Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శరవేగంగా కాళేశ్వరం

-రెట్టింపు వేగంతో ప్రాజెక్టు నిర్మాణం -గ్రావిటీ కెనాల్, మట్టి పనుల్లోనూ అదే ఉత్సాహం -రోజుకు 25వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు -జాతరను తలపిస్తున్న బారాజ్‌లు, పంప్‌హౌస్‌లు

తెలంగాణకు వరప్రధాయిని కానున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. సీఎం కేసీఆర్ సందర్శన అనంతరం జెట్‌స్పీడ్‌తో సాగుతున్నాయి. అంతకు ముందు మూడు బరాజ్‌లు, మూడు పంప్‌హౌస్‌ల వద్ద రోజు సుమారు 12వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగితే, ఇప్పుడు అది 23వేల క్యూబిక్ మీటర్లకు చేరింది. సీఎం లక్ష్యాలను నిర్ధేశించడం, మంత్రి హరీశ్‌రావు పనులను పరుగెత్తించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం వందశాతం పెరిగింది. మరి కొద్దిరోజుల్లో రోజుకు 25వేల క్యూబిక్ మీటర్లకు పెంచే దిశలో ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు ప్లాన్ చేసి, బాధ్యతలను ఇంజినీర్లకు అప్పగించారు. కన్నెపల్లి-అన్నారం గ్రావిటీ కెనాల్ కోసం నిత్యం 1.74లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు కొనసాగుతున్నాయి.

అంతేకాకుండా నిర్మాణ పనుల్లో మరింత స్పీడ్ పెంచేందుకు సాగునీటి శాఖ ఇంజినీర్లు పక్కా ప్రణాళికతో సాగుతుండగా, ఇంతవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల్లో ఈ ప్రాజెక్టుది ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నది. క్షేత్రస్థాయిలో బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, గ్రావిటీ కెనాల్ పనులను చూసేందుకు ప్రాజెక్టు బాటపడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి రైతుల కాళేశ్వరం పర్యటన జాతరను తలపిస్తుంది. ప్రతీ రోజు రైతులు ఈ ప్రాజెక్టు బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, గ్రావిటీ కెనాల్‌కు వస్తున్నారు. వచ్చే వానాకాలం నుంచి కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ పంప్‌హౌస్‌ల నిర్మాణ పనులను జూన్‌లోపు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించే పనిలో ఇంజినీర్లు తలమునకలయ్యారు.

రైతన్నల సంబురం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను స్వయంగా వీక్షించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు తరలివచ్చి, వచ్చే వానాకాలం తమ నియోజకవర్గానికి సాగు నీరు అందుతుందనే ధీమా వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం ట్రైనీ ఐఏఎస్‌లు ఎనిమిది మంది, రాష్ట్రంలోని ఐఎఫ్‌ఎస్ అధికారులు సందర్శించి పనుల వివరాలు తెలుసుకొని వెళ్లారు. ఇలా ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు నిత్యం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, పంప్‌హౌస్‌లను చూసి ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశంసిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. మూడు బరాజ్‌లు, మూడు పంప్‌హౌస్‌ల వద్ద ప్రతీ రోజు సుమారు 23వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ స్థలాలు జాతరను తలపిస్తుండగా, ప్రముఖుల సందర్శనలతో ప్రాజెక్టు ప్రదేశాలు కళకళలాడుతున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.