Tag Archives: KCR

కయ్యాలమారి ఏపీ..

‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాం. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ర్టాలు అయినందున స్నేహంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం.


ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడు, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.


సాగు నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం

రాష్ట్రంలో నీటిపారుదలశాఖను ఇకపై జలవనరులశాఖ (వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌) గా మారుస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ గొప్ప వ్యవసాయరాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యం, బాధ్యత పెరుగుతున్నదన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటిపారుదలశాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరుగాలని సీఎం చెప్పారు.


భయం వద్దు.. నిర్లక్ష్యం వద్దు

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ అన్నారు. కరోనా వైరస్ సోకినవారు అధికవ్యయం చేస్తూ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్యసిబ్బంది సంసిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.


ఇక.. విద్యావ్యవస్థ ప్రక్షాళన

రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని వెల్లడించారు. ఇందుకోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.


డాక్టర్లు భేష్‌

రాష్ట్రంలో కొవిడ్‌-19ను నియంత్రించడానికి వైద్య సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గారితో పాటు కిందిస్థాయి వరకు ప్రాణాలకు తెగించి గొప్పసేవ చేస్తున్నారన్నారు.


గోదావరి వినియోగం 530 టీఎంసీలు

అత్తెసరు ఆయకట్టుకే నీరందించే నిర్లిప్తత నుంచి ఆరేండ్లలో గోదావరి బేసిన్‌ ఆకుపచ్చ మాగాణంలా మారింది. 2014లో వంద టీఎంసీల జలా ల వినియోగానికే పరిమితం కాగా, ఈ ఏడాది ఏకంగా 530 టీఎంసీలను వాడుకొనేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది.


రైతురాజ్యం రావాలి

ప్రతి గ్రామంలో గ్రామ రైతుసంఘం ఏర్పాటు.. వీటి సమాహారంగా మండల, జిల్లా, రాష్ట్ర రైతుసంఘాలు వచ్చే బడ్జెట్‌లో రూ.500 కోట్లతో సీడ్‌మనీ స్కీం..


నేతన్న రాత మారుస్తాం

చేనేత కార్మికులకు కనీసం రూ.15వేల వేతనం అందేలా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.


ప్రజలు ఇబ్బందులు పడొద్దు

నగదు రహిత లావాదేవీలను పెంచడానికి, ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.


దూకుడు మంత్రం!

2.1/2 సంవత్సరాలు బంగారు బాటలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర ఏండ్లు. దశాబ్దాల పీడన నుంచి విముక్తమై ఇంటి పార్టీ …