Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీబీజీకేఎస్.. కార్మిక పక్షపాతి

-వారసత్వ ఉద్యోగాలు మీరెలా సాధిస్తారు?.. -చెప్తే నా ఓటూ మీకే.. ఏఐటీయూసీకి సవాల్ -దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి.. బాణం గుర్తు మన ప్రాణం -టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత -టీఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ సంఘాల నుంచి టీబీజీకేఎస్‌లోకి భారీగా చేరికలు

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని పార్టీకి అనుబంధంగా ఉన్న ఏఐటీయూసీ సంఘం సింగరేణిలో ఏ విధంగా వారసత్వ ఉద్యోగాలను సాధిస్తుందో చెప్పాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నేతలు సంతృప్తికరంగా జవాబు చెప్తే తాను కూడా ఆ సంఘానికే ఓటు వేస్తానని ఆమె ప్రకటించారు. టీబీజీకేఎస్ కార్మిక పక్షపాతి అని ఆమె స్పష్టం చేశారు. గత మూడేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ప్రకటించిన వరాలే ఇందుకు తార్కాణమని ఆమె అన్నారు. ఆదివారం తెలంగాణభవన్‌లో హెచ్‌ఎంఎస్, టీఎన్‌టీయూసీ, సీఐటీయూ నాయకులు భారీ సంఖ్యలో కవిత సమక్షంలో టీబీజీకేఎస్‌లో చేరారు. హిందుస్తాన్ మజ్దూర్ సంఘ్ (హెచ్‌ఎంఎస్) బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు సముద్రాల వేణుగోపాలాచారి నాయకత్వంలో వచ్చినవారికి కవిత టీబీజీకేఎస్ కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. వారసత్వ ఉద్యోగాలపై బొగ్గుగని కార్మికుల్లో గందరగోళం సృష్టించాలని ఏఐటీయూసీ ప్రయత్నిస్తున్నదని, దీనిని తిప్పికొట్టాలని కార్మికులకు కవిత పిలుపునిచ్చారు. బాణం గుర్తు మన ప్రాణమని ఆమె అన్నారు. పద్ధెనిమిదేండ్ల క్రితం డిపెండెంట్ ఉద్యోగాల విధానాన్ని తొలిగించడానికి ఒప్పందంపై సంతకాలు చేసిన సంఘమే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వారసత్వ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానంచేసి అమలు చేయడానికి సిద్ధమైతే కొందరు కోర్టుకు వెళ్లి నిలిపివేయించారని, దీని పరిష్కారానికి అందుబాటులో ఉన్న అన్నిరకాల అవకాశాలను అన్వేషిస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే సీఎం కేసీఆర్‌తోనే వారసత్వ ఉద్యోగాలు సాధ్యమవుతాయని ఆమె అన్నారు.

వారసత్వ ఉద్యోగాల కోసం సమ్మెచేసిన జాతీయ సంఘాల నేతలు విఫలమయ్యారని, సమ్మె సమయంలో వారసత్వ ఉద్యోగాలు సాధించేవరకు వెనుకకు తగ్గబోమని చెప్పిన నేతలు ఏదీ సాధించకుండానే మధ్యలోనే సమ్మె విరమించారని కవిత విమర్శించారు. నిమిషానికో మాట మాట్లాడే వారితో కార్మికుల సమస్యలు ఏవిధంగా పరిష్కారం అవుతాయని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్‌ను బలపర్చడం ద్వారా కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవడమే కాకుండా సింగరేణిని కాపాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. గడిచిన మూడేండ్లలో సింగరేణిలో 5600ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని ఆమె అన్నారు. వీఆర్‌ఎస్ తీసుకున్న వారికి 3100మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. గుర్తింపు సంఘ ఎన్నికల్లో టీబీజీకేఎస్‌కు మద్దతు తెలుపడానికి పెద్దఎత్తున కార్మికులు ముందుకొస్తున్నారని.. వారి ఉత్సాహం చూస్తుంటే గెలుపు ఎవరిదన్నది తేలిపోయిందన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించే విధంగా వైద్య సదుపాయ విధానంలో మార్పులు, చేర్పులు చేయిస్తామని ఆమె ప్రకటించారు. కార్మికులకు సొంతింటి కలను నేరవేర్చడానికి సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారని అన్నారు. కేసీఆర్ కార్మిక పక్షపాతి అని ఆమె తెలిపారు. గని ప్రమాదంలో చనిపోతే రూ.20లక్షలకు ఎక్స్‌గ్రేషియాను పెంచామని తెలిపారు. సింగరేణి కార్మికులందరూ పార్టీలు, సంఘాలకు అతీతంగా అలోచించి టీబీజీకేఎస్‌కు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. సింగరేణి కార్మికులను సైనికులుగా సీఎం కేసీఆర్ చూశారని వారి సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు.

హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ కార్మికులకు 23శాతం లాభాల్లో వాటాను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. దసరా అడ్వాన్స్‌ను పెంచారని తెలిపారు. దసరా కానుకగా సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల విజయాన్ని సీఎం కేసీఆర్‌కు అందించాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమ కోసమే హెచ్‌ఎంఎస్ సంఘనాయకులందరు టీబీజీకేఎస్‌లో చేరారని తెలిపారు. గుర్తింపు సంఘంగా టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ నాడు తెలంగాణ సాధనలో బొగ్గుగని కార్మికులు కీలక పాత్ర పోషించారని, వారి ఉద్యమాన్ని, త్యాగాలను కేసీఆర్ ఎప్పుడు గుర్తు చేస్తుంటారని అన్నారు. టీబీజీకేఎస్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. వారసత్వ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులను కేసీఆర్ తొలగిస్తారని అన్నారు.

టీబీజీకేఎస్‌లో చేరిన నాయకులు.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరిన వివిధ సంఘాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు.. ఉపేందర్, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవ వెంకటేశం, హెచ్‌ఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా కనకయ్య , ఆర్జీ-1 ఏరియా అధ్యక్షుడు సీహెచ్ నారాయణ రెడ్డి, సింగరేణి హెచ్‌ఎంఎస్ ఉపాధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు అప్పాల రాజమౌళి, హెచ్‌ఎంఎస్ ఆర్జీ-2 కార్యదర్శి మర్రి ఐలయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి ధనంజయులు, ఆర్జీ-2 ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.ప్రవీణ్ కుమార్, హెచ్‌ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి ఎ.శ్రీనివాస్, హెచ్‌ఎంఎస్ ఆర్జీ-2 కోశాధికారి ఎనగందుల శ్రీనివాస్ , రవీందర్ రెడ్డి, హెచ్‌ఎంఎస్ ఆర్జీ-3 నాయకుడు కొల కనకయ్య, హెచ్‌ఎంఎస్ ఆర్జీ-2 నేత శ్రీనివాసాచారి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎ.వెంకటరమణ, అసిస్టెంట్ సూపరింటెండెంట్(శ్రీరాంపూర్) కే సత్యనారాయణ, జీఎం ఆపరేషన్స్ కొత్తగూడెం సీహెచ్ రాజనర్సింహరెడ్డి, ఆర్జీ-2 ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మక వెంకటేశ్వర్లు, హెచ్‌ఎంఎస్ ఆర్జీ-2 ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, బెల్లంపల్లికి చెందిన ఏఐటీయూసీ నాయకులు శంకర్ ప్రసాద్ చేరారు. టీఎన్‌టీయూసీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బైరం శంకర్, నగునూరి రాజయ్య, సిరిపురం మాణిక్యం, పెద్దపల్లి శంకర్, సంగెంరాజు, కోడిపల్లి రాజయ్య, డేవిడ్, అరికెళ్ల బాబు, చలిగంటి రాములు, అన్నెల లచ్చిరెడ్డి, లంకరత్నం, సబ్బు మల్లయ్య, దాట్ల శ్రీనివాస్, ఆకుల గిరిబాబు తదితరులు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.