Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సింగరేణి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం

సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. సింగరేణి కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సింగరేణి కార్మికుల బాధలు అందరికీ తెలిసిందే అన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిస్తే ఏం చేస్తదో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం. సింగరేణిలోని 11 డివిజన్లలో టీబీజీకేఎస్ తప్పక గెలుస్తుందని ఘంటాపథంగా చెబుతున్నానని సీఎం అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

ఒక్క డిపెండెంట్ ఉద్యోగం కూడా పోనివ్వం తెలంగాణ తనను తాను ఆవిష్కరించుకుంటున్న సమయం ఇది అని సీఎం అన్నారు. ఇలాంటి కీలకమైన సమయంలో చిల్లర మల్లర రాజకీయాల కోసం మభ్యపెట్టే అవసరం తనకు లేదన్నారు. కొంచెం చట్టం మారిస్తే చాలు.. ఒక్క డిపెండెంట్ ఉద్యోగం కూడా పోదు అని స్పష్టం చేశారు. కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను ఇచ్చి తీరుతామని ఉద్ఘాటించారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకున్న వారు రూ. 25 లక్షల ప్యాకేజీ అయినా తీసుకోవచ్చు. లేదంటే నెల వారీ జీతం తీసుకోవచ్చు అని తెలిపారు. లేదా వారసత్వ ఉద్యోగం పొందవచ్చన్నారు. ఒక్క డిపెండెంట్ ఉద్యోగం కూడా పోనివ్వమని సీఎం తేల్చిచెప్పారు.

డిపెండెంట్ ఉద్యోగాల పేరిట కాకుండా కారుణ్య నియామకాల కింద ఇవ్వాలని ప్రతిపాదించామని తెలిపారు సీఎం. సింగరేణిలో 14 వేల నుంచి 19 వేల మంది డూప్లికేట్ కార్మికులున్నారు. ఈ ఉద్యోగాలను ఇప్పించిన పాపం జాతీయ సంఘాలది కాదా? అని ప్రశ్నించారు. డూప్లికేట్ ఉద్యోగాలు చేస్తున్న వారిని సొంత పేరుతో రెగ్యులరైజ్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 1989 తర్వాత సింగరేణిలో కొత్తగా ఉద్యోగాల నియామకం జరగలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 వేల ఉద్యోగాలు కొత్తవి ఇచ్చామన్నారు.

వారసత్వ ఉద్యోగాలపై 17 కేసులు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తే దానిపై కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. వారసత్వ ఉద్యోగాలపై కోర్టు స్టే ఇస్తే జాతీయ సంఘాలు స్వీట్లు పంచుకున్నాయి. ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఠా 17 కేసులు వేసింది. వారసత్వ ఉద్యోగాలపై న్యాయ సలహా తీసుకున్నాం. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు మరో ముఠా ఉందని తెలిపారు. ఊ అంటే కోర్టుకు వెళ్లే ముఠా ఉంది కాబట్టి.. మళ్లీ వారసత్వ ఉద్యోగాలపై లీగల్ ఓపినీయన్ తీసుకున్నాం. కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని సీఎం పునరుద్ఘాటించారు.

బయ్యారం ఉక్కు గనులను సింగరేణికి అప్పగిస్తాం సింగరేణిని ఇతర రంగాల్లో కూడా ముందుండేలా చేస్తామని సీఎం ప్రకటించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం ఫోజులు కొడుతుందని ఆగ్రహించారు. ఈ క్రమంలో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే అంశాన్ని సింగరేణికి కల్పించి.. ఆ గనులను సింగరేణికే అప్పగిస్తామని తెలిపారు సీఎం. కొత్త భూగర్భ గనులను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి నెలా రెండు గంటల పాటు సింగరేణిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం పేర్కొన్నారు.

సింగరేణి కార్మికులకు రూ. 6 లక్షల వడ్డీ లేని రుణం సింగరేణి కార్మికులకు గృహ నిర్మాణం కోసం రూ. 6 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కార్మికులకు వృత్తిపన్ను రద్దు చేస్తామని తెలిపారు. పదవీ విరమణ పొందిన సింగరేణి కార్మికులు పది సంవత్సరాలకు మించి బతకరు. వారి ఆరోగ్య సమస్యలపై ఎవరూ దృష్టి పెట్టలేదు. కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్మికులు ఏ మాత్రం భయపడాల్సిన పని లేదన్నారు. కార్మికుల తల్లిదండ్రులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి చూపించుకునేలా అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రమాదంలో చనిపోయే కార్మికుల కుటుంబాలకు పరిహారం రూ. 25 లక్షలకు పెంచామని గుర్తు చేశారు.

కార్మికులను కాంగ్రెస్, టీడీపీ పట్టించుకోలేదు సింగరేణి కార్మికుల సమస్యలు అర్థం చేసుకోవడంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీబీజీకేఎస్ అనేది ఉద్యమ సమయంలో పుట్టిన కార్మిక సంఘమని తెలిపారు. గతంలో ఈ రాష్ర్టాన్ని కాంగ్రెస్, టీడీపీ పరిపాలించాయని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీలు సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇంతకాలం సింగరేణిలో ఏం జరిగిందో కార్మికులందరికీ బాగా తెలుసు అన్నారు. జాతీయ సంఘాలన్నీ కలిసి డిపెండెంట్ ఉద్యోగాలు పూర్తిగా కోల్పోయేట్లు కలిసి సంతకం పెట్టాయి. వారసత్వ ఉద్యోగాలు వదులుకుంటామంటూ సంతకాలు పెట్టని అనుబంధ సంఘమే లేదు. ఆ సంతకాలు పెట్టే సమయానికి టీబీజీకేఎస్ పుట్టనేలేదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.