Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సూర్యాపేట మురిసె సూడు

తుంగతుర్తి గడ్డది దశాబ్దాల నీటిగోస. ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల నిర్మాణం కోసం సాగిన నీటి పోరాటాల గోస చెప్పనలవి కానిది. కేసీఆర్‌ వచ్చేంత వరకు ఏ పాలకుడూ వీరి గోసను పట్టించుకోలేదు. ఎస్సారెస్పీ నుంచి తుంగతుర్తికి 400 కిలోమీటర్ల దూరం. మిగులు వరద జలాలు వస్తే గిస్తే వాటిని తుంగతుర్తి దిక్కు పంపుదామనేది నాటి పాలకుల ఆలోచన. ఈ ఆలోచనలో కూడా ఓ కుట్ర ఉన్నది.

కరోనా కాలపు యాసంగి సీజన్‌లో సూర్యాపేట జిల్లాలో 296 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తద్వారా 63,820 మంది రైతుల నుంచి 3లక్షల 88 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా 588 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొని మిల్లుల్లో రాసులు పోసింది. రైతులు పంటలు పండించుకోవడానికి నీళ్లందించడమే కాదు, పండిన పంటను కొన్న ఘనత కూడా కేసీఆర్‌దే.

కలయో నిజమో వైష్ణవమాయో.. అని అంటాడో కవి. మండుటెండల యాసంగిలో తాము ఊహించనంత వరి పంట చేతికందడం చూసి, తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట జిల్లా రైతులు ఇప్పుడు ‘కలయో నిజమో కేసీఆర్‌ మాయో..’ అని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నరు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉన్నది. అటు గోదావరి, ఇటు కృష్ణా పరీవాహక ప్రాంతాల నడుమ ఉంటదీ ప్రాంతం. నడిగడ్డయిన ఇక్కడి మెట్ట ప్రాంతపు ఎర్రమట్టి నేలలకు, నదీజలాలు అందడం ఓ భగీరథుని కల. ముఖ్యమంత్రి అపర భగీరథుని అవతారమెత్తి కాళేశ్వరం జలాలను ఎదురెక్కించడం ద్వారా ఇక్కడి ప్రజల కల సాకారమైంది.

తుంగతుర్తి గడ్డది దశాబ్దాల నీటిగోస. ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల నిర్మాణం కోసం సాగిన నీటి పోరాటాల గోస చెప్పనలవి కానిది. కేసీఆర్‌ వచ్చేంతవరకు ఏ పాలకుడూ వీరి గోసను పట్టించుకోలేదు. ఎస్సారెస్పీ నుంచి తుంగతుర్తికి 400 కిలోమీటర్ల దూరం. మిగులు వరద జలాలు వస్తే గిస్తే వాటిని తుంగతుర్తి దిక్కు పంపుదామనేది నాటి పాలకుల ఆలోచన. ఈ ఆలోచనలో కూడా ఓ కుట్ర ఉన్నది. అదేందంటే.. మైలారం నుంచి కాకతీయ కెనాల్‌ ఫేజ్‌-2లో భాగంగా ప్రధాన కాల్వను తుంగతుర్తి నియోజకవర్గంలోని ఈటూరు చెరువులో కలపాలనేది వారి ప్లాను. ఈటూరు చెరువు నిండితే, ఆ నీళ్లను తీసుకపోయి మూసీలకు ఒదిలి, ఆ మూసీని నింపి ఆ నీళ్లను పులిచింతలకు చేర్చాలె. అంటే.. ఇటు తెలంగాణల కాల్వలు తవ్వినట్టే ఉండాలె అటు నీళ్లు మల్ల ఆంధ్రా దిక్కే తీస్కపోవాలె.

కాళేశ్వరం ద్వారా లిఫ్టు చేసిన జలాలను, నిరుపయోగంగా ఉన్న కాల్వలను ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రచించారు. ఆ ఆలోచనల కార్యాచరణ ఫలితమే తుంగతుర్తికి కాళేశ్వరం మొట్టమొదటి లిఫ్టు జలాలు. కాళేశ్వరం జలాలు మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ నుంచి నేరుగా తుంగతుర్తి నియోజకవర్గానికి, అటు నుంచి సూర్యాపేటకు చేరినై. భూమి పుట్టినకాంచి సూడలే: ‘ఎహే.. ఎక్కడిది సారు… ఈ యాసంగిల గింత పంట పండుతది అని కలల కూడా అనుకోలె. ఎప్పుడన్నా ఇన్నమా, కన్నమా.. ఇంత పంట ఎప్పుడు సూడలే’ నీళ్లు తెచ్చిన కేసీఆర్‌కే మొక్కాలె. కేసీఆర్‌ నీళ్లే లేకపోతే ఇంత పంట ఎక్కడిది’ ఇది తుంగతుర్తి రైతుల మాట. పంట కొనుగోళ్ల సందర్భంగా ఒక రైతును.. ‘ఊల్లె చెర్వులకు నీళ్లు వచ్చినయా తాతా’ అని అడిగిన. అందుకు సమాధానంగా ‘వచ్చినయి నాయినా, కేసీఆర్‌ నీల్లొచ్చినయి’ అన్నడు.

ప్రభుత్వం కరోనా కాలపు యాసంగి సీజన్‌లో సూర్యాపేట జిల్లాలో 296 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. తద్వారా 63,820 మంది రైతుల నుంచి 3లక్షల 88 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధ్యాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా 588 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొని మిల్లుల్లో రాసులు పోసింది. రైతులు పంటలు పండించుకోవడానికి నీళ్లందించడమే కాదు, పండిన పంటను కొన్న ఘనత కూడా కేసీఆర్‌దే. ఒక పక్క ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా కష్టకాలం, రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నది.అయినప్పటికీ తెలంగాణ రైతు కోసం 30 వేల కోట్లు వెచ్చించింది కేసీఆర్‌ ప్రభుత్వం. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో వరిధాన్యం దిగుబడి ఎన్నడూ యాసంగిలో 3 లక్షల క్వింటాళ్లకు దాటలే. కానీ కాళేశ్వరం నీళ్లతో యాసంగిలో 14 లక్షల కింటాళ్లకు పైగా వరి ధాన్యం పండింది.

ఆరు కోట్లు పెట్టి శాలిగౌరారం మండలంలోని మూసీ ప్రాజెక్టును నింపే కాల్వల మరమ్మతు చేశారు. ఇంకా ఎస్పారెస్పీ కాల్వల మరమతు కోసం 268 కోట్ల రూపాయలకు నివేదికలు సిద్ధం చేసినం. అది పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ‘ఆర్సిప్‌ నహర్‌’ పొడిగింపు సహా అనేక చెరువులు, కుంటలు, కాల్వల మరమ్మతు ద్వారా సాగు భూముల విస్తీర్ణం 1.5 లక్షల ఎకరాలకు పెరుగనుంది. అదే సందర్భంలో అటు కృష్ణా జలాలను సాగుభూములకు మళ్లించే పనులు నడుస్తున్నవి. ఇవన్నీ త్వరలో పూర్తయి తెలంగాణను కోటి కాదు, కోటిన్నర ఎకరాల మాగాణిగా మార్చడం ఖాయం.

(వ్యాసకర్త: తుంగతుర్తి ఎమ్మెల్యే)
గ్యాదరి కిశోర్ కుమార్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.