Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సిరిసిల్లలో.. తారకమంత్రం!

యజమానులుగా మారిన కార్మికులు
వస్త్ర పరిశ్రమకు ఇస్తున్న రాయితీలు యజమానులకే లాభం చేకూరుస్తున్నాయని భావించిన ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వర్క్ టు ఓనర్ పథకం కింద కార్మికుడినే యజమానిగా మార్చాలని నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా రూ.250 కోట్లు కేటాయించింది. పెద్దూరు బైపాస్‌రోడ్డులో 20 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తున్నది. ఈ పథకం కింద 1150 మంది కార్మికులకు నాలుగు సాంచాల చొప్పున సబ్సిడీపై ఇవ్వాలని కేటీఆర్ నిర్ణయించారు. అనేక బ్రాండెడ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో సుమారు 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రంలో ఆధునిక గ్రంథాలయం నిర్మాణమవుతున్నది. 300 పడకల దవాఖాన, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాలలు మంజూరు చేయించారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఏరియా హాస్పిటల్‌లో డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంకు, వెంటిలేటర్ సౌకర్యాలు కల్పించారు. ప్రతి గ్రామం నుంచి మండలం, మండలం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లు వేయించారు. జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. గంభీరావుపేట మండలంలో ఫుడ్ పార్కు మంజూరు చేయించారు. ప్రతి మండలంలో మినీ ట్యాంకుబండ్‌లు నిర్మిస్తున్నారు.

సిరిసిల్ల నియోజకవర్గం తారకమంత్రాన్ని జపిస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేతన్నల తలరాతలు మార్చడంతోపాటు జిల్లా కలను సాకారం చేసిన టీఆర్‌ఎస్ వైపే నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సిరిసిల్ల మొదట్లో నేరెళ్ల నియోజకవర్గంలో, తర్వాత వేములవాడ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నేరెళ్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మండలాలను కలిపి సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సిరిసిల్ల జనరల్ స్థానంగా కొనసాగుతున్నది. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కే తారకరామారావు బరిలోకి దిగి 171 ఓట్లతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన మెజార్టీ ఏకంగా 53,004కు పెరిగింది. దీనినిబట్టే కేటీఆర్ పట్ల నియోజకవర్గ ప్రజల్లో ఆదరాభిమానాలు పెరుగుతున్నాయని స్పష్టమైంది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. సిరిసిల్ల ప్రాంతం వందల సంఖ్యలో నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలతో మరుభూమిగా మారింది. సిరిసిల్లను ఉరిసిల్లగా పిలిచే దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వేల కుటుంబాలు ముంబై, బీవండి, షోలాపూర్ వంటి నగరాలకు వలసబాట పట్టాయి.

మారిన తలరాత
2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటం సిరిసిల్ల ప్రజలకు కలిసి వచ్చింది. కేటీఆర్ చేనేత ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టి సిరిసిల్ల రూపురేఖలను మార్చివేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకాలంలో సిరిసిల్ల సందర్శించినపుడు ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ గోడల మీద రాసిన రాతలను చూసి చలించిపోయారు. అప్పులు తీసుకొని మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో కూరుకుపోయిన నేతన్నలను ఆదుకునేందుకు పార్టీ ఫండ్ రూ.50లక్షలు పోగుచేసి పద్మశాలీ సంక్షేమ ట్రస్టుకు అందజేశారు. ఈ నిధి నుంచి ప్రతి నేత కుటుంబానికి వడ్డీలేకుండా రూ.పదివేలు అందించారు. సంక్షోభ మూలాలను అవపోసన పట్టిన కేటీఆర్ ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాలను ఒక్కొక్కటిగా పరిష్కరించారు. ఆత్మహత్యలను నివారించారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా స్కూలు పిల్లల యూనిఫాంలు, క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్లకే ఇచ్చి నేత కార్మికులకు నెలకు రూ.15 నుంచి రూ.20వేలు సంపాదించే విధంగా చర్యలు తీసుకున్నారు.

పరిశ్రమలకు 50 శాతం విద్యుత్, నూలు రాయితీలు ఇచ్చి చేయూత నిచ్చారు. సిరిసిల్లలో ప్రత్యేక నూలు బ్యాంకు ఏర్పాటు చేయించారు. మరమగ్గాలపై తయారైన వస్ర్తాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి యజమానులకు సైతం అండగా నిలిచింది. పాత సాంచాలపై నేస్తున్న మతక వస్ర్తాల స్థానంలో నాణ్యమైన వస్ర్తాలు తయారు చేసేలా, మరమగ్గాలను పూర్తి శాతం సబ్సిడీతో ఆధునీకరించారు. దాదాపు రూ. వెయ్యి కోట్లు వస్త్ర పరిశ్రమకు కేటాయించారు. నేత కుటుంబాలలోని మహిళలంతా బీడీ పరిశ్రమలపై ఆధారపడ్డ వారే. పొగాకుతో ఆరోగ్యం దెబ్బతింటున్నందున వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని కేటీఆర్ సిరిసిల్లకు రూ. 40కోట్లతో అపెరల్ పార్కును మంజూరు చేయించారు. టెక్స్‌టైల్స్ పార్కులోనూ మరమగ్గాల యూనిట్లకు రాయితీలు ఇచ్చారు.

ప్రతిపక్షాలకు నిరాదరణ
ఇక్కడ మహాకూటమి అభ్యర్థిగా కేకే మహేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా నర్సాగౌడ్ బరిలో ఉన్నారు. కానీ ప్రజలు ప్రతిపక్షాలను తిరస్కరిస్తున్నారు. రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం, చేనేతల తలరాతను మార్చిన మంత్రి కేటీఆర్‌కు నియోజకవర్గ ప్రజలంతా మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే పలు కుల సంఘాలు, మైనార్టీలు, ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకొని కేటీఆర్‌కు మద్దతు ప్రకటించాయి. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సబ్బండ వర్గాలు కృషిచేస్తున్నాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తున్నాయి. అభివృద్ధిని చూసి ఓటు వేసి కేటీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు అభ్యర్థిస్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.