Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ డయాగ్నస్టిక్స్

-దేశంలో తొలిసారిగా ఉచిత వైద్యపరీక్షలు
-పేదలపై ఆర్థికభారం తగ్గించేందుకే ఈ నిర్ణయం
-వైద్యారోగ్యశాఖలో వినూత్న, విప్లవాత్మక మార్పులు
-సర్కార్ వైద్యం మీద ప్రజల్లో విశ్వాసం పెరిగింది
-కేసీఆర్ కిట్స్‌తో సర్కార్ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు
-తెలంగాణ డయాగ్నస్టిక్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీ కేటీఆర్
-రాష్ట్ర వైద్యారోగ్యశాఖ చరిత్రలో ఇదొక మైలురాయి
-వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ శ్రీ సీ లక్ష్మారెడ్డి

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ను ప్రారంభించిందని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు చెప్పారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశాలతోపాటు ఎదిగిన దేశాల్లో కూడా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అతి భారమైనవి వైద్యఖర్చులేనన్నారు. తలనొప్పి లేదా ఏ చిన్న ఆరోగ్య సమస్యతో ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా పలురకాల వైద్యపరీక్షలు రాస్తారని, అవన్నీ చేయించుకోవాలంటే పేద ప్రజలపై ఆర్థికభారం పడుతుందని చెప్పారు. నిరుపేదలపై ఆర్థికభారం తగ్గించే క్రమంలోనే ప్రభుత్వం ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించాలని సంకల్పించి తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ను ప్రారంభించిందన్నారు.

నారాయణగూడలోని ఐపీఎం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంట్రల్ హబ్‌ను శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు తెలంగాణ డయాగ్నస్టిక్స్ బ్రోచర్, వెబ్‌పోర్టల్‌ను మంత్రులు ప్రారంభించారు. డయాగ్నస్టిక్స్‌లో మొట్టమొదట మంత్రి కేటీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యరంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్యరంగంలో వినూత్న, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్టు తెలిపారు. ప్రతిఒక్కరికీ ఉచిత కంటిపరీక్షలకోసం రాష్ట్రవ్యాప్తంగా శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకున్నామన్నారు.

నగర పేదల కోసం బస్తీ దవాఖానలు పేద ప్రజల కోసం హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఇప్పటికే 17 బస్తీ దవాఖానలను ప్రారంభించగా త్వరలో మరో 45 దవాఖానలను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖాన చొప్పున మొత్తం వెయ్యి బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. సామాన్యుడికి నయా పైసా ఖర్చులేకుండా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు, వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌కు నగరంలో 120 కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని ఎనిమిది మినీ హబ్స్‌కు పంపుతారని తెలిపారు. డయాగ్నస్టిక్స్ సెంట్రల్ హబ్ రోజూ మూడు షిప్టుల్లో పనిచేస్తుందన్నారు. శాంపిల్ ఇచ్చిన 24 గంటల్లోనే రిపోర్టు వచ్చేస్తుందని చెప్పారు. త్వరలోనే సీటీ స్కాన్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో డయాగ్నస్టిక్ కేం ద్రాన్ని ఏర్పాటుచేయడంతోపాటు బస్తీ దవాఖానలకు కూడా డయాగ్నస్టిక్ సేవలను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సిబ్బందిని కూడా పెంచేందుకు దృష్టిపెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రిని కేటీఆర్ కోరారు. కేసీఆర్ కిట్స్ తరహాలో డయాగ్నస్టిక్స్‌కు కూడా డాష్ బోర్డును రూపొందించాలని సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మానవీయ కోణంలో పనిచేస్తున్నదని, ప్రభుత్వ దవాఖానల్లో మరణించినవారి, పోస్టుమార్టం జరిపిన మృతదేహాలను గౌరవప్రదంగా సంబంధిత బంధువుల ఇండ్ల వద్దకు పూర్తి ఉచితంగా చేర్చేందుకు 50 పార్థివ వాహనాలను ప్రారంభించామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అనంతరం శుక్రవారం రక్తనమూనాలను ఇచ్చిన లింగమ్మ, రాణి, మణెమ్మలకు రిపోర్టులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డయాగ్నస్టిక్స్ సేవలు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. తమకు ఈ సేవలన్నీ ఉచితంగానే చేశారని, ఒక్కపైసా కూడా తీసుకోలేదని ఆ మహిళలు మంత్రికి వివరించారు. బయట రక్త పరీక్షలకు రూ.1500 తీసుకుంటారని, ఇక్కడ ఉచితంగా చేయడం వల్ల పేదలకు లాభం కలుగుతుందని చెప్పారు.

ఇదో మైలు రాయి: మంత్రి లక్ష్మారెడ్డి పేదల ప్రజలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం వైద్యారోగ్య శాఖలోనే మైలురాయి అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నగరంలోని ప్రజలంతా ఉచిత వైద్యపరీక్షల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతం లో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం లేక కార్పొరేట్ దవాఖానల్లో డబ్బులు పెట్టలేక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉండేదన్నారు. గత పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మార్చేసిందని, పేదవారికి స్పెషాల్టీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్న, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ శివప్రసాద్, డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, ఎంఎన్‌జే డైరెక్టర్ డాక్టర్ జయలత, గోపీకాంత్, టాటా ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

వైద్యరంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి గతంలో ప్రభుత్వ వైద్యం, అప్పట్లో పరిస్థితులు ఎట్లా ఉండెనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అప్పట్లో ప్రభుత్వ వైద్యం తీరుపై నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ సినీ కవులు పాటలు రాసే పరిస్థితి ఉండేదని చెప్పారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, వైద్యరంగంలో వినూత్న, విప్లవాత్మక మార్పులు తెచ్చిందని చెప్పారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర వైద్యం అందించేందుకు ఐసీయూ, చిన్నపిల్లల కోసం ఎన్‌ఐసీయూలు ఏర్పాటుచేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. కిడ్నీ బాధితులకోసం 40 డయాలసిస్ కేంద్రాలను స్థాపించామన్నరు. చరిత్రలో ఎవరూచేయని విధంగా కేసీఆర్ కిట్స్ ఇస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్స్‌తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరగడమే కాకుండా 40నుంచి 50శాతం సాధారణ ప్రసవాలు పెరిగాయని వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.