Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

స్వయంపాలనలో ఎగిసిన పతాక

ప్రతీ సమూహాన్ని ఆదుకుంటూ, వారి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. అందుకే ఇవాళ దేశంలోనే తెలంగాణ కీర్తి పతాక రెపరెపలాడుతున్నది. ఇదంతా కేవలం మూడేండ్ల కాలంలోనే జరిగింది. ఇంకా మున్ముందు సీఎం కేసిఆర్ తీసుకునే నిర్ణయాలతో బంగారు తెలంగాణ సాకారం కావాడం ఖాయం.

తెలంగాణ రాష్ట్రం మూడు వసంతాలను పూర్తిచేసుకొని నాలుగవ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ మూడేళ్ల కాలం తెలంగాణ చరిత్రలో కీలక సమ యం. కొత్త చరిత్రను నిర్మించుకుంటున్న సమ యం. తెలంగాణ వెనుకబాటుతనానికి కారణమైన నీళ్లు, నిధులు, ఉద్యోగాల రంగంలో తెలంగాణ సర్కార్ ముఖ్యమైన మైలురాళ్లను దాటింది. ప్రజల అవస్థలు తీర్చడానికి ప్రభుత్వపరంగా ఎన్నిపనులు చేయవచ్చో, అన్ని ప్రణాళికలు రచించి, ఆచరణలో పెట్టిం ది. అందుకే ఇవాళ తెలంగాణ స్వయంపాలనలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడింది. యావత్‌దేశం తనవైపు చూసేలా తెలంగాణను మలిచి న ఘనత సీఎం కేసీఆర్‌దే. పట్టుదల, అంకితభావం ఆయన సొంతం. ఉద్యమకాలంలో కలిగిన అనుభవాలు, ప్రజలకు మేలు చేయాలనే సం కల్పం తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నాయి.ఏ ప్రభుత్వంలోనైనా పాలక విధానాలే ప్రజల జీవితాలను నిర్ణయిస్తా యి. తెలంగాణ ప్రజల జీవితాలు పరాయిపాలనలో ఎంతగానో నిర్వీర్యమైపోయాయి. పాలకుల శీతకన్ను తెలంగాణ పాలిట శాపంగా మారింది. వ్యవసాయం కుంటుపడింది. రైతులు కూలీలుగా, కూలీలు బిచ్చగాళ్లుగా మారారు. ఈ దుస్థితిని మార్చడానికి నడుం కట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఉద్యమకాలంలో వారి కన్నీటిని తూడ్చి, స్వయం పాలనలోనే బతుకులు మారుతాయన్న సోయిని అందించి, త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించుకున్నం. తెలంగాణ కోసం స్వయంగా ఉద్యమ సారథే తన ప్రాణాలను పణంగా నిలిపాడు. ఫలితంగా అరవై ఏండ్ల కల సాకారమైంది. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధి, వికాసాల కోసం సర్కా ర్ భారీ కసరత్తు చేసింది. ప్రజల బాధలను రూపుమాపి, వారి జీవితాల ను తేజోమయం చేయడానికి ఒక్కోపని ఎంచుకొని పనిచేస్తున్నది.

అందువల్లనే తెలంగాణ తలెత్తుకొని నిలుచున్నది. తెలంగాణను బాగుపరుచుకోవడానికి నీటి వనరులను పునరుద్ధరించుకోవాలి. ఈ ఉద్దేశంతోనే మిషన్ కాకతీయ పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీంతో పడావుపడ్డ చెరువులు ఇవాళ మత్తడి దుంకుతున్నాయి. పల్లెకు ఇరుసులా ఉన్న చెరువులు మళ్లీ జీవం పోసుకున్నాయి. చెరువు మీద ఆధారపడిన వృత్తులకు జీవనా ధారం ఏర్పడింది. చెరువు నవ్వితే, పల్లె మురిసిపోతున్నది. ఇక ఏనాటి నుంచో ఉన్న తాగునీటి కష్టాలు రూపుమాపేందుకు మిషన్ భగీరథను ప్రవేశపెట్టి, ఇంటింటికి తాగునీరు అందిస్తూ ప్రజల దాహార్తిని తీర్చింది.దేశానికైనా, రాష్ర్టానికైనా అన్నం పెట్టేది వ్యవసాయమే. తెలంగాణ సర్కార్ వ్యవసాయరంగాన్ని కీలకంగా భావిస్తున్నది. ఎన్నికల సమయం లో ఇచ్చిన హమీని నిలబెట్టుకుంటూ అక్షరాల 16,374 కోట్ల రుణమాఫీ చేసింది. తద్వారా 35 లక్షలమంది రైతులను ఆదుకున్నది. అలాగే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఎరువుల పంపిణీ ద్వారా 25 లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. కరెంటు సప్లయి విషయంలో తెలంగాణ సర్కార్ ఇప్పటికే తన సత్తా చాటింది. ప్రస్తుతం వ్యవసాయానికి 9 గంటల పాటు ఇస్తున్న కరెంటును 2018 నాటికి 24 గంటలు విద్యుత్తు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ పడావుపడ్డ భూములు మళ్లీ పచ్చచీర కట్టుకుంటున్నయి.

