పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని, ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్‌లో బుధవారం డబ్ల్ బెడ్రూం ఇంటి నిర్మాణాలకు మంత్రులు ఈటల రాజేందర్, పీ మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి ఈటల రాజేందర్ మట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం మొదటి దశలో 3,500 కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వం ఇంటి నిర్మాణాలు చేస్తుందన్నారు.
-ఇదిప్రభుత్వ బాధ్యత
-మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్‌రెడ్డి స్పష్టీకరణ
-ఓల్డ్ అల్వాల్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
2018 కల్లా అన్నిరంగాలకు 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మొదటి దశలో రంగారెడ్డి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 400 వందల ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. చరిత్రలో లేనివిధంగా మహానగరంలో 80 వేల పట్టాలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కొనియాడారు. కార్యక్రమలో సాంసృతిక చైర్మన్ రసమయి బాల్కిషన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు పాల్గొన్నారు.