Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సిద్దిపేటను ఆదర్శంగా మారుస్తా

-అమృత్ పథకంలో పట్టణానికి రూ.100 కోట్లు -రూ.130 కోట్లతో 2 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు -రూ.45 కోట్లతో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులు -ఎన్నికల ప్రచార సభలో మంత్రి హరీశ్‌రావు

Harish-Rao-election-camaign-in-Siddipet

సిద్దిపేట మున్సిపాలిటీలో ఆరు గ్రామాలు విలీనం చేయడం వల్ల అమృత్ పథకం వర్తించింది. ఈ పథకం కింద రూ.100 కోట్లు ఢిల్లీ నుంచి తీసుకొవచ్చా. పాత సిద్దిపేటలో ఎలాగైతే సీసీ రోడ్లు ఉన్నాయో..అదే తరహాలో విలీన గ్రామాలను అభివృద్ధి చేసే జిమ్మేదారి నాది. సిద్దిపేటను అవినీతి రహిత మున్సిపాలిటీగా మలుచుకుందాం. కౌన్సిలర్లు ఒక్క పైసా లంచం తీసుకోకుండా పనిచేయిస్తా. మొదటి కౌన్సిల్ సమావేశానికి నేనే హాజరై కౌన్సిలర్లతో ప్రతిజ్ఞ చేయిస్తా అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధవార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారంతోపాటు భారీర్యాలీలు నిర్వహించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావుకు పెద్దఎత్తున జనం మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. రాత్రి ప్రశాంత్‌నగర్ పోచమ్మగుడి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద రూ.100 కోట్లలో ఈ ఏడాది రూ.20 కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో విలీన గ్రామాల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లులు వేస్తామని, రూ.45 కోట్లతో మిషన్ భగీరథ పథకం పనులు కొనసాగుతున్నాయని, వచ్చే జూన్‌కల్లా విలీన గ్రామాల్లో ఇంటింటికీ ఒక వ్యక్తికి 135 లీటర్ల తాగునీరు సరఫరా చేస్తామన్నారు. ఇప్పటికే దీనికి కావాల్సిన పైపులు వచ్చాయని, పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. రూ.130 కోట్లతో రెండు వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లకు ఇటీవలే శంకుస్థాపన చేశామని, టెండర్ల ప్రక్రియ ముగిసిందన్నారు. కొద్దినెలల్లోనే ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని మంచి మూహుర్తం చూసుకుని లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగిస్తామన్నారు. ఇందులో ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇంకో రెండు వేల ఇండ్లు సీఎం కేసీఆర్‌ను అడిగి తీసుకొస్తానని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పట్టణానికి నలువైపులా మొక్కలు నాటి ఆకుపచ్చ సిద్దిపేటగా మార్చుకున్నామన్నారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టుకుని దోమల రహిత పరిశుభ్రమైన సిద్దిపేటగా తీర్చిదిద్దుకున్నామన్నారు. సిద్దిపేట ప్రభుత్వ దవాఖానను కార్పొరేట్‌ను తలదన్నేలా అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. నేడు ప్రైవేట్ దవాఖానల నుంచి వచ్చి ఇందులో చేరి రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పారు.

సిద్దిపేట టీఆర్‌ఎస్‌కు కంచుకోట సిద్దిపేట నియోజకవర్గం టీఆర్‌ఎస్‌కు కంచుకోట అని, మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో 6 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుచుకున్నామని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. మిగిలిన 28 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సిద్దిపేట ప్రజలు తలెత్తుకునే విధంగా, మరింత గౌరవం పెరిగేలా అభివృద్ధి చేసి తీరుతానని ప్రజల హర్షద్వానాల మధ్యన ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.