Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సింగరేణి ఎన్నికల్లో గెలుపు టీబీజీకేఎస్‌దే..

-కారుణ్య నియామకాలకు కట్టుబడి ఉన్నం -ప్రైవేటీకరణ అనేది జాతీయ సంఘాల తప్పుడు ప్రచారం -ఉద్యోగాలు పెంచేందుకే అండర్ గ్రౌండ్ బావుల తవ్వకం -కోల్ ఇండియా తరహా కేడర్ స్కీం అమలు చేస్తాం -రూ.6 లక్షల రుణాన్ని కార్మికులు హర్షిస్తున్నరు -కార్మికులు ఆత్మగౌరవంతో బతికేలా సంస్కరణలు తెస్తాం -గులాబీ కార్మిక సంఘంతోనే బంగారు భవిష్యత్తు -కార్మిక వాడలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం -కార్మికుల పిల్లల కోసం నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం -యువత ఉపాధి కోసం కంపెనీల ఏర్పాటును పరిశీలిస్తాం -నమస్తే తో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) తిరుగులేని మెజార్టీ సాధించి, తెలంగాణలోని ఆరు జిల్లాలో విస్తరించి ఉన్న 11 డివిజన్లలో విజయం సొంతం చేసుకుంటుందని ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదురు చూస్తున్న వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా చేపడతామని చెప్పిన ఆమె.. కొత్తగా భూగర్భ తవ్వకాల ద్వారా మరిన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా టీబీజీకేఎస్ పనిచేస్తున్నదనీ, ప్రైవేటీకరణ పేరిట జాతీయ సంఘాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మద్దని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. రేపు(అక్టోబర్ 5న) జరిగే ఎన్నికల్లో టీబీజీకేఎస్ గుర్తు బాణంకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు కవిత విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి ప్రాంతంలో పర్యటించిన ఆమె నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంకా ఏమన్నారో ఆమె మాటల్లోనే..

నమస్తే : టీబీజీకేఎస్ హవా ఎలా ఉండబోతున్నది? కవిత : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను మూడు రోజులుగా పాల్గొంటున్నా. వెళ్లిన ప్రతీ చోటా కార్మికులు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. టీబీజీకేఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కార్మికులకు ఉన్న విశ్వాసమే. ఇప్పటికే వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై కార్మికులకు క్లారిటీ ఇచ్చారు. సీఎం మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకునే ప్రసక్తి ఉండదు. తప్పకుండా వారసత్వ ఉద్యోగాల సమస్యను అధిగమించి వచ్చే ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్లలో టీబీజీకేఎస్ విజయఢంకా మోగిస్తుంది. ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తం మెజార్టీ వస్తుంది.

నమస్తే : ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్ పాలనకు రెఫరెండమని ప్రతిపక్షాలు అంటున్నాయి? కవిత : ప్రతిపక్ష పార్టీల మాటలు తాడు బొంగరం లేని మాటలు. ఈ ఎన్నికలను టీఆర్‌ఎస్ పార్టీ రెఫరెండంగా భావించడం లేదు. ఒకవేళ రెఫరెండం అనుకుంటే అది ప్రతిపక్ష పార్టీలకే నష్టం. ఎందుకంటే టీబీజీకేఎస్ విజయం ఖాయం అయిపోయింది. కనుక వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారు.

నమస్తే : జాతీయ సంఘాల పొత్తుపై ఏ మంటారు? కవిత : ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉన్న కార్మిక సంఘాలు ఒక్కటయ్యా యి. 2012లో గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ కార్మికుల తరఫున కొట్లాడి యాజమాన్యాన్ని ఒప్పించి సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇవ్వని హామీలనూ నెరవేర్చింది. కార్మిక లోకమంతా టీబీజీకేఎస్‌కు మద్దతుగా నిలవడంతో, సీఎం కేసీఆర్ ధాటికి తట్టుకొలేక జాతీయ సంఘాలు ఒక్కటయ్యాయి. వారికి కార్మికులు ఓటుతో బుద్ధి చెబుతారు.

