Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శతమానం భవతి!

-ధూంధాంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు -రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు -మహంకాళి దేవాలయంలో కవిత ప్రత్యేక పూజలు -పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు -తెనాలిలో ఫ్లెక్సీలతో ఆభిమానం చాటుకున్న ఆంధ్రులు -పోలండ్‌లో ఉత్సవాలు జరిపిన తెలంగాణ ఎన్నారైలు -కేసీఆర్‌కు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ శుభాకాంక్షలు -సీఎంను కలిసేందుకు వచ్చినవారితో కిక్కిరిసిన ప్రగతిభవన్ -నివాస ప్రాంగణంలోని మైసమ్మ ఆలయంలో సీఎం దంపతుల పూజలు

తెలంగాణ పండుగ చేసుకుంది! తెలంగాణలో ప్రతి పల్లెకు పండుగ తెచ్చిన అపూర్వనేత పుట్టిన రోజును తమ ఇంటి శుభకార్యంలా జరుపుకొంది! ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. తమ భవితవ్యాన్ని బంగారుమయం చేస్తున్న జననేత జన్మదినం సందర్భంగా యువత బైకుల ప్రదర్శనలతో ఉత్సాహాన్ని చాటారు! నీళ్లుపారుతున్న చెలకల మధ్య జల నేతకు పాలాభిషేకాలు చేసి.. రైతులు మురిసిపోయారు! కేకులు కట్‌చేసి, పండ్లు పంచి కొందరు.. రక్తదానం చేసి మరికొందరు.. ముఖ్యమంత్రి పేరిట ఆలయాల్లో, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు చేసి ఇంకొందరు.. తోచిన మార్గాల్లో.. తోచిన పద్ధతుల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇటు హైదరాబాద్‌లో స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు అందించేందుకు వచ్చినవారితో ప్రగతిభవన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తరలివచ్చి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేదపండితులు శతమానం భవతి అంటూ దీవెనలందజేశారు! ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పోలండ్ తదితర చోట్ల కూడా కేసీఆర్‌పట్ల అభిమానం పెల్లుబికింది.

టీఆర్‌ఎస్‌తోపాటు అనుబంధ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాజిక సేవా సంఘాలు, పలు సంస్థల ఆధ్వర్యంలోనూ వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా శనివారం ప్రగతిభవన్‌లోని మైసమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ ప్రత్యేక పూజలుచేశారు. ప్రగతిభవన్‌లో పనిచేసే కార్మికులతో సీఎం కేసీఆర్ గ్రూపు ఫొటో దిగారు. కేసీఆర్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకాశ్‌నడ్డా, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, బీహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఏపీ సీఎం చంద్రబాబు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్‌కు ఫోన్ చేసిన రాష్ట్రపతి.. ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడుపాలని ఆకాంక్షించారు. ఇటువంటి మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఆకాంక్షించారు. దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని నరసింహన్ తన సందేశంలో ఆకాంక్షించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో కవిత పూజలుచేశారు. ఏపీ, తమిళనాడుతోపాటు పోలండ్‌లోనూ వేడుకలు నిర్వహించారు.

తెలంగాణ భవన్‌లో.. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్ని ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో ఎంపీ కవితను ఆహ్వానించారు. తెలంగాణ తల్లికి పూల మాల వేసిన అనంతరం కవిత కేక్ కట్‌చేశారు. యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శంభీపూర్‌రాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అకాంక్షను నెరవేర్చిన యోధుడు సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాధించినందుకు ప్రజలందరూ కేసీఆర్‌కు రుణపడి ఉన్నారని అన్నారు. భవిష్యత్‌లో బంగారు తెలంగాణ సాఫల్యం అవుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద విశ్వాసం వ్యక్తంచేశారు. 60 ఏండ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన యోధుడు సీఎం కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు దేవుడిలా భావిస్తున్నారని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.

కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రి తలసాని, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎం శ్రీనివాస్‌రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్యయాదవ్, టాంకాం చైర్మన్ రంగారెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ మసిఉల్లాఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్‌హుస్సేన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్‌సాగర్, నాయినేని రాజేశ్వర్‌రావు, కేసీఆర్ సేవాదళం అధ్యక్షుడు అమీర్ తదితరులు పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన శంకర్‌గౌడ్ తెచ్చిన కేక్‌ను ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టాంకాం చైర్మన్ రంగారెడ్డి కట్‌చేశారు. మాజీ కార్పొరేటర్ చెకోలేకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను మంత్రి పద్మారావు కట్‌చేశారు. నానక్‌రామ్‌గూడలోని చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేసిన కేక్‌ను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కట్‌చేశారు.

జలవిహార్‌లో.. నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను నిజామాబాద్ ఎంపీ కవిత కట్‌చేశారు. మహిళలకు చీరెలు పంపిణీచేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు, చేతి కర్రలు, పేద మహిళలకు కుట్టుమిషన్లు అందించారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, శంభీపూర్ రాజు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఢిల్లీలో… దేశ రాజధాని ఢిల్లీలోని కేసీఆర్ అధికార నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. సీఎం వ్యక్తిగత అదనపు కార్యదర్శి అమరేందర్‌రావు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. చిన్నారి గనిష్క చేతుల మీదుగా కేక్ చేయించారు.