సామాన్యుని బతుకునకు భరోసా ఇచ్చేవి సంక్షేమ పథకాలే. తెలంగాణ సర్కార్ సంక్షేమ పథాకాలకు పెద్దపీట వేసింది. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం కోటా పెంపుదల నుంచి డబుల్ బెడ్‌రూం ఇండ్ల దాకా ప్రభు త్వం సామాన్యుల పక్షమే నిలిచింది. హాస్టల్ పిల్లలకు సన్నబియ్యంతో భోజనాలు పెట్టడమే కాదు, వారికోసం కొత్త గురుకులాలు ఏర్పాటు చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో గురుకులాల్లో బోధనా సిబ్బందిని భర్తీ చేయడం వంటి చారిత్రక నిర్ణయాలకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే తప్పకుండా విద్యతోనే సాధ్యమవుతుంది. అందువల్లనే తెలంగాణ సర్కార్ విద్యారంగానికి సిం హభాగం నిధులు కేటాయిస్తున్నది. నాణ్యమైన విద్య అందించడం కోసం పాటు పడుతున్నది. మారిన కాలానికి అనుగుణంగా టెక్నాలజీ, నాలెడ్జ్ బేస్‌డ్ విద్యా వ్యవస్థను రూపొందించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందుకు సాక్ష్యంగానే ఇవాళ పాఠశాల, జూనియర్ కళాశాల స్థాయి ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. ఇక ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ సర్కార్ కృషి చేస్తున్నది. వేలాది ఖాళీలను భర్తీ చేయడం కోసం పరిశ్రమిస్తున్నది. ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. తద్వారా పేరుకుపోయిన నిరుద్యోగాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తున్నది.వ్యవసాయం తర్వాత చేతివృత్తులే వెన్నెముక అన్నమాటను తెలంగాణ సర్కార్ నిజంచేసి చూపిస్తున్నది. గ్రామీణ జనాభాలో వృత్తుల మీద ఆధారపడ్డ కులాల జనాభాదే అతిపెద్ద సమూహం. వ్యవసాయం తర్వాత పట్టించుకోవాల్సింది వృత్తికులాలనే. ఈ నేపథ్యంలోంచే తెలంగాణ సర్కా ర్ బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వేలకోట్ల రూపాయలను వారి సమగ్రాభివృద్ధి కోసం కేటాయించింది. ప్రతీ వృత్తి కులం అభివృద్ధి చెందాల నే తపనతో తెలంగాణ సర్కార్ అనేక కీలకమైన నిర్ణయాలకు సిద్ధమైంది. సుమారు వెయ్యికోట్ల రూపాయలను కేటాయిం చి వారి సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నది. చేపల పెంపకం, గొర్ల మేకల పెంపకం, కల్లు గీత, చేనేత, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి వంటి కులాలకు పెద్దమొత్తంలో చేయూతనందించి ఆదుకోవడానికి తెలంగాణ సర్కార్ శ్రమిస్తున్నది.

దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ తగిన శ్రద్ధ చూపిస్తున్నది. అంకితభావంతో పాటుపడుతున్నది. తెలంగాణ జనాభాలో ముస్లిం సమూహ ప్రాతినిధ్యం కీలకమైంది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితుల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారనే విషయా న్ని గమనించింది తెలంగాణ సర్కార్. అందుకే వారి బాగుకోసం రిజర్వేషన్లను పెంచడానికి పూనుకున్నది. గతంలో ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ను 12 శాతం పెంచుతూ ప్రకటనచేసిన ఘనత కూడా తెలంగాణ సర్కార్‌దే. అలాగే దళితుల అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ను సంపూర్ణంగా ఖర్చుచేసేందుకు సిద్ధపడింది. మున్సిపాలిటీ, ఆశా వర్క ర్ల జీతాలను గణనీయంగా పెంచింది. కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. ఇలా ప్రతీ సమూహాన్ని ఆదుకుంటూ, వారి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందుకే ఇవాళ దేశంలోనే తెలంగాణ కీర్తి పతాక రెపరెపలాడుతున్నది. ఇదంతా కేవలం మూడేండ్ల కాలంలోనే జరిగింది. ఇంకా మున్ముందు సీఎం కేసిఆర్ తీసుకునే నిర్ణయాలతో బంగారు తెలంగాణ సాకారం కావాడం ఖాయం. -(వ్యాసకర్త: మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.