నమస్తే : రూ.6 లక్షల రుణంపై ఎలాంటి స్పందన వస్తోంది? కవిత : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు సొంత ఇళ్లు అనేకది కల. ఈ నేపథ్యంలో కార్మిక పక్షపాతిగా ఉన్న కేసీఆర్ కార్మికలోకాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులు రాష్ట్రంలో ఎక్కడ ఇళ్లు నిర్మించుకున్నా రూ.6 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై కార్మికలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.

నమస్తే : వచ్చే నాలుగేళ్లలో కార్మికుల భవిష్యత్ ఎలా ఉండబోతున్నది? కవిత : 2012లో సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్‌కు పట్టం కట్టడంతో ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాం. కార్మికులు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా డ్రెస్‌కోడ్ అమలు చేశాం. గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వా త కోల్ ఇండియా తరహాలో కేడర్ స్కీం అమలు చేసి ప్రతి ఒక్కరికీ పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇంటర్నల్ ప్ర మోషన్లు అమలు చేస్తాం. 180 మస్టర్లు నిండిన కార్మికులను పర్మినెంట్ చేయడంతోపాటు కార్మికులు పనిచేస్తున్న ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. కార్మికులు ఆత్మగౌరవంతో బతికేలా దీర్ఘకాలిక సంస్కరణలు తీసుకువచ్చి బంగారు భవిష్యత్ కల్పిస్తాం.

నమస్తే : కొత్త కొలువుల కోసం ఏ చర్యలు తీసుకుంటారు? కవిత : సింగరేణిలో కొత్త ఉద్యోగాల కల్పన కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ కార్మిక సంఘం కృషి చేసి 1989 తర్వాత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. కొత్త అండర్ గ్రౌండ్ గనులు ఏర్పాటు చేసి సింగరేణి సంస్థలో మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తాం. కొత్తగా 11 అండర్ గ్రౌండ్ గనులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే కాసిపేటలో ప్రారంభించాం. ఆర్‌కే-1 మైన్ మూతపడకుండా రూ.115 కోట్లు కేటాయించి 800ఉద్యోగాలు నిలబెట్టాం. సింగరేణిలో కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాం.

నమస్తే : కార్మికవాడలను ఎలా తీర్చిదిద్దబోతున్నారు? కవిత : సింగరేణిలో గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్‌ను కార్మికులు ఎన్నుకున్న తర్వాత కార్మికవాడల్లో సీఎస్‌ఆర్ నిధులతో సీసీ, తారు రోడ్లు, వీధి దీపాలు, తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇం కా ఏర్పాటు చేస్తాం. కార్మికులు ఇంట్లో ఏసీలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుకగా త్రీఫేస్ కరెంట్ సౌకర్యం కల్పిస్తాం. ఫంక్షన్ హాళ్లను రానున్న రోజుల్లో ఏసీ ఫంక్షన్ హాల్స్‌గా మారుస్తాం. ఇప్పటికే మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఫంక్షన్ హాళ్లను ఏసీగా మార్చాం. వచ్చే నాలుగేళ్లలో కార్మికవాడలను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దమే లక్ష్యంగా టీబీజీకేఎస్ పనిచేస్తుంది.

నమస్తే : సింగరేణికి కావాల్సిన రెడీమేడ్ సామగ్రి సరఫరా చేసేందుకు చిన్న పరిశ్రమలు నెలకొల్పుతారా ? కవిత : స్థానికంగా చదువుకున్న యువత ఉపాధి కోసం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కంపెనీలతో చర్చించి అవసరమైతే కంపెనీల ఏర్పాటు అవకాశాలను తప్పకుండా పరిశీలిస్తాం. సింగరేణికి కావాల్సిన రెడీమేడ్ వస్తువుల సరఫరా కోసం చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువత ఉపాధి పొందడానికి యాజమాన్యం గతంలో దరఖాస్తులు స్వీరించింది. ఎన్నికల తర్వాత త్వరితగతిన చర్యలు తీసుకొని సింగరేణికి కావాల్సిన రెడీమెడ్ వస్తువులు స్థానికంగా తయారు చేసిన వాటినే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.