సీఎంకు పలువురి శుభాకాంక్షలు కేసీఆర్‌కు మండలి చైర్మన్, స్పీకర్, మంత్రులు, ఇతర ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) సమావేశంలో పాల్గొనేందుకు బీహార్ రాజధాని పాట్నాకు వెళ్ళిన స్వామిగౌడ్, మధుసూదనాచారి అక్కడి నుంచి వేర్వేరుగా సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ మీడియాకు వీడియో సందేశం పంపించారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నవి కేసీఆర్ ఈ రోజు నిజం చేస్తున్నారన్నారు. స్పీకర్ మధుసూదనాచారి సీఎంకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యంతో మెలగాలని, తెలంగాణ రాష్ట్రానికి మరింత సేవ చేసి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపాలని, ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌కు ఉప ముఖ్యమంత్రి కడియం శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆశించినట్టుగా తెలంగాణ విద్యారంగాన్ని దేశంలో అంతా ప్రశంసించే స్థాయికి తీసుకెళుతామన్నారు.

ముద్దులొలికెడు పద్యాల ముఖ్యమంత్రి.. అవధాన సరస్వతీ పీఠానికి చెందిన మాడుగుల నాగఫణిశర్మ కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముద్దులొలికెడుపద్యాల ముఖ్యమంత్రి.. వర తెలంగాణ వీణకు ప్రథమతంత్రి.. ఆయురారోగ్యమైశ్వర్య మన్ని కలిగి అలరుగావుత విపుల చంద్రార్క మనగ.. అంటూ తేటగితి పద్య రూపంలో సందేశం పంపించారు.

కేసీఆర్ తాతను చూశాడు..!

అనారోగ్యంతో బాధపడుతూ కేసీఆర్‌ను చూడాలని కోరుకున్న 11 ఏండ్ల విఘ్నేశ్ కల నెరవేరింది. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన విఘ్నేశ్ జన్యుసంబంధవ్యాధితో మూడేండ్లుగా ఇంటికే పరిమితమయ్యాడు. సీఎం కేసీఆర్‌ను టీవీలో చూస్తూ ఆయనపై అభిమానం పెంచుకున్నాడు. దీంతో కేసీఆర్ తాతను చూడాలనుకుంటున్నట్లుగా ఇటీవల తల్లిదండ్రులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న సీఎం తన పుట్టిన రోజున విఘ్నేశ్‌ను ప్రగతిభవన్‌కు పిలిపించారు. ప్రగతి భవన్ చేరుకున్న విఘ్నేశ్‌ను కేసీఆర్ అప్యాయంగా పలుకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి బాబులో కొత్త ఉత్సాహాన్ని నింపారు. బాలుడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి అయ్యే వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

కిక్కిరిసిన ప్రగతిభవన్ పరిసరాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ నాయకులు, ప్రముఖులు, అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో బేగంపేట ప్రగతిభవన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, డిప్యూటీ సీఎంలు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటలరాజేందర్,ఇంద్రకరణ్‌రెడ్డి,జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాయిని నర్సింహారెడ్డి,పోచారంశ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చందూలాల్, తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, సమాచార హక్కు ప్రధాన కమిషనర్ రాజాసదారాం, కమిషనర్ బుద్దామురళి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్, అసెంబ్లీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పసునూరి దయాకర్, మల్లారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు వీ శ్రీనివాస్‌గౌడ్, ఆర్ కృష్ణయ్య, వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సలహాదారు అనురాగ్‌శర్మ, సినీనటులు నారాయణమూర్తి, నరేశ్, పరుచూరి వెంకటేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి బొంతు రామ్మోహన్ దంపతులు కేసీఆర్ దంపతులకు నూతన వస్ర్తాలు అందించారు. నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ నేతలు కే శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్, విరాహత్‌అలీ, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళిచారి, ప్రధానకార్యదర్శి విజయ్‌కుమార్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ నేతలు సద్ది వెంకట్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, దండేశ్వర్‌రావు, తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, నేతలు హ న్మంత్‌నాయక్, అలోక్‌కుమార్, అజయ్, నాగరాజు తదితరులు కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మపురి, వేములవాడ ఆలయాల పూజారులు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా ఆశ్వీరదించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు వీరితోపాటు ఉన్నారు.

పేరు పెట్టి.. అభిమానాన్ని చాటి..

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలోని హనుమాండ్ల గడ్డకు చెందిన బోడోళ్ల శిరీష, సాయి దంపతులకు రెండో కాన్పులో శనివారం స్థానిక పీహెచ్‌సీలో బాబు పుట్టాడు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కలిసిరావడంతో ఆ బిడ్డకు చంద్రశేఖర్‌గా నామకరణం చేసి సీఎం కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. – గోపాల్‌పేట

ఆవేశపు విల్లంబతడు హ్యాపీ బర్త్‌డే డాడ్.. అంటూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వీరాధి వీరుడు అతడు.. విజయానికి బావుటా అతడు.. ఆవేశపు విల్లంబతడు.. ఆలోచన శిఖరంబడతడు.. అంటూ చిన్న కవితను కూడా ట్విటర్ పోస్ట్‌చేశారు.

మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం హ్యాపీ బర్త్‌డే డియర్ ఫాదర్ అంటూ ట్వీట్ చేసిన కేసీఆర్ కుమార్తె, ఎంపీ కల్వకుంట్ల కవిత.. మీ కూతురిగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. మీకు అనుచరురాలిగా ఉన్నందుకు గర్విస్తున్నాను అని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.