Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సిరిసిల్లను మరో తిరుపూర్ చేస్తా

-రాజకీయ జన్మనిచ్చిన మీ రుణం తీర్చుకుంటా
-అపారెల్ పార్కుతో వేలమంది మహిళలకు ఉపాధి
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-సిరిసిల్లలో పలు ప్రారంభోత్సవాలకు హాజరు
-మధ్యమానేరుతో 270 చెరువులకు నీళ్లు
-మూడేండ్లలో జిల్లాకు రైలు రావాలి
-మానేరు నదిపై రైల్ కం రోడ్ బ్రిడ్జి
-అధికారులతో సమీక్షలో కేటీఆర్ ఆదేశాలు
-కన్నతల్లికిచ్చిన గౌరవం మీకిస్తా..
-రాజకీయ జన్మనిచ్చిన మీ రుణం తీర్చుకుంటా
-అపారెల్ పార్కుతో పదివేల మహిళలకు ఉపాధి..
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-సిరిసిల్లలో పలు ప్రారంభోత్సవాలకు హాజరు

రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్లను మరో తిరుపూర్‌లా అభివృద్ధిచేస్తానని సిరిసిల్ల శాసనసభ్యుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. రాజకీయ జన్మనిచ్చి అఖండ మెజార్టీతో గెలిపించిన సిరిసిల్లకు కన్నతల్లికిచ్చిన గౌరవం ఇస్తా. జన్మతః పద్మశాలీయుడినికాకున్నా మీలో ఒకడిగా, మీ సోదరుడిగా వెన్నంటి ఉంటా అని చెప్పారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ వస్ర్తాల ఆర్డర్లతో సిరిసిల్ల నేత కార్మికులకు ఉపశమనం కల్పించామని గుర్తుచేశారు. చేసింది కొంతయితే.. చేయాల్సింది చాలా ఉందని, అందుకు శాయశక్తులా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అపారెల్ పార్కు పనులు వేగవంతంగా సాగుతున్నాయని, త్వరలో ప్రారంభం కానుందని కేటీఆర్ తెలిపారు. దీనిద్వారా పదివేలమంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అభివృద్ధిపనులపై అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పద్మశాలీ సంఘం నిర్వహించిన మార్కండేయ శోభాయాత్రకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బీడీ కార్మికులు, నేతకార్మిక కుటుంబాల మహిళలకు ప్ర త్యామ్నాయ ఉపాధి కోసం అపారెల్ పార్కు ను సిరిసిల్లలో ఏర్పాటుచేసినట్టు తెలిపారు.

ఏకకాలంలో 270 చెరువులు నింపాలి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మధ్యమానేరు జలాలు ఎగువ మానేరుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఏకకాలంలో జిల్లాలోని 270 చెరువులు నిండేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మూడేండ్లలో జిల్లా ప్రజలకు రైలు కూత వినిపించాలన్నారు. సిరిసిల్ల మానేరు నదిపై రైలు కం రోడ్డు బ్రిడ్జి నిర్మించాలని చెప్పారు. రాజమండ్రితోపాటు దేశంలో ఎక్కడెక్కడ రైల్ కం రోడ్డు బ్రిడ్జిలు ఉన్నాయో వాటిని అధ్యయనం చేయాలని అధికారులను కోరారు. జిల్లాకు మంజూరైన రెండు జాతీయ రహదారుల పను ల్లో వేగంపెంచాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్లను అగ్రశేణి జిల్లాగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం రూపొందించాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జేసీ యాస్మిన్ భాషా, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రా వు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సుడిగాలి పర్యటన ..
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సిరిసిల్లలో విస్తృతంగా పర్యటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తంగళ్లపల్లిలో మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్నా రు. అక్కడి నుంచి సిరిసిల్లకు చేరుకొని అక్షయపాత్ర కింద రూ.5లకే భోజన కేంద్రాన్ని ప్రా రంభించి, అధికారులతో కలిసి అక్కడే భోజ నం చేశారు. అనంతరం వైకుంఠధామాన్ని, ఇందిరాపార్కును ప్రారంభించి.. కొత్త బస్టాండ్ ఆధునీకరణ పనులు పరిశీలించారు. శివనగర్‌లోని ఏకలవ్య కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. మినీ ట్యాంక్‌బండ్, కలెక్టరేట్ కాంప్లెక్స్, నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించారు. అక్కడే ఉన్న గుమ్‌షావలి దర్గాను సందర్శించారు. శాంతినగర్‌లో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించి, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. రాత్రి 7 గంటలకు పద్మశాలీ సం ఘం నిర్వహించిన మార్కండేయ శోభాయాత్రలో అందరితో కలిసి అడుగులు వేశారు. నేతన్న చౌరస్తాలోని నేతన్న విగ్రహానికి పూలమాల వేసి ప్రసంగించారు. అక్కడి నుంచి రాత్రి మానేరు ఒడ్డున బతుకమ్మ ఘాట్‌కు చేరుకుని మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను ప్రారంభించారు. రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయన మయ్యారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.