నమస్తే : వారసత్వంపై జాతీయ సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి? కవిత : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఊడకొట్టిందే జాతీయ కార్మిక సంఘాలు. ఈ విషయం ప్రతి కార్మికుడికీ తెలుసు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ ముందుకు వెళ్తే.. వారసత్వ ఉద్యోగాలపై కోర్టులో కేసులు వేసింది జాతీయ కార్మిక సంఘాలే. వారి అనుచరులతో కోర్టులో కేసులు వేసి వారసత్వ ఉద్యోగాలు అడ్డుకున్నరు. ఈ ఎన్నికల్లో ఉనికి కోల్పోతామని భావించిన జాతీయ సంఘాలు టీబీజీకేఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.ఏదేమైనా వారసత్వ ఉద్యోగాలు 100 శాతం కల్పించి తీరుతం. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రస్తుతం సింగరేణిలో కారుణ్య నియామకాలు ఉన్నప్పటికీ ఏడు వ్యాధులు మాత్రమే ఉండడంతో చాలామంది కార్మికుల పిల్లలు అర్హులు కాలేకపోతున్నారు. సంస్థలో పనిచేసే చాలా మంది కార్మికులకు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న దృష్ట్యా కారుణ్య నియామకాల కోసం వ్యాధుల సంఖ్య పెంచుతాం. ఒకవేళ ఉద్యోగం వద్దనుకుంటే వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ.25 లక్షలు చెల్లిస్తాం. వారసత్వ ఉద్యోగాలపై జాతీయ సంఘాలు టీబీజీకేఎస్‌పై చేస్తున్న తప్పుడు ఆరోపణలు నమ్మవద్దు. వారసత్వ ఉద్యోగాలు కేవలం టీబీజీకేఎస్‌తోనే సాధ్యం.

నమస్తే : సింగరేణిలో ప్రైవేటీకరణపై మీ కామెంట్? కవిత :తెలంగాణకు సింగరేణిని గుండెకాయగా భావిస్తున్న సీఎం కేసీఆర్.. ఆ సంస్థను పటిష్టం చేయాలని నడుం బిగించారు. అందుకే టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంస్థ పురోగతికి చర్యలు తీసుకోవడం, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ కృషి చేస్తున్నది. సింగరేణి సంస్థలో 1989 నుంచి కొత్త ఉద్యోగాల నియామకం లేదు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా జాతీయ సంఘాలు ఉన్న సమయంలో నెలకు కేవలం కారుణ్య నియామకాల ద్వారా 25 ఉద్యోగాలిచ్చేవారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 3,000 మందికి ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసింది. ఇవిగాక 750 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వరంగ సంస్థలో మన ఇంజినీర్లు ఉండడం వల్ల ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని భావించిన కేసీఆర్.. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, నీటి పారుదల శాఖలో కొత్తగా ఇంజినీర్లను నియమించారు. సింగరేణి సంస్థ ప్రగతే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ విశేష కృషి చేస్తున్నది. ఇప్పటివరకు ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సింగరేణిలో ప్రైవేటీకరణ ఇప్పటివరకు లేదు. భవిష్యత్‌లో కూడా అసలే ఉండే పరిస్థితి లేదు.

నమస్తే : సింగరేణి కార్మికుల పిల్లల కోసం స్థానికంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తారా ? కవిత : సింగరేణి ప్రాంతంలో చదువుకు, యువతకు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నది. సింగరేణిలో పని చేస్తున్న కార్మికుల పిల్లలు ఐఐటీ, ఐఐఎంకు అర్హత సాధిస్తే సింగరేణి తరఫున 100 శాతం ఫీజులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. స్థానికులు సింగరేణి సంస్థతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థల్లో ఉద్యోగాలు సాధించడానికి తప్పకుండా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.