Tag Archives: Telangana

Hyderabad – The Rising Global City

A report on 6 years of Progressive Governance.


కయ్యాలమారి ఏపీ..

‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాం. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ర్టాలు అయినందున స్నేహంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం.


సర్కారు దవాఖానల్లో విలువైన వైద్యం ఉచితంగా

ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్స కోసం ఖరీదైన మందులను వినియోగిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ మందులు కార్పొరేట్‌ హాస్పిటళ్లలో సైతం అందుబాటులో లేవని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లు లేవని ప్రైవేటు దవాఖానలు చేతులెత్తేస్తున్నాయని, అయితే తాము ఆ మందులను సమకూర్చుకొని అవసరమైన ప్రతి రోగికి విలువైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.


ఒక్కచుక్కనూ వదులుకోం

జల వివాదాల పరిష్కారంలో కేంద్రం నిష్క్రియాపరత్వం దుర్మార్గం. ఈ వైఖరిని ఇకనైనా విడనాడాలి. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ర్టాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఇరు రాష్ర్టాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలి. నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదు.


సాగు నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం

రాష్ట్రంలో నీటిపారుదలశాఖను ఇకపై జలవనరులశాఖ (వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌) గా మారుస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ గొప్ప వ్యవసాయరాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యం, బాధ్యత పెరుగుతున్నదన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటిపారుదలశాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరుగాలని సీఎం చెప్పారు.


భయం వద్దు.. నిర్లక్ష్యం వద్దు

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ అన్నారు. కరోనా వైరస్ సోకినవారు అధికవ్యయం చేస్తూ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్యసిబ్బంది సంసిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.


ప్రతి రైతుకూ.. సాగునీరు

ఇప్పటివరకు తెలంగాణ సాగునీటికి గోస పడ్డదని, స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక సాగునీటిరంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. కాళేశ్వరంతోపాటు, పలు ప్రాజెక్టుల నిర్మాణంతో పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడిందని, వాటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతిరైతుకూ సాగునీరందాలని చెప్పారు.


మక్క..వోని రైతు దీక్ష

తెలంగాణ వ్యవసాయరంగం దేశంలోనే ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నది. తెలంగాణ రైతులు యావత్‌ దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలువబోతున్నారు. నిన్నమొన్నటిదాకా ఎవరికి వారన్నట్టుగా అసంఘటితంగా ఉన్న తెలంగాణ రైతులోకం ప్రభుత్వం ఇచ్చిన ఒకే ఒక్క పిలుపునకు స్పందించి సంఘటితమయ్యారు.


గోదావరి వినియోగం 530 టీఎంసీలు

అత్తెసరు ఆయకట్టుకే నీరందించే నిర్లిప్తత నుంచి ఆరేండ్లలో గోదావరి బేసిన్‌ ఆకుపచ్చ మాగాణంలా మారింది. 2014లో వంద టీఎంసీల జలా ల వినియోగానికే పరిమితం కాగా, ఈ ఏడాది ఏకంగా 530 టీఎంసీలను వాడుకొనేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది.


వాడవాడలా సభ్యత్వాలు

పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి సబ్బండ వర్ణాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నాయి.