Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సింగరేణి కార్మికులకు 28 శాతం వాటా

సింగరేణి లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటాను ప్రకటించారు సీఎం కేసీఆర్. దసరా కానుకగా ఈ శుభవార్తను ప్రకటించడంతో సింగరేణిలో పండుగ వాతావరణం నెలకొంది. కార్మికులంతా సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాల్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు. బొగ్గు గనులపై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకుంటున్నారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ కు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కాలం నుంచి నేటీ వరకు సింగరేణి సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పాటుపడిన ఒకే ఒక్క పార్టీ టీఆర్‌ఎస్‌ అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై కార్మిక లోకం హర్షం ప్రకటిస్తుందని.. ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నరు.

సింగరేణి లాభాల్లో 28 శాతం వాటా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హర్షం వ్యక్తం చేసింది. ప్రతి ఏటా బోనస్ పెంచడం హర్షణీయమని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు తెలిపారు. భారీ బోనస్ ను ప్రకటించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్తులో మరింత కష్టపడి పనిచేసి సింగరేణి సంస్థ ఖ్యాతిని మరింత పెంచుతామన్నారు. సీఎం కేసీఆర్‌ కార్మికుల పక్షపాతి అని కొనియాడారు మంచిర్యాల జిల్లా మందమర్రి టీబీజీకేఎస్‌ నాయకులు, సింగరేణి కార్మికులు. లాభాల వాటాలో కార్మికులకు 28% బోనస్ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్‌ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభీషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి.. స్పీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి కార్మికుల సంబురాలు మిన్నంటాయి. సింగరేణి లాభాల్లో 28 శాతం వాటా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిందుకు సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మికులు ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు టీబీజీకేఎస్ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభీషేకం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి కార్మికుల సంబురాలు అంబరాన్నంటాయి. సింగరేణి కార్మికులకు లాభాల వాటాలో 28% బోనస్ ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌ కు కార్మికులు ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్‌ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభీషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.

సింగరేణి లాభాల్లో 28 శాతం వాటా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై.. సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బన మండలంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభీషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి.. స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. సింగరేణి కార్మికులంతా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటామంటున్నారు. సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని కీర్తిస్తున్నారు. మరోవైపు సింగరేణి కార్మికులకు 28 శాతం లాభాల బోనస్ ను ప్రకటించడంపై సీఎండీ శ్రీధర్ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. లాభాల బోనస్ ను దసరా కానుకగా అక్టోబర్ మొదటివారంలో ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తే మంచి లాభాలతో పాటు మరిన్ని సంక్షేమ చర్యలు చేపడతామని సీఎండీ శ్రీధర్ తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.