెనెక్కుతారు. ఈ రెండు పార్టీలకు ఓట్లువేస్తే మోరీలో వేసినట్లే.. ఐదేండ్ల నుంచి ఢిల్లీకి వెళ్లి ఎన్ని దరఖాస్తులు పెట్టినా తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలె.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా.. బయ్యారంలో ఉక్కు కర్మగారం, గిరిజనవర్సిటీ అడిగినా ఇవ్వని పార్టీలకు ఓట్లు వేసుడెందుకు అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేటలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం, గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో మండల కార్యకర్తల సమావేశం, జగదేవ్‌పూర్, వర్గల్‌లో రోడ్‌షోలు, బహిరంగసభలు నిర్వహించారు. ఈ సమావేశాలకు ఆయన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, కార్పొరేషన్ల చైర్మన్లు భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఆయా సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఐదేండ్లలో తెలంగాణకు ఒక్క రూపా యి కూడా నరేంద్రమోదీ ఇవ్వలేదు. జాతీయ పార్టీలకు మనం ఓటు వేసుడెందుకు, ఢిల్లీకిపోయి దండాలు పెట్టుడెందుకు, 16ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటే ఢిల్లీవాళ్లే మన కాళ్ల దగ్గరకు వస్తారు. వాళ్లే మనకు దండంపెట్టి రాష్ర్టానికి అవసరమైన నిధులిస్తారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదాను తెచ్చుకోవచ్చన్నారు. దేశంలో జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని.. ప్రాంతీ య పార్టీలే ఢిల్లీని శాసిస్తాయని పేర్కొన్నారు. 60 ఏండ్లలో ఏనాడూ కాంగ్రెస్, బీజేపీలు ప్రజాసంక్షేమం పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తికానున్నాయని తెలిపారు. కరువుతో అల్లాడుతున్న తరుణంలో మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందించడంతో ప్రతి ఇంటా నల్లా తిప్పగానే సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారన్నారు.

గజ్వేల్ నుంచి లక్షా 50 వేల మెజార్టీయే లక్ష్యం
గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి దేశానికే రోల్‌మోడల్. అన్నిరంగాల్లో నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధిచేశారు. రాబోయే కొద్దిరోజుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నారని సిద్దిపేట హరీశ్‌రావు పేర్కొన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి గజ్వేల్ నియోజకవర్గం నుంచి లక్షా 50 వేల మెజార్టీని ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మీ సేవకుడిగా పనిచేస్తా : అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నాకు రెండోసారి పోటీచేసే అవకాశం కల్పించారు. భారీ మెజార్టీతో గెలిపించండి.. ఈ పదిరోజులు కష్టపడి పనిచేస్తే వచ్చే ఐదేండ్లు మీ సేవకునిగా పనిచేస్తానని మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇదివరకే జిల్లాకు రెండు జాతీ య రహదారులు మం జూరుచేయించుకున్నామని.. సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయం, పాసుపోర్టు కేం ద్రం సాధించుకున్నామని గుర్తుచేశారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రైల్వేలైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. ఈ రైల్వేలైన్ భూసేకరణకు రూ. 400 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారని చెప్పారు. తనను దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.