రైతుబంధుతో అప్పుల బాధ తప్పిందని ఖమ్మం రూరల్ మండల రైతుబంధు సమితి కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న తెలిపారు. ‘ఇదివరకు కరెంట్ లేక, నీళ్లు రాక చాలా గోసపడ్డం. సాగుకు నీళ్లు పుష్కలం ఉన్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు రంది లేకుంట జేశిండు. నాకు ఏడాదికి రూ.5వేలు బ్యాంకుల పడ్తానయ్. పొలం నాటు వేసేందుకు పైసలు సరిపోతున్నయ్’ అని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటవాసి దూరు శ్రీమతి సంతోషం వ్యక్తం చేశారు.
June 29, 2022
దేశ ఐటీ రంగ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైంది. ప్రపంచ స్టార్టప్ వ్యవస్థల చరిత్రలో ఒక కొత్త పుట ఏర్పడింది. ఈ దేశ యువత భవిష్యత్తుకు బంగారు బాట పరిచేందుకు.. వారి ఆలోచనలను సాకారం చేసేందుకు.. ఆవిష్కరణల కేంద్రం హైదరాబాద్‌లో టీ హబ్ 2.0 అవతరించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా ఈ దేశ యువతకు అంకితమైంది.
హైదరాబాద్‌లో మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేసేందుకు ఉద్దేశించిన సమీకృత మురుగునీటి శుద్ధి మాస్టర్ ప్లాన్ (సీఎస్ఎంపీ)కి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు.
June 24, 2022
దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నెటిజనులు ‘బై బై మోడీ’ హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ట్విటర్లో దేశవ్యాప్తంగా ఈ హాష్‌ట్యాగ్ గురువారం నంబర్ వన్‌గా నిలిచింది. దేశాన్ని పాలించడం లో మోడీ ప్రభుత్వం అన్ని విధాల విఫలమైందని, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యేందుకు కారణం మోడీ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమంటూ నెటిజన్లు ట్వీట్లతో చెలరేగిపోయారు.
June 23, 2022
అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
June 22, 2022
Sorry, no posts matched your criteria.